Thursday, 1 May 2014

పంతమేలరా శ్రీ కాంతు జనక నాతో.... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

 ==============*================  
మాయా మాళవ గౌళ రాగము = ఆది తాళం

పంతమేలరా శ్రీ కాంతు జనక నాతో ! పంతమేల నే నెంత వాడ నా చింత దీర్చ నీ చెంతను జేర్చుమి !!పంత !! 

కోప మేలరా ! శ్రీ గోపాల స్వామి నాపై ! కోప మేల గోపాల బాలా ! ఆపద దీర్చుమి పాప హరణ శ్రీ !!పంత !!

బీద వాడ రా  నా బాధ మాన్పరా ! బీద వాడ నా బాధ మాన్పరా !మోదము తో నన్నా దరించ రా !!పంత !!

రక్షించ వేమిరా శ్రీ పక్షి వాహనా ! రక్షించ వేమి హరి పక్షి వాహనా !కక్ష యేలను భిక్ష కుండను !!పంత !!

ఆశించి యుంటిని మోసము శాయకూ ! ఆశించి యుంటిని మోసము శాయకు ! వాసు దేవ నీదాస దాసుడను!!పంత !!

స్థిరముగ  సద్గురువు శ్రీ యడ్లఖ్యుని ! స్థిరముగ  సద్గురువు శ్రీ యడ్లఖ్యుని ! కరుణ చేత నీ మరుగు దూరితిని !!పంత !!  

వాసిగ రేచర్ల పేట నివాసుడు ! దాసుడు మామిడి అప్పల దాసుని ! మోసము శాయకు గోపాల బాల !!పంత !!  

రామా నను బ్రోవరా...... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
శంకరాభరణ రాగము = ఆది తాళం

రామా నను బ్రోవరా ! యింత తామస మేలర ! తాళగ జాలా శ్రీ !!రామా !! 

రామా నన్ను బ్రోవ ప్రేమా లేదా యె తండ్రి ! స్వామి నీ వాడ నంటి !కామితార్థము లొసగు !! రామా !!

ఎంతో వేడినా ! కాసింతైనా దయ రాదు ! పంతా మేలను నాపై ! పరమ దయాకర !! రామా !!

దిక్కు లేక నిన్ను ! పెక్కు విధంబుల ! మక్కువ తో వేడితి ! గ్రక్కున బ్రోవరా !! రామా !!

మాయా సంసారము లో ! జేరి నే యుంటి తండ్రి ! మాయా దాటను! నుపాయా మేదో జూపు !! రామా !!

కన్న తండ్రి వని ! నిన్నే నే వేడితి ! కన్నాడ శాయక ! కరుణా జూడుము తండ్రీ !! రామా !!

ధరలో యడ్ల రామ గురు వారి కరుణ చే ! మరువక నిన్ను నా ! మదిను తింతును !! రామా !!

వాసీగ వాసూ !  దేవాయాని వసుధలో ! దోసి లోగ్గిన నాగ ! దాసూని బ్రోవరా !! రామా !!    

సుఖము నీకు దొరకదే మనసా.....!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
యదుకుల కాంభోజి రాగము = ఆటతాళం

ధరణిలో నర జన్మ మెత్తి నందులకు నీవు ! దారి దప్పి నడువకే మనసా !  దారి దప్పి నడచితె పరలోక ! సుఖము నీకు దొరకదే మనసా !! ధర !!

పరకాంతల జూచి ! పళ్లీకలించితె ! పాపంబు అది కాదా ఓ మనసా ! పాపంబని యేటి ! మాయ లోబడి యుండ ! పరము నీకు దొరకదే  మనసా !! ధర !!

చుట్టాలు బంధువులు ! యెల్లా వారున్నారని ! మిట్టి పడి తిరుగకే ఓ మనసా !ఆ యముని దూతలు వచ్చి నిన్ను బట్టే టప్పు ! డెవరు వెంటను రారె సత్యమిదె నమ్మవే ఓ మనసా !! ధర !!

