Thursday, 13 March 2014

తారక మంత్రము కోరిన దొరకెను...

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట   
  ధన్యాసి రాగము = ఆది తాళము 
==============*================
తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓ రన్నా! 
మీరిన కాలుని దూతల పాలిటి  మృత్యువు యని నమ్మక యున్నా!! తా !!

మచ్చిక తో ని క బాత కంబుల మాయలలో బడ బో కన్నా! 
హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు లెలమి  దిరుగ బని లేదన్నా!!తా !!

ముచ్చటగా నా పుణ్య నదులలో ముని గెడి పని యేమిటి కన్నా!
వచ్చెడి పర్వపు దినములలో సుడి వడి పడుటలు మాను మికన్నా!!తా !!

ఎన్ని జన్మముల నెంచి చూచినను ఏకో నారాయణు డన్నా!
అన్ని రూపులై యున్న పరమాత్ముని నా మహాత్ము కధలను విన్నా!!తా !!

ఎన్ని జన్మముల జేసిన పాపము లీ జన్మము తో విడు నన్నా!
అన్నిటి కిది కడ సారి జన్మ మిది సత్యం బిక బుట్టుట సున్నా !!తా !!

నిర్మల మంతర్లక్ష్య భావమున నిత్యానందము తో నున్న!
కర్మంబులు విడి మోక్ష సద్గతిని గన్నుల నే చూచు చును న్నా!!తా !!

ధర్మము తప్పక భద్రా ద్రీశుని దన మదిలో నమ్ముచు నున్న!
మర్మము దెలిసిన రామదాసుని మందిర మున కేగుచునున్న  !!తా !!     

Tuesday, 11 March 2014

రామా యను కొండి !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

మా అమ్మ గారి చిన్నతనములో ఒక భక్తురాలు పాడిన  పాట, కానీ ఇప్పుడు మా అమ్మ గారికి కూడా గుర్తు లేదు. కొన్ని చరణములు గుర్తు వచ్చినవి, కొన్ని పదములు మారి యుండ వచ్చు మీకు తెలిసిన తెలుప ప్రార్థన !

==============*================

ప : రామా.. యను కొండి ! శ్రీ  రామా.. యను కొండి ! అపుడెపుడో... మీరన లేరు ! ఇపుడే శ్రీ రామా... యను కొండి ! 

1.కాకులు గూటికి జేరక ముందే ! కన్న కొడుకు దండించక ముందే !! రామా!!

2.కంటి జూపు తగ్గక ముందే ! కాళ్ళూ జేతులు వణకక ముందే !! రామా!! 

3.పంచ భూతములు పగ బట్టక ముందే ! దుర్వార్తలు దరి జేరక ముందే !! రామా!!

4.పండ్ల పటుత్వము తగ్గక ముందే ! కాటికి కాళ్ళను జాపక ముందే !! రామా!!

5.యమ పాశము దరి జేరక ముందే ! కాలుని రాకను గాంచక ముందే !! రామా!!   

Monday, 10 March 2014

బ్రహ్మ పట్నము పోద మంటే......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

మా అమ్మ గారి చిన్నతనములో ఒక భక్తురాలు పాడిన  పాట

==============*================

చ : బ్రహ్మ పట్నము పోద మంటే పిరికి పుడుతుం దన్నయా ! 
పిరికి దీసి వెరుక బరచి.. పరమనొందవె చెల్లులా !   

బ్రహ్మ పట్నము పోద మంటే నదీ యడ్డము రన్నయా !
"ఓంకార" మనెడి తెడ్డి దీసి పడవ నడపి.. పరమనొందవె చెల్లులా ! 
   
బ్రహ్మ పట్నము పోద మంటే నడవి యడ్డము రన్నయా !
"ఓంకార" మనెడి కత్తి  దీసి అడవి నరకి.. పరమనొందవె చెల్లులా !

అన్న నిన్ను జూద్ద మంటే చీకటొస్తుం దన్నయా !  
"ఓంకార" మనెడి జ్యోతి వెలిగించి.. నన్ను జూడవె చెల్లులా !

Saturday, 8 March 2014

భజన జేసే విధము దెలియండీ!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట   

సౌరాష్ట్ర   రాగము 
==============*================
భజన జేసే విధము దెలియండీ! జనులార మీరు నిజము గనుగొని మోదమందండి !! భ !!    
             
భజన జేసే విధము తెలియక నిజముగా హరి భక్తు లనుకొని మద గజము తెగ వ్రేయ లేకను !సుజనులని తిరుగంగ నేలను !! భ !!  

వారు వీరని యెంచ బోకండీ! జనులార మీరు! నోరు జచ్చిన వారు గాకండీ ! 
వారు వీరని యెంచు టెల్లను సారము లేనట్టి హీనత ! పౌరుల కే గాక పుణ్యము యూరి కదలం దేమి  యున్నది !! భ !! 

జ్ఞానులను కొని యెగసి పడి యజ్ఞా నములు పై బెట్టు కొనినను ! మానసంబున బుట్టి వచ్చియు పూని మరి జన్మింప వలయు !! భ !! 

