Tuesday, 21 August 2012

సమస్యాపురణము

సమస్యాపురణము

21/08/2012
రాముని ,
-----
క్షేమము గోరిన వారలు
రామునకున్ భక్తులు గద , రాక్షసు లెల్లన్
స్వామి శరాఘాతమునకు
తామసమును బొంది జన్మ ధన్యత గాంచెన్
24/08/2012
కలియుగపు బుద్ధునిపై 
------

న్యాయ దేవత వడి లోన కాయ ముంచి
వీధి కుక్క బలుకులకు విధులు మరచె
రాముడాతని పేరు రూపమ్ము జూడ
బుద్ధు డాతడు, హింసా నిబద్ధు డెపుడు

28/08/2012


కమలము భామల కర స్పర్శ కంటెను చంద్రుని దర్శనమునకై వేచియుండును  

కమలమును జూచి భామలు 
తమ కమనీయ వదనమును దడుము గొనునుగా 
జమున కర స్పర్శ గంటెను 
కమలమునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్ |  .

కేరళ లో చంద్రుని వెన్నెల హాయినిచ్చును 

సొగసు గానిల్వ కొలనులో, సుఖము నిచ్చె 
దనుజ కర స్పర్శలు కమల మునకు,చంద్రు 
డే సుఖమ్మును గూర్చు పాండేశ పురము 
నందు స్వామి దర్శనమున ముందు గాను |    

అమలకు, ప్రమదకు నిచ్చెను 
సమయము రమణుడు, మరచెను సాంగత్య మునన్ |
విముఖత్వము నున్నను హృ
త్కములమునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్  

తెలుగులో మాతనాడిన శిక్షలు వేయు పంతుళ్ళు  ఈ విధముగా జెప్పు 
-----
తెగులు బట్టి నట్టి తెలుగు బాషాభి మా 
నము తొలగ వలెను మనము తెలుగు తె 
లుగని గొంతు చించి రోగివలె నరచి 
బావినందు గప్ప గా వవదు 
------
తెలుగును తెంగ్లీసు జేసిన వారు 
----
లోక మొక్క కుగ్రామము రూక లున్న 
పనికి రాదు తేట తెనుగు "పబ్బు"లందు 
తెల్ల వారి బాషను బల్కు నల్ల వార్కి 
తెలుగు బాషాభి మానము తొలగ వలెను.

31/08/2012


తే : ధనముపై నాశ జనులకు ధరణిలోన 
     పాపములకు హేతు వగును , ప్రణవ మొకటె 
     వాదములు లేని నాదము వసుధ లోన 
     నిహపర సుఖమిచ్చు పధము యింపుగాను 
ఆ : ధరణిజులకు బెరుగ ధనముపై నాశలు 
      పాపములకు హేతు వగును , ప్రణవ 
      మొకటె  రోగ జగతి కుత్తమ మైనట్టి
     సుర వరమగు దెరచి జూడ నేడు 
క : దాపరికములో దారులు 
      పాపములకు హేతు వగును , ప్రణవ మొకటె గా 
      కాపాడును మునిజనులన్ 
      యాపద ముంగిట నిలువగ యమపాశముగన్  |

శ్రీ పండిత నేమాని గురువర్యులకు  పాదాభివందనము జేయుచూ,

ప్రాస యతులతో  మీ రామాయణ కావ్యము అద్భుతము .ప్రాస యతులను పుస్తకములో వ్రాసుకొను చుంటిని.   

తోటక వృత్తము లో చిన్ని ప్రయత్నము జేసితిని. మీరు తీరిక సమయములో ఒక తురి చదివి , మీ సవరణలను తెలుపగలరు  


   దమనుండు ముకుందుడు దైత్యులకున్ 
   దమకుండు  ముకుందుడు దాసులకున్   
   రమణీయము  స్వామి పరాక్రమముల్  
   దుమికించును  దూరము దుర్థినముల్ 
   సమయించు సమస్యలు సారముతో ( ధనముతో)
   కమలాప్తుని వేడిన కాయముతో 
   యమ బాధలు దీరును యాక్షణమున్ 
   సమాకురును సర్వము సాధనతో 
   విముఖత్వము జూపక వేగమునన్ 
   కమలాలయి బంపును కుంకుమతో  
   యమ పాశము మారును హారముగా 
   మమకారము జూపుము మావటియై  
1/09/2012  

  దుర్యోధనుని  స్వప్నములో "సూత సుతుడర్జునుని జంపెను" అను వార్తను వినెను .

ఆ : సుర వరు డగు సూత సుతుడర్జునుని జంపి
      ఖ్యాతి గనెను నేడు , ప్రీతి తోడ
      పాచికలను జూపి  బలుక శకుని మామ,
      దొలుగ  చింత, నృత్యములను జేసె

తే: సూత సుతుడర్జునుని జంపి ఖ్యాతి గనెను
    నేటి రణ రంగ మందున దాటి గాను
    శకుని మామ బలుక, సంతసమును బొంది
    కౌరవుల్ నృత్యములు జేసె కలసి మెలసి |

3/09/12
శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
గురువుగారి సవరణలకు ధన్యవాదములు

