Monday, 15 June 2020

గజవిలసిత గర్భ సీసము

గజవిలసిత గర్భ సీసము

గజవిలసిత (భరన ననగ యతి 8)
మనమున ముందు స్వామిని గొల్చి రాక్షస తతి వరములడుగన్ తన్మయమున
మురియుచు భూరి నోముల మెచ్చి మేనును మరచి పురహరుడే దరికి జేరి
బ్రోవగ నిలచి సోముల దీర్చి వార్కి శుభము లొసగ వడిగన్ భవభయముల
మలయుట నేర్చి ధామము వీడి గొల్వ ధరణి జను లెలమినన్ రయము గాను

సంతసించి వనచరులు చెంత జేరి
పరమ భక్తి తోడ నిలచి స్థిరము గాను
గొల్చు చున్న విధమ్మున గొల్చు శక్తి
యుక్తి నిమ్ము మహాదేవ భక్త తతికి!

గర్భిత గజవిలసిత వృత్తము (భరన ననగ యతి స్థానం 8)

స్వామిని గొల్చి రాక్షస తతి వరములడుగన్ 
నోముల మెచ్చి మేనును మరచి పురహరుడే 
సోముల దీర్చి వార్కి శుభము లొసగ వడిగన్ 
ధామము వీడి గొల్వ ధరణి జను లెలమినన్ !
(సోము =కోరిక, మలయుట= తిరుగుట)

జ్ఞాన వృత్త గర్భ సీసము

జ్ఞాన వృత్త గర్భ సీసము

ముదమున రామా ని పదము బట్టిన త్రాత వనుచు మైత్రిన్ సదా వనజ నయన
కవినుత భూమీశ భువన మోహన బ్రోచెదవట ప్రీతిన్ సదా దాసతతిని
రణధీర దామోదర సుర సేవ్య ముదాకర నిను గొల్తున్ సదా రక్తి తోడ
ధరవర ధీమంత దరమ ధారణ దీర్చు జనుల యార్తిన్ సదా సాధుశీల

కరిని గాచినట్లు కలియుగ మందున
కావు మమ్ము వడిగ కంజనేత్ర
కష్టకడలి నుండ కరము నందించుచు
కరద దీర్చు మయ్య క్ష్మావరేశ!

జ్ఞాన వృత్తము

రామా ని పదము బట్టిన త్రాత వనుచు మైత్రిన్
భూమీశ భువన మోహన బ్రోచెదవట ప్రీతిన్
దామోదర సుర సేవ్య ముదాకర నిను గొల్తున్
ధీమంత దరమ ధారణ దీర్చు జనుల యార్తిన్ 

(దరమ = విల్లు )

మదన వృత్త గర్భ సీసము

మదన వృత్త గర్భ సీసము

చేవడి తోడ రాజీవ నేత్ర నినునే -రచియించ మందున్ సురముని సేవ్య *
సొగసైన నీదు నాజూకు పాదములనే- నయమార గొల్తున్ ననవరతమ్ము *
చిందులు వేసి జేజేల వీడు భువికిన్ -చికిరాయ తేరా కుచేల బందు *
స్తిమిత మనమున రాజిల్లు శ్రీకరుడవై - రణరంగ మందున్ సురవర దేవ *

కష్ట కడలి యందు కరద దీర్చంగ నీ
వండ జేర మందు నబ్ధి శయన
భవ్య నామ ధేయ భక్త జనుల గాచ
స్థిరముగ నిల నుండు శేష శయన!

మదన వృత్తము (తభజజగగ యతి -9)

రాజీవ నేత్ర నినునే -రచియించ మందున్
నాజూకు పాదములనే- నయమార గొల్తున్ 
జేజేల వీడు భువికిన్ -చికిరాయ తేరా 
రాజిల్లు శ్రీకరుడవై - రణరంగ మందున్

జేజేలవీడు = స్వర్గము

కనకలత, అతివినయ , కంద గర్భ సీసము

కనకలత, అతివినయ , కంద గర్భ సీసము

 మరో  ప్రయత్నం. 🙏🙏🙏

కలడు హరుడు కలతల కరి గయమును గను చెలిమిన్ తన కరుణ తోడ
బలయు కరము వలువల నిడి వగచిన వనితల నేలెను వంశి తోడ
బలుకు వరుడు కలువల దరి ప్రబలము గను నిలపెన్ వారు ఖ్యాతి నొంద
చలము తెరగు విలువల దరి సతిని విడచి వరలున్ తన టావు నైన

నలక పురి వీడి కావగ నార్తి తోడ
పలుకు పరిశుద్ధ మైనను పరుగు తోడ
పిలచిన హరియనుచు వేగ వేకరమున
కలిమి బలిమి నిచ్చుచు మన కరద దీర్చు
పిలువు మరి శ్రీకరుండను నెలమి తోడ!

(గయమును= ఇల్లు, దేహము, బలయు = చుట్టు కొను,
వంశి = పిల్లనగ్రోవి , టావు = స్థానము)

కనకలత వృత్తము ననన నననస = యతి 13

కలడు హరుడు కలతల కరి గయమును గను చెలిమిన్
బలయు కరము వలువల నిడి వగచిన వనితలనే
బలుకు వరుడు కలువల దరి ప్రబలము గను నిలపెన్
చలము తెరగు విలువల దరి సతిని విడచి వరలున్

అతివినయ వృత్తము యతి 11

హరుడు కలతల కరి గయమును గను చెలిమిన్
కరము వలువల నిడి వగచిన వనితలనే 
వరుడు కలువల దరి ప్రబలము గను నిలపెన్
తెరగు విలువల దరి సతిని విడచి వరలున్ !

