Monday, 5 May 2014

క్షేమంకురుసతతం....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !


శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని  పాట

 సావేరి రాగం = ఆదితాళం
======================*=======================
: క్షేమంకురుసతతం  గోపాలమమ క్షేమంకురుసతతం ||క్షే||

అనుపల్లవి|| కామంతవపాద   కమలేభ్రమరీ| భవతుశ్రీమన్మమ మానసం మధుసూధన ||క్షే||

. అక్షీణ కరుణానిధే ఆనందఘన ప్రక్షీణా దోషాతతే | శిక్షితా సురగణా రక్షితనిజజాన కుక్షిస్తితానేక కోటిలోకావన ||క్షే||

. ప్రహ్లాద భయవిదూరా పరమయోగి పావన భువనాధారా | మోహరహిత చిత్త మౌనిమానసహంస | సాహసహతవైరి సంఘమహోద్ధార  ||క్షే||

3. అజితవిజయగోపాల అనంతలీల అద్భుతపదకమల | విజయద్వారకపురి విమల కమలలోల | నిజనారాయణతీర్థ నిత్యానందబాల ||క్షే||

శ్లో: బాలాయ నీలవపుషే | నవకింకిణీక | జాలాబిరామ | జఘనాయ దిగంబరాయ | శార్దూల దివ్య నఖభూషణ | భూషితాయ| నందాత్మజాయ | నవనీతముషే నమస్తే ||                             

Sunday, 4 May 2014

హరి రిహ ముగ్ధవధూనికరే.....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

                   అష్టపది ౧౨ నాధనామక్రియ = ఆదితాళం
 =======================*===================
|| || హరి రిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళివరే ||

. చందనచర్చిత నీలకళేబర పీతవసనవనమాలీకేళిచలన్మణికుండల మండిత గండయుగస్మితశాలీ  !! !!

.పినవయో ధరభారభరేణ హరిం పరిరభ్యసరాగం| గోపవధూరనుగాయతికాచి దుదంచితపంచమరాగం !!!!

.కాపివిలాస వలోల విలోచన  ఖేలనజనితమనోజం| ద్యాయతిమ్ముగ్ధ వధూరధికం మధుసూధనవదనసరోజం !! !!

.కాపికపొలతలే మిళితా లపి తుంకమపిశ్రుతిమూలేకాపిచుచుంభవినితంబవతి దయతంపులకైరనుకూలే !!!!

.కేళికళాకుతు కేనచకాచిదముం యమునాజలకూలే |మంజుల వంజులకుంజగతం విచకర్షకరేణదుకూలే !! !!

.కరతలతాళ తరళవలయావళి కలితకలస్వనవంశే |రాసరసే సహనృర్యవరా హరి ణాయువతిఃప్రతిశంసే !! !!

.శ్లిష్యతికామపిచుంబతికామపి  రమయతికామపిరామం | వశ్యతిశస్మిత చారుపరామ పరామనుగచ్చతివామం !! !!


.శ్రీదయదేవఫణితమిదమద్భుత కేశవకేళిరహస్యం| బృందావన విపినేలలితం వితనోతుశుభానియశశ్యం!! !!

దేవ దేవ ప్రసీదమే దేవకీవర బాల......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండు రంగ భక్తీ కీర్తనలు 
==============*================  
 మోహనం (రేగుప్తి) రాగము = ఆదితాళము

: దేవ దేవ ప్రసీదమే దేవకీవర బాల దీనజనపరిపాల ||దే||

.లీలావినోదవిగ్రహ లక్ష్మీపతే | బాల మోహవినిగ్రహ బాలోన్నతే ||

కలితసేవకానుగ్రహ కామాకృతే| అలఘువీర్యపరిగ్రహ  అఖిలాండపతే

ఖిలమునిబృందానుగ్రహ గోపాలకృష్ణపతే| బాల ఘనలీలాతిసుశీల హేమచేల                                                                                                      
నంత   లీలాగమమూల శ్రీలోలాతివిశాఫాల బాలగోపాలకృష్ణ || దే||


. శ్రీవత్సలక్షణాంచిత శ్రీ భావిత | దేవగంధర్వసేవిత  దివ్యాయుధ

  గోవత్సగణసంవృత గోపాలవృత | అవ్యయ మునివందిత అచింతిత

  భవ్యగోకులనిరత గోపాలకృష్ణ | పీతాంబరవీత విదుశీతాఖిలత్రాతా

  ఘవి ఘతార్జున సూతామరగీతాగమ జాతభ్రాత బాలగోపాలకృష్ణ ||దే||


. పూర్ణేందుమండలానన పురాతన | పూర్ణసువర్ణ వాహన వరానన |

 తీర్ణ సంసారమోహన ధీరాయన | కర్ణకుండలశోభన  కంజానన

 వర్ణితవీర్యవామన గోపాలకృష్ణ | నారాయణ ధీ రాగమశా రాఘవిదూ

రాసమ హారారివిదా రామరవీ రాసంసారాపార బాలగోపాలకృష్ణ ||దే||

Thursday, 1 May 2014

కనుగొంటి నమ్మా.... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట
==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

కనుగొంటి నమ్మా ! బ్రహ్మము నాలో ! గనుగొంటి నమ్మా ! గనుగొంటి నమ్మాగురు కరుణా కటాక్షమున ! దనరూ చు సద్భక్త ! వరులు జూచేటి వాని !!గను !!

భయ మొంద కమ్మా ! మన పాలి దేవుని ! దయ గల్గెనమ్మా ! అయ్య నీ దర్శన ! మయ్యె దెటులని వేడ ! చయ్య నతని లో ! ప్రసన్న మయ్యెడి వాని !!గను !!  