సూర్యుని వర ప్రసాదము గావున "సుర వరు డని " వాడితిని . నేను వ్యక్తిగతము గా ఏమి సాధించిననూ
అది అంతయూ మీరు పెట్టిన భిక్షయే. సవ్యసాచిని గాను మీ శిష్యుడను గురువుగారు.
వనము లందు మునులతోడ వాసమున్న
లవకుశ లను వారు కవలు, లక్ష్మ ణుని సు
తులకు సోదరుల్, బందించె, తొలుత వారు
 లక్ష్మ ణుని, యుద్దమును జేసె రాము తోడ |

మరో చిన్న ప్రయత్నము 

రవికులమ్మున జనియించె - రామ లక్ష్మణ భర తుల్ 
విధి కరమున జిక్కి రాము - విడచె సీత నడవిలో 
లవకుశలను వారు బుట్టె - రమణి సీత కపుడు యా 
 లవకుశలను వారు కవలు -లక్ష్మణు నిసుతు లకు నా 
వివరములను ముందు దె లిపె వినయ మండితమ్ము గా
40/09/20212
శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,గురువుగారి సవరణలకు ధన్యవాదములు
మీ దీవెనలు నాకు శ్రీరామ రక్ష

విత్త మంత్రి విదేశ పరిశ్రమల వల్ల చిల్లులున్న భోషాణము నిండునను మాటను
----
పన్నుల పైన బన్నులను- పాలక వర్గము వేయ నిండు నా ?
కన్నము లున్న దుత్తలు, మ  -గాడిని జూడుము , విత్త మంత్రిగా
నున్న చిదం బరం బలికె -నుత్తమ జాతికి జెంది  నట్టి నా 
దున్నకు దూడ బుట్టినది- దుగ్ధము బిండగ, దుత్త దె మ్మికన్
06/09/2012
పేద వాడికి రోగ మొచ్చి ఆసుపత్రి లో బాధలు పడలేక
--
దమకమ్మున దీయరు ప్రా
ణ ములను వైద్యులని విన్న నరుడు గలత జెం
ది మగత నిద్రన ముందుగ
యము గని రోగా త్తు డొక్క డానం దిం చెన్ |
--
శ్రీ హరిని వేడిన యమపాశము బాధిం చదని విన్న భక్తుడు
---
యమ పాశము, రాదిక యా
కమలాప్తుడు దాససతిని గాచును విముఖ
త్వము జూపక, యని వేడన
యము గని రోగా త్తు డొక్క డానం దిం చెన్ |
----
సి బి ఐ . వారు అపరాదులని జెప్పినను వారిపై ఎటు వంటి శిక్షలు వేయగలేము
అని (మన యములు )మంత్రి వర్యులు సెలవిచ్చిరి
---
దుమికిం చగ సి బి ఐ (చట్టము ) బొ
గ్గు మసిన దొరకెను గనులను గొన్న ఘనులు, దం
డము వేయ గ లేమను మన
యము గని రోగా త్తు డొక్క డానం దిం చెన్ |








Tuesday, 24 January 2012

శంకరాభరణం: సమస్యాపూరణం - 601 (విఱుగఁ బండిన చేలను)#links

శంకరాభరణం: సమస్యాపూరణం - 601 (విఱుగఁ బండిన చేలను)#links
గురువు గారు మీ మధుమేహం పూరణ అద్భుతం, మరియు కవిమిత్రుల పూరణలు బాగుగాయున్నవి.
నాయకుల వెంటదిరిగిన కాసులు కురియును, మరి కష్టపడి పండించవలసిన పని ఏమియున్నదని ? నా పూరణ
గడియ సమయము సభలోన కౌలుకుండి
విగ్రహములను బెట్టి దా వీధికెక్క
కురియు కాసులు, నోదార్పు దొరక నేడు
విఱుగ బండిన చేలను విడువ దగును
18/05/2012

 గురువు గారికి నమస్కారములతో 
-------------
సరసుడు ,మనోహరుడు సు 
స్థిర స్థానము బొంది భక్త శేషశయను (ది )
మర (నామ్త)కమున  రక్షిం 
చు రమణుడు మన నవనీత చోరుడు భక్తల్ 
మొరవిను సిరిపురవాసుడు 
గురువుల గురువు పరమాత్మ కురు గోవర్థన్ 
గిరిధారి పరాత్పర ద్వా 
పర పురుషునికై తపింప వలె సతి (ఏ)పుడున్
19/05/2012
గురువు గారికి నమస్కారములతో 
టైప్ జేయుటకు  కష్ట పడుతున్నాను గురువు గారు 
---------
 పచ్చ నోట్ల తోడ, పాపకర్మలు నేడు 
 నాలుగైదు కలుప నలువదయ్యె,
 వాపు బలుపు బెరుగ వగరు బోతు జనులు 
 సాము జేయు వారు చావు కోరి |