ఝాట మాట లాడ బోకండీ!నరులార కలియుగ నాటకములో జిక్క బోకండీ!ఝాట మాట లాడి పొట్ట కూటికి వేషములు దాల్చక ! యాటికి యమ బాధలచే కాటికి పోవంగ నేటికి  !! భ !!

మూల స్థానము తెలిసి బ్రతకండి !  జనులార మీరు! మేలిమిగ శ్రీ హరిని వెదకండి !  మూల స్థానము తెలిసి మీలో చాలగా వెలిగేటి జ్యోతిలో ! లీలమై వెలుగొందు బాలుని నీల మధ్యము నందు దలచుచు  !! భ !!

ధరణి శ్రీ నరహరిని గొలువండి ! జనులార మీరు!  పరమ పదవిని పొంద గోరండి ! ధరను  శ్రీ ఘటికాద్రి వర హరి పరమ భక్త వరుల మనుకొని ! విరివిగా నరసింహ దాసుని వర కవిత్వము సారమను కొని  !! భ !!  

Friday, 7 March 2014

వెఱ్ఱి మనసా !

బ్లాగు వీక్షకులేల్లరికి శుభోదయం !

శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట   

జంఝాటి రాగము 
==========*==================

నర హరిని నమ్మక నరులను నమ్మిన నర జన్మ మీడేరున ! చెరకుండగ వెఱ్ఱి చెరకును నమ్మిన జిహ్వాకు రుచి పుట్టున మనసా !! నర !!

కాళ్లుండగ మోకాళ్ళతో నడిచిన కాశికి పోవచ్చున ! నీళ్లుండగ ఉమ్మి నీటిని మ్రింగిన నిండు దాహము తీరున   మనసా !! నర !!

కొమ్మ యుండగ కొయ్య బొమ్మను కలసిన గోరిక గొన సాగున మనసా !! నర !!

అమ్మా యుండగ పెద్దమ్మా ను గోరిన యర్థము చేకూడున  మనసా !! నర !!

అన్నముండగ సన్న బియ్యము తిని నంత యాకలి వెత తీరున మనసా !! నర !!

వెలదు లుండగా చిత్ర కన్నెల గలసిన కామ వ్యధ  తీరున మనసా !! నర !!

క్షుద్ర బాధచే నుపద్రవమును బడు వేళ నిద్ర కంటికి వచ్చునా ! భద్ర గిరీశు పై భక్తి లేని నరుడు పరమును గన నేర్చునా మనసా !! నర !!                 

Thursday, 6 March 2014

రాతి రోలన వలెను!

హాయిరి రాగము- చాపు తాళము

రామాయని మిమ్ము దలుచని నోరు! రాతి రోలన వలెను! 


ముమ్మాటికి రాతి రోలన వలెను! 

బ్రతికినన్నాళ్ళు నీ భజన జేయుట! రామా! 

భవ బంధ మోచనము! అతి దయా పరుడని యార్త రక్షకుడని యానంద 

పడవలెను  వో!రామా! 

రామా యని కన్నులున్నందుకు ఘనమై మి మూర్తిను గొంటి 

భాగ్యమున! పన్నగ భయము లేకున్న రక్షకుడని యున్నదే సార్ధకము శ్రీ 

రామా! రామా! 

వాసిగ భద్రాచలేశుడవని నిన్ను వాసనెరింగితిని న్నాసించిన 

నరసింహ దాసుడనని దోసిలొగ్గి వేడితి శ్రీరామా! రామా!

జోల పాట

"శ్రీ పాండు రంగ భక్త మాలకీర్తనలు " పుస్తకము నందు గల జోల పాట మీ కొరకు 

పల్లవి : జో అచ్యుతా నంద జోజో ముకుందా! 
           రార పరమానంద రామ గోవిందా !! జోజో!!

తొలుత బ్రహ్మాండంబు తొట్టె గావించి! నాలుగు వేదములు గొలుసుల మరించి !
బలువైన ఫణిరాజు పాన్పునమరించి! చెలియ డోలికపైని చేరిలాలించి !! జోజో!!

తొమ్మిది వాకిళ్ళ తొట్టిలోపలను ! క్రూరులు ఆరుగురు సాధులైదుగురు!
అందులో ముగ్గురు మూర్తులున్నారు! తెలిసి తెలిపే వాడు దేవుడున్నాడు !! జోజో!!

పట్టువలె నలుగురిని పదిలంబుగాను! కట్టవలె ముగ్గురిని కదలకుండగను 
వుంచవలె ఒక్కరిని హృత్కమల మందు! వుండవలె పండువెన్నెల బయలలోను !! జోజో!!

యీడు గలవానిని కూడుండ వలెను! జోడుగల వానిచే జాడ గనవలెను
మేడ మీదను వుండె మహిమ గనవలెను! కోరి యా గోవిందు గురుని గనవలెను !! జోజో!!

వీధి నొక బాటలో గీతంబు శాయ ! కోటలోభేరి మృదంగంబులు మ్రోయు
కోట కావలి వాండ్రు కోలాట మేయు! ధీటు లేని ప్రభువు దొరతనము శాయ !! జోజో!!

ఓంకార మని యేటి ఒక తొట్టిలోను ! తత్వమని యేటి చలువలంబరచి
వేడ్క తో పావనీ యేర్పాటు జేసి! యేడు భువనముల వారేక మై పాడే !! జోజో!!