కందము

కలతల కరి గయమును గను చెలిమిన్ కరము వలువల నిడి వగచిన వనితలనే 
కలువల దరి ప్రబలము గను నిలపెన్ విలువల దరి సతిని విడచి వరలున్ !

కనకలత, అతివినయ గర్భ సీసము

కనకలత, అతివినయ గర్భ సీసము

ఆది అంత్య ప్రాసల కొరకు

కలడె వరుడు కలువల దరి కవనము వినగలడే హరి పిలుపు లేక
కలడె హరుడు కలతల కరి గయమును గన గలడే తన కరుణ తోడ
కలదె కరము వలువల దరి కకపిక కన కలదే ఘన గరిమ తోడ
కలవె వరుని విలువల దరి కవరలు నిల గలవే కడు నిరతి తోడ
పలుకు పరిశుద్ధ మైనను పరుగు తోడ
నలక పురి వీడి కావగ నార్తి తోడ
నిలకు హరిజేరు ముదమున యింతి తోడ
పిలువు మరి శ్రీకరుండను నెలమి తోడ!

(గయమును= ఇల్లు, దేహము,
కవరలు= పాచికలు )

కనకలత వృత్తము [ననన నననస ] = యతి 13

కలరె వరులు కలువల దరి కవనము వినగలవే
కలడె హరుడు కలతల కరి గయమును గన గలడే
కలదె కరము వలువల దరి కకపిక కన కలదే
కలవె వరుని విలువల దరి కవరలు నిల గలవే

అతివినయ వృత్తము [ననన ననస] = యతి 11

వరులు కలువల దరి కవనము వినగలవే
హరుడు కలతల కరి గయమును గన గలడే
కరము వలువల దరి కకపిక కన కలదే
వరుని విలువల దరి కవరలు నిల గలవే

మధ్యాక్కర, భూషణము, ద్రుతవిలంబితము, కంద, గీత గర్భ చంపకమాల

మధ్యాక్కర, భూషణము, ద్రుతవిలంబితము, కంద, గీత గర్భ చంపకమాల

=========**========

కరివర గావరా! కనక కాకర! గారపు కామ్య కారకా !*
సరస రసా వనా! స్తనిత చాలక! చర్చిత శౌరి క్ష్మావరా!*
పురధర బ్రోవరా! పునెపు పూదరి! మోదన మోపుకాడ తా*
ధరవర ధావకా! తనువు ధారణ దప్పెర! త్రాత వేగమే! *

గర్భిత మధ్యాక్కర

కరివర గావరా! కనక కాకర! గారపు కామ్య  !*
సరస రసా వనా! స్తనిత చాలక! చర్చిత శౌరి !*
పురధర బ్రోవరా! పునెపు పూదరి! మోదన మోపు *
ధరవర ధావకా! తనువు ధారణ దప్పెర త్రాత ! *

గర్భిత భూషణము

గావరా! కనక కాకర! గారపు కామ్య కా !*
సా వనా! స్తనిత చాలక! చర్చిత శౌరి క్ష్మా !*
 బ్రోవరా! పునెపు పూదరి! మోదన మోపుకా *
ధావకా!తనువు ధారణ దప్పెర త్రాతవే ! *

గర్భిత ద్రుతవిలంబితము

కనక కాకర! గారపు కామ్యకా *
స్తనిత చాలక! చర్చిత శౌరి క్ష్మా !*
పునెపు పూదరి! మోదన మోపుకా *
తనువు ధారణ దప్పెర త్రాతవే! *

గర్భిత కందము

వర గావరా! కనక కా
కర! గారపు కామ్య కారకా సరస రసా
ధర బ్రోవరా! పునెపు పూ
దరి! మోదన మోపుకాడ తా ధర వరధా!

గర్భిత గీతము

కనక కాకర! గారపు కామ్య కార !*
స్తనిత చాలక! చర్చిత శౌరి క్ష్మావ !*
పునెపు పూదరి! మోదన మోపుకాడ *
తనువు ధారణ దప్పెర త్రాత వేగ ! *

🙏🙏🙏
కనక కాకర= బంగారు వర్ణ సూర్య కాంతి సమానుడా ,
కామ్య = కోరిక
పూదరి = వసంత ఋతువు
మోదన = సంతోషము, మోపుకాడ = మోచువాడు,
ధారణ = భగవంతుని ధ్యానించుట,

భావము :- కరికి వరము నిచ్చిన స్వామి గాపాడరా! బంగారు వర్ణ సూర్య కాంతితో విలసిల్లు వాడ ,  కామ్యకారకుడా , సరస  రసా వనా ! ఉరుముల చాలక! చందన చర్చిత శౌరి క్ష్మావరా!
పురధర ! సంతోష వసంత ఋతువును మోసుకు వచ్చే వాడ, ధరవర  తనువు నిన్ను ధ్యానించుట మానెను ! త్రాత వైన స్వామి త్వరగా బ్రోవరా!

మనసా! శతకము