02/07/2012
గురువు గారికి నమస్కారములతో 
రాళ్లు గొట్టినే  నాలుగు రాళ్ళ తోడ 
తల్లి దండ్రుల గన్నుల తడిని తుడవ 
వచ్చితిని గాని , కాలులో వాలుగ దిగె 
రాయి ,రక్తము జిందె ధారాళ ముగను 
జూడు మిత్రమా, దేవుని జాలి లేని 
గుండె , పాపి కిచ్చును వెండి కోండలను జ
గతిని పేదరికము బెంచ , కష్ట జీవి 
పైన కరుణ,మమత మచ్చు  కైన లేదు.
03/07/2012
గురువు గారికి ధన్యవాదములు 
గురు దక్షిణగా నిచ్చిరి  
పరిపరి విధముల ఫలములు బసిడి బహుమతుల్ 
పరివారము తోడుగ , నం 
దరి కంటె నతివిలువైన దక్షిణ గొరకై 
సరియగు నుపాయ మిచ్చిన 
గురువుల ప్రియ శిష్యుడ గుదు కురువంశమునన్ 
గురి తోడ దెలుపుమా యని 
గురు పత్నిని గోరు వాడె గుణవంతుడగున్
04/07/2012

శ్రీ పండిత నేమాని గారికి ,గురువు గారికి ధన్యవాదములు
డా. ఏల్చూరి వారి కవితాంబుధిలో  తడిసి తనువు పులకరించె , మీ వంటి వారు ఈ  బ్లాగులో ప్రతి నిత్యము పూరణ జేసి మాకు మార్గనిర్దేశ్యము జేయ ప్రార్థన . మీకు,కవిపుంగవులందరికి పాదాభివందనము  జేయుచూ
---------
నేటి వార్త : మద్యము సేవించుటకు డబ్బులివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు
మత్తులో మునిగి దిరుగు మాన హీను
లకు , పరులను హింసించెడి రాక్షసులకు ,
కలియుగపు ఖలులకు  నేటి కౌరవులకు
పితరుని వధించి  తినినట్టి సుతుడె  హితుడు .

పొంగె  రక్తము దనతోడి పురజనులను
జూడ, సమరము సాగించ  కూడి వచ్చె
కుర్రకారు రాక్షసులపై  గుర్ర మెక్కి ,
దొరలకు తుదకు గుంపుగా దొరకి పోయె

దేశ మాత దాస్యము ద్రుంచ దిశను దెలుప
సమర శంఖము పూరించె, శరము తోడ
తెల్ల దొరల తోలువలుచ   తెగువ జూపి
యమరుడయ్యె  భగత్ సింగు యవని లోన

గువుగారికి , నేమాని గారికి ధన్యవాదము దెలుపుతూ
అడ్డ మైన గడ్డి తినిన వారికీ అవాంచిత రోమములు వచ్చునని చదివితిని అది మూలముగా
-----------------
గడ్డిని ప్రేమతో దినగ గడ్డము వచ్చెలె నొక్క నారికిన్
గుడ్డిగ రాజు యిష్టపడి కోమలి హస్తము బట్టె వేగమున్
గడ్డము గాంచె నడ్డముగ, కౌగిట బంధన గాంచి గోముగా
గడ్డము గీచుకొమ్మనుచు కాంతుడు భార్యకుఁ జెప్పెఁ బ్రీతితోన్.
----------
పరమ సుఖము నొంద పరుగులిడు యువత
మేను పట్టు దప్పె మిగుల నేడు
ముక్తి మార్గ మనుచు మునిగె విలువలిడి
భోగ రక్తుడగు ముముక్షు వెపుడు
( ముముక్షువు = యువత, యువత పెడ దారి పట్టుతపై )
గురువుగారికి , నేమాని వారికి నమస్కారములతో
--------
కేకలు వేయు కౌరవులు, కీర్తిని బొందిన పాండుపుత్రులన్
భీకర యుద్దమందుగని భీతిని బొందిరి, భీమ పేరునన్
కాకిని జంపి కౌరవులు గర్జన జేసిరి సంతసమ్మునన్
మైకము నందునన్ మునిగి,మాగుడు కాలము ముందునిల్వగన్
(keraTAlanu = kaShTalanu) June 01, 2012 10:22 AM

05/07/2012


శ్రీ శ్రీ గురువుగారికి , శ్రీ  పండిత నేమాని వారికి నమస్కారములతో
--------

నిన్ను వేడుకొంటిని స్వామి నిత్యము  ధన
వంతుల పలుకులను విన వద్దని  ఘన
మైన కానుకల్ నీకిచ్చి యనవరతము
వారు రక్తము రుచి జూచి దిరుగ , "జగతి "

నందు జనులు జెడుద్రోవ నందు నడచు
 మేలు కొనవయ్య స్వామి మమ్మేలు కొనుము
పాపుల పనిబట్టి వ్యధలు మాపుమయ్య
పతిత పావన! ధరణీశ ! పరమ పురుష .
-----
 గువుగారికి  ధన్యవాదము దెలుపుతూ

గానము జేసినా రామా |
నీనామము సద్గతులను నేరుగ బొం దున్,
వానర జాతికి వరముల్ 
 దానవ జాతులను ద్రుంచి, తారక రామా 
మానవ రూపము లో నీ
దేనియ బలుకులను వినిన దేశ ప్రజలకున్ 
మానిక ,భద్రాద్రి నివా
సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

09/07/2012

గురువుగారికి , నేమాని వారికి, మరియు  కవిమిత్రులకు  నమస్కారములతో
 శ్రీ నేమాని వారి గర్భ కవితలు జూచి చిన్ని  ప్రయత్నము