ధరణి లో సద్గురువు !యడ్ల రామాద్యూల కరుణ గోరుచు నుండ వే మనసా !అరమర లేకను పరము నొందే త్రోవ ! స్థిరమూ గ జూడ వే ఓ  మనసా !! ధర !!

వాసిగ రేచర్ల పేటలో వెలసిన !కేశవాయని బల్కవే మనసా ! దాసుడైన కంచుమర్తి నాగన్నకు దోషము లెడలించు నే మనసా !! ధర !!    

Tuesday, 29 April 2014

మనసా నీకొక నమస్కార మూ.....!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !


శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
నాద నామ క్రియ రాగము = ఆది తాళం

మనసా నీకొక నమస్కార మూ ! నా మనవిదె చే కొనుమా  ! అనిశము ఆత్మావ లోకన చే !పరమంది సుఖించు సుమా !! మన !! 

సారము లే నటు వంటి భవార్థి పడి చెడి పోక వె మనసా ! నేరుపు తో హరి హరుల భజించుచు ! జేరవె గురు దరి  మనసా !! మన !!

మూర్ఖ తనంబున కోర్కెల లోబడి ! మోసము నొంద కె మనసా! మురికి తనువు పై మోహ ముడిగి నీ !వెరుకు వెరుంగ వె మనసా !! మన !!

యిందు ముఖుల గని మంద హాసమున ! చిందులు ద్రొక్కకె మనసా ! నింది తమగు యమ బంధ హేతువుల నొంద నేటికి మనసా !! మన !!

ధాత్రిలోను శ్రీ యడ్ల రామ గురు ! మూర్తి సత్కృపను మనసా! నేత్రము తో పరమాత్మ స్వ రూపుని ! స్తోత్రము చేయ వె మనసా!! మన !!

నిత్య నిర్మలంబయిన మార్గ మిది ! నెరిగి సుఖించ వె మనసా ! సత్య వాడ వెంకట దాసుని మృదు ! సరణి గ్రహించ వె మనసా  !! మన !! 

యిలను సద్గురు సేవ జేసితే.... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
హిందుస్తాని కాఫీ  రాగము = ఆటతాళం

యిలను సద్గురు సేవ జేసితే !ఫలము యేమిటి గురు వరా ? 
యీ ధరను సద్గురు ! కృపను పరమునకు ! దారి దొరకును శిష్యుడా  !! ఇల !! 

పంచ భూతము లే స్థలంబున ! సంచ రించును గురు వరా ?
పంచ భూతము లైదు గూడి ! ప్రపంచ మాయెను శిష్యుడా  !!  ఇల  !!  

మూడు కాల్వలు దాట మంటి ! ర దేమిటో సద్గురు వరా ?
ఆశ లే యమ పాశములు ! అవి కోసి వేయర శిష్యుడా  !!  ఇల  !!

తీరుగా జపమాల వ్రేళ్ళను ! త్రిప్పు టేలను గురు వరా ?
ముందు సద్గురు దెల్పిన ! మూల మంత్రము శిష్యుడా  !!  ఇల  !!

ముక్కు చెవులూ నోరు కన్నులు మూసు టేలను గురు వరా ?
అదే షణ్ముఖ ముద్ర యోగుల ! సాధనము రా శిష్యుడా  !!  ఇల  !!

నలు విధంబుల వాద భేదము ! లాభ మేమిటి గురు వరా ?
వేద శాస్త్ర పురాణ గాధలు ! వెర్రి బోధలు శిష్యుడా  !!  ఇల  !!

గురు శిష్యుల ! పరమ రహస్యము దొరకు టెట్లది  గురు వరా ?
ధరను యడ్లా రామ దాసుని ! యడిగి తెలియరా  శిష్యుడా  !!  ఇల  !!

దీని బావము దెలియరా దుర్గుణములిక నెడ బాయరా... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

దీని బావము దెలియరా! దుర్గుణములిక నెడ బాయరా ! దీనర్థమే పర మార్థమని! నీ ఆత్మలో నేరి గుండరా !!  దీని !! 