పద్మాసనము నా ! యాపదన కలుగులు ! బంధించు కున్నా ! చిద్వి లాసమున ! యా  శృంగార పురి జొచ్చి ! గంగ యమునల మధ్య ! దొంగ వానిని రాత్రి  !!గను !!

విన్నారట మ్మా దేవుడు మనలో ! వున్నాడో  యమ్మా ! వన్నె మీరగ భువిలో ! చిన్న పెద్దల యందు ! యెన్నో విధంబులై ! యున్న చిద్రూపుని !!గను !!   

అందు న్నార మ్మా ! మంతీ న వేంకటార్యు లే కొమ్మా ! సందేహమేల! యీ సహస్రార వీధిని ! యిందు రమ్మని చిన్న ! ఈల గొట్టిన వాని  !!గను !!

ఆశా పాశము లా ! గురు వరుని కృప చే ! కోసీ నే రోసి ! వాసి మీరగను యడ్ల ! రామ దాసుడ నే ! ఒక దీక్ష చే గురు నీ ! వుపాసమున దేశకునీ !!గను !!  

పంతమేలరా శ్రీ కాంతు జనక నాతో.... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

 ==============*================  
మాయా మాళవ గౌళ రాగము = ఆది తాళం

పంతమేలరా శ్రీ కాంతు జనక నాతో ! పంతమేల నే నెంత వాడ నా చింత దీర్చ నీ చెంతను జేర్చుమి !!పంత !! 

కోప మేలరా ! శ్రీ గోపాల స్వామి నాపై ! కోప మేల గోపాల బాలా ! ఆపద దీర్చుమి పాప హరణ శ్రీ !!పంత !!

బీద వాడ రా  నా బాధ మాన్పరా ! బీద వాడ నా బాధ మాన్పరా !మోదము తో నన్నా దరించ రా !!పంత !!

రక్షించ వేమిరా శ్రీ పక్షి వాహనా ! రక్షించ వేమి హరి పక్షి వాహనా !కక్ష యేలను భిక్ష కుండను !!పంత !!

ఆశించి యుంటిని మోసము శాయకూ ! ఆశించి యుంటిని మోసము శాయకు ! వాసు దేవ నీదాస దాసుడను!!పంత !!

స్థిరముగ  సద్గురువు శ్రీ యడ్లఖ్యుని ! స్థిరముగ  సద్గురువు శ్రీ యడ్లఖ్యుని ! కరుణ చేత నీ మరుగు దూరితిని !!పంత !!  

వాసిగ రేచర్ల పేట నివాసుడు ! దాసుడు మామిడి అప్పల దాసుని ! మోసము శాయకు గోపాల బాల !!పంత !!  

రామా నను బ్రోవరా...... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
శంకరాభరణ రాగము = ఆది తాళం

రామా నను బ్రోవరా ! యింత తామస మేలర ! తాళగ జాలా శ్రీ !!రామా !! 

రామా నన్ను బ్రోవ ప్రేమా లేదా యె తండ్రి ! స్వామి నీ వాడ నంటి !కామితార్థము లొసగు !! రామా !!

ఎంతో వేడినా ! కాసింతైనా దయ రాదు ! పంతా మేలను నాపై ! పరమ దయాకర !! రామా !!

దిక్కు లేక నిన్ను ! పెక్కు విధంబుల ! మక్కువ తో వేడితి ! గ్రక్కున బ్రోవరా !! రామా !!

మాయా సంసారము లో ! జేరి నే యుంటి తండ్రి ! మాయా దాటను! నుపాయా మేదో జూపు !! రామా !!

కన్న తండ్రి వని ! నిన్నే నే వేడితి ! కన్నాడ శాయక ! కరుణా జూడుము తండ్రీ !! రామా !!

ధరలో యడ్ల రామ గురు వారి కరుణ చే ! మరువక నిన్ను నా ! మదిను తింతును !! రామా !!

వాసీగ వాసూ !  దేవాయాని వసుధలో ! దోసి లోగ్గిన నాగ ! దాసూని బ్రోవరా !! రామా !!    

సుఖము నీకు దొరకదే మనసా.....!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
యదుకుల కాంభోజి రాగము = ఆటతాళం

ధరణిలో నర జన్మ మెత్తి నందులకు నీవు ! దారి దప్పి నడువకే మనసా !  దారి దప్పి నడచితె పరలోక ! సుఖము నీకు దొరకదే మనసా !! ధర !!

పరకాంతల జూచి ! పళ్లీకలించితె ! పాపంబు అది కాదా ఓ మనసా ! పాపంబని యేటి ! మాయ లోబడి యుండ ! పరము నీకు దొరకదే  మనసా !! ధర !!

చుట్టాలు బంధువులు ! యెల్లా వారున్నారని ! మిట్టి పడి తిరుగకే ఓ మనసా !ఆ యముని దూతలు వచ్చి నిన్ను బట్టే టప్పు ! డెవరు వెంటను రారె సత్యమిదె నమ్మవే ఓ మనసా !! ధర !!

ధరణి లో సద్గురువు !యడ్ల రామాద్యూల కరుణ గోరుచు నుండ వే మనసా !అరమర లేకను పరము నొందే త్రోవ ! స్థిరమూ గ జూడ వే ఓ  మనసా !! ధర !!

వాసిగ రేచర్ల పేటలో వెలసిన !కేశవాయని బల్కవే మనసా ! దాసుడైన కంచుమర్తి నాగన్నకు దోషము లెడలించు నే మనసా !! ధర !!