సీ /ఆ .వె :శంక రాభరణము స్వాగతము బలుకు
                      సాధకులకు , సాధు సజ్జనులకు
             పద్య రచన, దత్త పది , నిషిద్దాక్షరి ,
                     నవరసములు నింపి యావకాయ
            పచ్చడి వలె నిచ్చు , పాదము నిత్యము
                    ప్రాస యతుల తోడ పాఠ్య ము, మన
           సంశయములు దీర్చు సత్కవులు గలరు
                  సరసిజాత మిడచు సంధ్య వేళ
తే :        సహకరించని జేతికి శక్తి నిచ్చి
             వంకరలు దీయు  రయమున శంకరయ్య
             గారి కలము చాల రసవత్తరము గాను
             కోరు పద్య ప్రేమికు లెల్ల వీరి బ్లాగు


వేద సారమ్ము జూచి శ్రీ విష్ణువునకు
వైరి వర్గము, బొందెను వారము తోడ
పరమ పదములని దెలియ పాపులెల్ల
రనుసరిం చి రా మార్గము నవనిపైన
రాక్షసులు సాధు జనులతో రణము జేయ
పుణ్య మూర్తుల కీర్తికి పురుగు బట్ట
పాడు నీతులు రయమున బరుగు బెట్టె
మరల నీకై నిరీక్షించె  మనుజులెల్ల |

11/07/2012
గురువుగారికి నమస్కారములతో

నేడు నయవంచకుల ఆలోచనలు ఈ విధముగా

చేత జిక్కె జింక యొకటి జిత్రముగను
భర్త మదిని దలచె నా వివాహమందు,
నా కరము భర్త శిరముపై నైన దనియు
మంత్ర బంధువుల్ సాక్షిగా మగువ మురిసె .
14/08/12

భోజనశాలకు రాత్రికి వేయు వసిష్ట వేషము తో వచ్చిన వారికి ఏమి కావలెననియడిగిన  యువతితో
--------
కోన సీమలో  "రామలు" వానగురియ
లభ్యమని దెలియగ చేపల పులుసడిగె
రా వసిష్టుడు ప్రీతితో, రాత్రి వేష
మందు, ముందునిలచినట్టి మగువ తోడ 
("రామలు"  = చేపలు )
18/08/2012
శ్రీ గురువుగారికి , శ్రీ నేమాని వారికి నమస్కారములతో






Sunday, 22 January 2012

శంకరాభరణం: సమస్యాపూరణం - 600 (కోటికి పడగెత్తికూడ)

శంకరాభరణం: సమస్యాపూరణం - 600 (కోటికి పడగెత్తికూడ)
గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి, కవులందరికి ధన్యవాదములు,
యతిస్థానము తెలియక ప్రాసనియమము తప్పినది క్షమించగలరు.
కోటీశ్వరుడగు కృష్ణుడు
కాటుక కనులవెలయాలి కవ్వింపులకున్
దీటుగ నోటుల విసరగ
కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్
11/07/2012

గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి  ధన్యవాదములు,
పాదాభివందనము జేయుచూ

హాస్యము గా

తల్లి నేర్పు విద్య తప్పుగా వచ్చు గా
ని, దన హితులు జెప్పు నీతు లెల్ల
నిజము కాదు గాని, నిగమము బాటించు
దండ్రి నేర్పు విద్య తప్పు గాదె

13/07/2012


గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి  ధన్యవాదములు,
పాదాభివందనము జేయుచూ


వార్త : పసికందును చెత్త కుండీలో పారవేసిరి

పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె త్రోవ
యందు నడచి బోవ, ముందు వెనుక
జూడ, లేదు పరుల జాడ, వాడకు దెచ్చి
దెలిపె నా విషయము తెగువ తోడ .

17/07/2012


గురువు గారికి జన్మ దిన శుభాకాంక్షలు ,గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి  పాదాభివందనము జేయుచూ


నేమాని వారి వృత్తములో  హాస్యముగా
రచయిత తస్లిమా , సల్మాన్ రష్డిల పై దాడులను

కలము నుండి జారి పడ్డ కఠిన మైన పదములే
బలము నిచ్చు మత ఖలులకు, ఫలము గాదు సత్యమున్
కలియుగమున దెలుప దలచ, కలుగు లోని యెలుకలా
బలుక బాష రాని వాడె పండితుండు  పుడమిపై |

20/07/2012


గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి  పాదాభివందనము జేయుచూ


వరంగల్ లో ఒక గ్యాంగ్ స్టార్ విజటింగ్ కార్డు ప్రింటింగ్ జేసి పంచుతుండెను.
అటు వంటి వారు కష్టములలో కాపాడగలరని భావించిన యువతి గిరిజ
----
కలియుగమున ఖలులు కీర్తి గాంచ , దలచె
సజ్జనుల సాంగత్యము 'జగతి ' నందు
పాడి గాదని దనను గాపాడి నట్టి
కపట గపిని వలచి గిరిజ తపము సేసె |

నలమల యడవి మధ్యన నడచు చుండ
యావు  త్రొక్కిన శివలింగ మైనది ఘన
పుణ్య క్షేత్రము,  వింతగా పుష్కరిణికి
జలము జేరు, నెమ్మది జేరు జనులకెల్ల |

అంతగునకు నిలయ మగు మహా నందికి
పరుగుతోడ రండి పావనమగు
జన్మ పుష్కరిణిన స్నాన మాడగనే స
కల సుఖములు బొందు కాయమెల్ల |