వాద భేదము మానరా! మన మొచ్చినది పొరుగూరు రా !  ఈ పక్షి దెల్పిన మాట లన్నియు తక్షణం యోచించ రా !! దీని !!

ప్రాకటముగ నమ్మరా! ఈ లోక మంతయు మాయ రా ! రాక పోకలు లేని చోటను! రాజువై కూర్చుండ రా !! దీని !! 

మాయ మాటలు మానరా ! యిది మట్టి బొమ్మని తెలియరా ! దేవుడే యీ పాడు ఘటమునకు ! జీవు డాయెను చూడ రా  !! దీని !!    
  
అడవి పందులు మూడు దనతో ! ఆటలాడెను జూడరా ! కాచి యున్న కాకి పిల్లను! గుటుకుమని దిగ మ్రింగె రా ! ! దీని !! 

మదపు టేనుగు లారు జోడు! పొదల చాటుకు జేరె రా  ! ఈ  గుట్టు తెలిసిన గ్రుడ్లా గూబ గుటుకు మని దిగ మ్రింగె రా ! ! దీని !! 

తొమ్మిదీ కాలువల చెరువు లో !దున్నలై పరుండె రా ! చెరువు వొడ్డున నున్న! కొంగ చేప లన్నిటిని మ్రింగె రా  !! దీని !!  

కొండ చిలువలు రెండు గూడి ! మొండి కెత్తెను జూడ  రా! గండు చీమొకటోచ్చి రెంటిని ! గరచి తిన్నగ ద్రిప్పెరా !!దీని !!

కన్నులకు  గనపడదురా! సద్గుణము సాహసు రాలురా ! మేరు శిఖరము చాటు నుండి! యెగురు చున్నది జూడరా !!దీని !!   

దీనిని గ్రహించుటకు దుష్టులకు !వశ మవదు రా ! నేను నినను భేదము డిగిన! దీని గనుగొన నెంత రా!! దీని !!

ధరలో శ్రీ కాకినాడ పురము నను కాపురము రా  ! గురు మాట తెలిపిన శ్రీ యడ్ల రామదాసుని వర కవిత్వము దెలియ రా !! దీని !!

Monday, 28 April 2014

దీని బావము దెలియ వలెనయ్యా... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

దీని బావము దెలియ వలెనయ్యా  ! నరులార మీరు ! దేహ వాసన విడువ గదరయ్యా ! దీని బావము దెలియ లేకను ! దేహ వాసన విడువ జాలక ! గాఢ యోగము దాల్చి పుడమిని ! మూఢులై చెడి పోవ నేలను !!  దీని !! 

వురుము  లే నొక మెరుపు మెరిసే ! మబ్బు లే నొక వాన గురిసెను ! వాన గురిసిన కారణము చే ! సోమ సూర్యులు సాము జేసిరి  !! దీని !!

ధారుణి తల మందున నవ ద్వార  ! వర పుర మందు నిద్దరు  ! వీర వర్యులు గూడి ! ఆకస వీధులకు నపు డెగసి పోయిరి !! దీని !! 

అర్థ రేయిని లేచి ఖేచరి ! ముద్ర యోగము జూచు వేళలో  ! రుద్ర రామా భద్రులకు  ! యే రూప నామ క్రియలు లేవు !! దీని !!    
  
మూడు గెలిచే మూడు రోసి  ! మూడు ముడా డింట నిలచే !  ఏడు కిటకీల మేడ మీదా ! యెక్కి చూడగా తాను తానై ! ! దీని !! 

యి వ్విధంబున నెరుగ జేసిన  ! హిత గురువు మంతిన వేంకట ! యతియు మర్మము ! దెలియకను ! మతి లేక జెడి పొయినారు కొందరు ! ! దీని !! 

వాసిగా శ్రీ యడ్ల రామా !  దాసు దెల్పిన తత్వ మార్గము ! ఆశతో గను గొన్న వారికి ! అపరిమిత సౌఖ్యంబు గల్గును !! దీని !!