Thursday, 19 January 2012

శంకరాభరణం: సమస్యాపూరణం - 597 (చెడుగులతో దేశమెల్ల)

శంకరాభరణం: సమస్యాపూరణం - 597 (చెడుగులతో దేశమెల్ల)
గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
మన నేతల తొందరపాటు నిర్ణయములతో, బహుళజాతి కంపెనీల నిర్వాకములతో
నేడు మనదేశము అభివృద్ధి జెందినట్లు కనిపించెనా అది శూన్యమే
-----------
మిడిమిడి జ్ఞానపు నేతలు
వడివడిగా నిర్ణయముల వడ్డనతోడన్
నడతెంచిన పరదేశపు
చెడుగులతో దేశమెల్ల శ్రీకరమయ్యెన్
18/07/2012

గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ

క్రొత్త కాపురములోన కలతలను కూతురి ద్వారా తెలుసుకుని, అత్తమామలు
అల్లుడి తప్పులను సరి జేయగ  వచ్చిరి . వారి రాకతో దంపతుల మధ్య యున్న వైరము పెరిగిపోయే .

కాపురములోన వచ్చెను కలతలు, దన
పుత్రిక కబురు విని వారు పొదిలి యేడ్చి
నెపము లెంచ ముందుగ వచ్చిన పని సఫల
మయ్యె , వైరము హెచ్చెను యా దినమున .
19/07/2012
గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
గురువు గారు పద్య పాదములను మార్చుట శ్రీ పండిత నేమాని వారిది . వారి యడుగు జాడలలో నడచుటకు చిన్ని ప్రయత్నము . ఇది వారి రామాయణము గొప్పదనము దప్ప నాది కాదు.
నాకు తెసిన ఒక కుటుంబములో కోడలు అత్త ముట్టిన, పట్టినవి ముట్టదు . ఆ పై కోపతాపములను ప్రదర్శించును .
పుట్టింటి వైభవమును రోజులకొలది జెప్పును .     ఆ యత్త
------
కోపతాపములను జూపు గోడలి గని
ముగిసె నాషాడ మని యేడ్చే , ముద్దు గుమ్మ
మురిసె పతి యింట పాదము మోపి, దెలిపె
పుట్టినింటి సంగతులను గట్టిగాను .
-----
అత్త గారు ముగిసె నాశాడ మని యేడ్చే ,
ముద్దు గుమ్మ మనసు హద్దు దాటె
పతిని గాంచి దెలిపె నతి వేగమున పుట్టి
నింటి కబురులెల్ల  నింపుగాను .
24/07/2012


గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
తప్పులను జూపి ,సవరణలను జేయ ప్రార్థన 
------
 పుడమి భారమునను ముడువగా వచ్చిన
         వామనుడవు నీవు భక్తపాల
మర్మములను దెల్పు కూర్మ రూపు డవని
        వార్థి దాటె జనులు భక్తపాల 
పుడమి జనుల కెల్ల నడిగిన వరమిచ్చు
        పరమ గురువు నీవు  భక్తపాల 
దేవ దానవులకు మావటి వని విని 
       బడయ వడిగ వచ్చె భక్తపాల 
వైరి వర్గములకు కూరిమి తోడను 
       ముక్తి పదము నిచ్చు భక్తపాల 
దురితములను దీర్చు ధర ప్రాణి కోటికి 
      భుక్తి నిచ్చిన ఘన భక్తపాల 
-------
జిడ్డు గడలి యందు శేషశాయనునకు 
     సేవజేయు సిరికి జెప్ప కుండె,
శంఖ చక్ర గదల వంక జాడక పారు 
    చుండె , మకరి  నోట సోలు చున్న 
కరి మొరలను విన్న కంజ నేత్రుడు క్షీర 
   సాగరమును వీడి , సాధు రక్ష 
కుడు ముముక్షువులను పుడమినందున గాచు 
  భాను తెజమువలె, భక్త వత్స 
లుండు భక్తుల మొర లువిని  దశావ తా 
  రములు దాల్చె నుగ  ధరా తలమున 
రాక్షసమును జంపి రక్షించు నీ దివ్య 
  నామ మంత్ర మహిమ నరులనెల్ల |


శ్రీ నేమాని గురువు గారి దీవెనలు

మీ ప్రయత్నములను మెచ్చుచు శ్రీహరి
ఊతమొసగు గాక ప్రీతి తోడ
మీ రచనము మెండు మేలొన గూర్చుత
మీకు నెల్ల యెడల నో కవివర!

 





 


Friday, 11 November 2011

భక్తి

పల్లవి :నిజము దెలియక నీనామ మిడచి నే నింత కాలము మూర్ఖుడ నైతిని స్వామీ......
చ:1. ఆశల గిరులపై అనుబందపు సాలెగూళ్ళను గట్టి వ్యథలు జెందితి స్వామీ...... || నిజము || 
2. అవమానములన్నియు నవనాడులు నిండగ నిద్రకు నీళ్ళొదిలితి స్వామీ...... || నిజము || 
3. శివుని రాజ్యమందున చీమకు జిక్కును మనిషిగ నే నేపాపము జేసితి స్వామీ...... || నిజము || 
4. అసురలకందరికి అభయము నిచ్చితివి నేనంతటి అధముడనా స్వామీ...... || నిజము || 
5. కొడుకుల కోసమని కూడబెట్టి నే గూటికి కరువై దిరుగుచుంటిని స్వామీ...... || నిజము || 
6. అందమందమని నే నీ మాయ లోక మందున కురూపినైతిని స్వామీ...... || నిజము || 
7. ఈభవ బంధమ్ముల బాధలను తాళలేక నిను వేడుకొనుచుంటిని స్వామీ...... || నిజము || 
8. పాఱుపత్తెపు పలుకులు పాముల వంటివని పాతర వేసితి స్వామీ...... || నిజము || 
9 నాకందేనా నీ దివ్య చరణాలు కన్నీటితో కడుగుటకు స్వామీ...... || నిజము ||
10. అణువణువునా నుండెడి వాడవే నా దేహమందు చోటు లేకుండెనా? స్వామీ...... || నిజము || 
11. తప్పులెంచక తమము దీర్చి తోడుగ నుండుము స్వామీ...... || నిజము || 

పల్లవి: దేవి దేవి జగదాంబ ! దేవి దేవి దుర్గాంబ
. మహిషాసురుని మర్థించి ! మైసూరందు కొలువుండి మమ్ముగాచిన చాముండి...చాముండి...చాముండి || దేవి దేవి ||

. శంకరాచార్యులతో నడచి ! శృంగేరి యందు కొలువుండి మా చదువుల తల్లి శారదాంబ...శారదాంబ...శారదాంబ || దేవి దేవి ||
. కృష్ణమ్మ కోరగ కరుణించి ! విజయవాడ లోన కొలువుండి మా దుర్గతి ద్రుంచిన దుర్గాంబ... దుర్గాంబ ...దుర్గాంబ || దేవి దేవి ||
. వనదేవత వడ్డించ ! హోర్నాడందు కొలువుండి మా యకలి దీర్చిన అన్నపూర్ణేశ్వరి ...అన్నపూర్ణేశ్వరి ...అన్నపూర్ణేశ్వరి|| దేవి దేవి ||
. శివ కేశవులకు సాటిగ నిలచి ! కంచిలోన కొలువుండి మా కష్టము దీర్చిన కామాక్షి ... కామాక్షి ...కామాక్షి || దేవి దేవి ||
. ముక్కంటిని మురిపించి ! మధురలోన కొలువుండి మా మిరాశి మీనాక్షి... మీనాక్షి ...మీనాక్షి || దేవి దేవి ||
. విశ్వేశ్వరుని వరియించి ! కాశీలోన కొలువుండి మా వికృతి దీర్చిన విశాలాక్షి ... విశాలాక్షి ...విశాలాక్షి || దేవి దేవి ||
 సీ:
రవికుల దశరథ రాజసుతునిగ జ |  న్మించె విష్ణువు ముని జనగణము
రక్షింప ధరణిపై రాక్షసులను జంపి | తపసి యాగము గాచి తమముదీర్చి
శివుని విల్లు విరచి సీతనుబెండ్లాడి | దారతోడ నయోధ్య జేరి, తండ్రి
మాటకై యడవికి మరలెను తా సతి |   తమ్మునితోగూడి త్వరితగతిని
మారీచుడు మృగమై మాయజేయగ రావ |  ణాసురునకు జిక్కె నాడు సీత
కిష్కింధ జేరి సుగ్రీవ హనుమ జాంబ|  వంతుల తోగూడి వాలిని వధి
యించి రాజ్య మతని కిచ్చి రాజుగ జేసె; |  లంకిణి జంపి, జలధిని దాటి
గనుగొనె సీతను కపిరాజు వనమందు |    నంగుళీయకమును నమ్మకిచ్చి

వాయు నందన  దెచ్చెన  వార్తలు విని
వారధిని గట్టె, కడలిపై వానరులు స
కాలమున నటు లంకకు కాలు మోపి
రావణాదుల గూల్చిరి రణముజేసి
 

రావణానుజు మన్నించి రాజ్యమిచ్చి
పుష్పకవిమానమందున పురముజేరి
రాజ్యమేలెను పురజనరంజకముగ
రక్తి నాదర్శ పురుషుడై రాము డవని.


శుభమస్తు!


సీ . శేషాద్రి గిరిపైన శయనించె నాస్వామి | యెల్లలోకములను నేలివచ్చి
నీలాద్రి గిరిపైన నిద్రించె నాస్వామి | యెల్ల రాక్షసులను నేరివేసి
గరుడాద్రి గిరిపైన కనిపించె నాస్వామి| యెల్ల విఘ్నములను కల్లజేయ
అంజనాద్రిగిరిపై నందుకొనె స్వామి | యెల్ల వినతులను మెల్లగాను
వరునిగ వృషభాద్రిన స్వామి వరములిచ్చె
శిలల నారాయణాద్రిపై జింత దీర్చె
మొదట వేంకటాద్రికి జేర ముక్తినిచ్చె
సప్తగిరి దాట తమము సమాప్తిజేసె|

సీ .
సి )అంజనాద్రిగిరిపై నంజలి ఘటియించి| పాదదాసుడనౌదు ముదముతోడ
వెంకటాద్రిన నేను వేంకటేశుని జూడ | పరమపదవి గందు పరుగు తోడ
నారాయనాద్రిన నారద బూజిత | పాదు ప్రక్క నడచతు భక్తి తోడ
శేషాద్రి పై జేరి శయనించిన పరమ| పురుషుని జేరెద ప్రజ్ఞ తోడ
గురుని గరుడాద్రి పైనేను గురుతుగాను
వరుని వృషభాద్రి పైనేను దిరుగబోదు
మరలు గొల్పు శ్రీవారిని మరల బట్టి
ఉభయ దేవేరులకు మధ్య నుండ జేతు |


ఆ)
సప్తగిరులపైన నాప్తుడని దెలియ
సప్తగిరులయందు గుప్త చిత్తు,
సప్త సక్తులను సమాప్తిచేయగ నేను
సప్తగిరులమెట్టె స్వామి నేడు|
సీ .అకళ్యాణ రాముని కమనీయ చరితము | కనులార జూడగ కలసి వచ్చె
నవనీత చోరుని నటనముల్ జూడగ | నట్టడవిని దాట నడచి వచ్చె|
తిరునామమును పెట్టు తిరుమల వాసుని| తీరును జూడగ తిరిగి వచ్చె
సిరులిచ్చి గాపాడు శ్రీనివాసునకును| ముడుపులు జెల్లింప నడచి వచ్చె|
కలతలను త్రుంచమని వేడ కదలి వచ్చె|
వ్యథలగడతేర్చ మని కోర వడిగ వచ్చె|
ముక్తినిచ్చిగాపాడగ రక్తితోడ|

పరమ పురుషుడని దెలియ బడయ వచ్చె|
28/nov/2011

౧శరణం స్వామియె శరణం
శరణం హరిహర సుపుత్ర శరణం శరణం
శరణం సద్గురు శరణం
శరణం ఎరుమేలి వాస శరణం శరణం
౨శరణం స్వామియె శరణం
శరణం మాధవ కుమార శరణం శరణం
శరణం శాస్తా శరణం
శరణం శబరిగిరివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం శంకర కుమార శరణం శరణం
శరణం హేప్రభు శరణం
శరణం పంపానివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం
శరణం సత్ప్రభు శరణం
శరణం అళుదా నివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం ఆనందరూప శరణంశరణం
శరణం మోహన శరణం
శరణం పూంగా వనవిభు శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం ఇరుముడి ప్రియునకు శరణం శరణం
శరణం రక్షక శరణం
శరణం నీలిమలవాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం వీరమణి కంఠ శరణం శరణం
శరణం విష్ణుం శరణం
శరణం పులివాహనునకు శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం శిరియాన వట్ట శరణంశరణం
శరణం వల్లభ శరణం
శరణం పెరియాన వట్ట శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం విల్లాలి వీర శరణంశరణం
శరణం నిర్గుణ శరణం
శరణం పందళ నివాస శరణం శరణం
౧౦
శరణం స్వామియె శరణం
శరణం గురువాయురప్ప శరణంశరణం
శరణం సతతం శరణం
శరణం కాంతమల జ్యోతి శరణం శరణం
౧౧
శరణం స్వామియె శరణం
శరణం మణికంఠ స్వామి శరణంశరణం
శరణం అగజా శరణం
శరణం భూలోకనాథ శరణం శరణం
౧౨
శరణం స్వామియె శరణం
శరణం జ్యోతియ స్వరూప శరణంశరణం
శరణం ఈశ్వర శరణం
శరణం వరదైత్య దమన శరణం శరణం
౧౩
శరణం స్వామియె శరణం
శరణం భువనేశ్వర తవ శరణంశరణం
శరణం షన్ముఖ శరణం
శరణం కలియుగ వరదుడ శరణం శరణం
౧౪
శరణం స్వామియె శరణం
శరణం నారాయణునకు శరణంశరణం
శరణం శ్రీధర శరణం
శరణం రాజాధిరాజ శరణం శరణం
౧౫
శరణం స్వామియె శరణం
శరణం సుర మునిసురక్ష శరణంశరణం
శరణం వీరా శరణం
శరణం పురుషోత్తమునకు శరణం శరణం
౧౬
శరణం స్వామియె శరణం
శరణం మధుసూదనునకు శరణంశరణం
శరణం కేశవ శరణం
శరణం శ్రీరామ చంద్ర శరణం శరణం
౧౭
శరణం స్వామియె శరణం
శరణం కమలేక్షణునకు శరణంశరణం
శరణం సద్గుణ శరణం
శరణం దామోదరునకు శరణం శరణం
౧౮
శరణం స్వామియె శరణం
శరణం నర్తన సుప్రియ శరణంశరణం
శరణం నిరతం శరణం
శరణం మాతా పిత గురు శరణం శరణం

రామా| ఇనకుల సోమా
సోమా| నీనామమేను సోబడు రామా|

రామా| జానకి ధామా|
ధామా| దుర్వాద ద్రుంచు తారక రామా|
( దుర్వాద= నింద)

రామా! రవికుల సోమా!

సోమా! సకల సుగుణాభి సుందర రామా!
రామా! జానకి ధామా!
ధామా! దురితము దహించు దావరి రామా!

21/07/2012
సీ :
సీస పద్యములను వ్రాసెద శ్రీపతి | పాద పద్మములకు ప్రణతి జేసి 
నఖిల లోకములకు నాదారముగ నుండి | మునిజనులను గాచ ముందునిలచు 
శేష శయనుడైన  శ్రీ హరి చరితను, |పుడమి జనులనెల్ల బుట్ట తేనె 
దరికిజేర్తు దిరిగి దిరిగి, దశా వతా | రములు ధరణి యందు  రక్కసులను 
జంపి, పరమ భక్త జనులను రక్షించి 
ధర్మ మార్గములను కర్మతోడ 
దెలుప నెంచి, తనదు దేహ బలము జూప 
గాదు , శరణు యన్న కలిమి నిచ్చు | |
----
రామాయణ ఘట్టములు  కొన్ని తోటక వృత్తములో 

పరివర్తన జెందిన పామరుడే 
విరచించె చరిత్రను వృత్తముగా (వేదము )
త్వరి తమ్మున బ్రోయగ దాససతిన్ 
నరయాసము బట్టిరి నాడికమున్

మురిపించగ జింకయె పుత్తడి గా 
మరి గోరెను సీతయె మైకమునన్ 
పరిగెత్తెను రాముడు వాకమునన్ 
పరి మార్చెను జింకను బాణముతో 

సరితూగు స్వరమ్మున సాధకుడై
మరణించుచు బల్కెను మంజువుగా     
దుర వాసము గోరిన దుర్జనుడై 
ధరణీజను లంకకు తంత్రమునన్ 

నరపాలుడు జేర్చెను నాశము కై 
పరమాత్ముని గాంచిన వానరులే 
శరణాగతవత్సల  సఖ్యము కై 
పరివారము తోడుగ వచ్చెనులే 

దొర తారక రాముని దూత్యము కై 
పర దేశము మారుతి పాదమిడెన్ 
దరహాసము జేయగ దైత్యసతుల్ 
పరికోపము జెందియె వాలముతో 

పుర వీధులు గాల్చెను పూర్ణముగా 
కరిపించెను వైరిని కాతరుడై 
 ధరణీజను గాంచెను  తంత్రముతో 
డరి వర్గము జెందెను యాతనముల్ 


 

  







Thursday, 11 August 2011

వరకట్నం

ఆ: కందుకూరి వారు కదనరంగానలే
    రు మన కంది శంకరయ్య గారు
    కట్న కదన మందు కలముతో పోరాడ
    రామ బంటునౌదు రణము లోన|

నిన్న ఓరాక్షసుడు తన బార్యను ఆడపిల్లను కన్నదని చంపేసాడు, మరొకడు
ఆడపిల్లను కనబోతున్నదని కట్నము మళ్ళతెమ్మని చెప్పి చంపేసాడు.

౧. పాపబారమొక్క పాపది గాదురా
    సృష్టికార్యమందు సకల జగతి
    సంతసించు తోడు సహధర్మ చారిణి
    లేకయున్న నీవు లెస్స గాదు|
౨. ఆడపిల్ల రాదు ఆడువారలనుండి
    రొమ్ముపాలు ద్రాగి కొమ్ములొచ్చి
    కొడుకు కొఱకు కొరివి గొడుగు నీడన నిద్ర
    పోకు, నిజము దెలియు నీకు వేమ| ( సాదు)
నాపెరులోని సాదు వేమన గారి స్థానమందు వాడుకోవాలిని ఉంది, మీ అభిప్రాయమును తెలుపగలరు
.ఆడపిల్ల రాదు ఆడువారలనుండి   
    జంట గాక యున్న జగతి లేదు   
    పాపబారమొక్క పాపది గాదురా   
    నీకు సగము గలదు నిజము గాను|
౧౨/౦౮/౧౧

 క:

Tuesday, 24 May 2011

యోగ


సెల్ ఫోన్, వాహన కాలుష్యము, యంత్రముల శబ్ధములు యోగ చేయకపోవడము, జంక్ ఫూడ్ తినడము మరియు ఉప్పు అన్నిటియందువేసుకొని తినడము చూచి వ్రాసినది
సీ: నిద్రబద్దకములు నీకీయవు సిరులు | ఆరోగ్య సంపదలబ్బు, నన్న
రసములన్నియరగి రక్తమందు గలియ| ఇందన వాహనమిచ్చు ముదము
యంత్రము దెచ్చును యమభాదలను వేగ| నరకము జేయును నరులకెల్ల
నాలుగడుగులేయి నీకోసముదయాన | కాళ్ళకు వేయకు కళ్ళెములను
ఆ: అడ్డ మైన గడ్డి నడవిజంతువులైన
ముట్టకుండు, జనులు మట్టిలోన
ఎంతవారలైన కాంతదాసులు, తావు(మీరు)
సంగ్రహించుకొండి సత్యమెల్ల.
( కాంత === నాలుక), తావు = మీరు కన్నడభాషలో.
మట్టలోన== భూలోకమున,

ఆ: కష్టమొచ్చిబడ్డ గలతజెందకవిల్లు
సిద్ధబరచి వేగ బుద్ధిశరము
జేతబట్టినీవు సంధించ, ఫలమిచ్చు
పారిబోవదగదు పురుషులకును.
సమస్యను చూచి పారిపోకు మిత్రమా, ధైర్యంగా ఎదురించు.


07/06/2011