Sunday, 30 March 2014

యెన్ని మాయలు నేర్చినాడమ్మ.......!

బ్లాగు వీక్షకులకు జయనామ ఊగాది శుభాకాంక్షలతో 


శ్రీ రాగం= ఆటతాళం శ్రీ కృష్ణలీల
=================*=======================
యెన్ని మాయలు నేర్చినాడమ్మ! యశోద నీ కొడు కన్నిటికి నెరజాణు డోయమ్మ! 
యెన్ని మాయలు నేర్చినాడె! చిన్ని తనయుడు నిన్న రేయున! 
కన్నె పడుచును జూచి రమ్మని కన్ను సైగలు జేసి నాడట! యె!! 

వట్టి మాటలు కావు వినవమ్మ! యీ వాడలోపల ఇట్టి వానిని జూడ లేదమ్మ!
ఉట్టి మీదను చట్టి లోన పట్టి పాలిడి అట్టె బోవగ! 
చట్టి తూటడ గొట్టి కృష్ణుడు పొట్ట నిండా బట్టి నాడట !!యె!! 

బాలుడని ముద్దిడితి నోయమ్మ!! నీ సుతుడు ముద్దు బాలుడనుటకు వీలు లేదమ్మ!
ఆలి మొగడు పరుండి యుండగ యీల గొట్టియు లేపి దానిని! 
వేలివుంగరమిచ్చి కాము కేళికేమో బిలచి నాడట!!యె!! 

యేడ జూచిన నుండునోయమ్మ! నీ సుతుడు మా వాడ వాడల దిరుగు నోయమ్మ ! 
చెడిలందరు గూడి జలక్రీడలాడుచు నుండ వారల! 
జాడ గని తా తోడి బాలుర గూడి చీరెలు దొంగిలించెను !!యె!! 

వింతవింతలు సలుపు నోయమ్మ! నీ చిన్ని తనయుడు యెంత జెప్పిన వినడు గదమ్మ! 
యింతు లెల్లరు గూడి పూల బంతు లాడుచునుండగని! 
మీ బంతు విలువలు యెంతయని చన్బంతులను చేబట్టి నాడట!యె!!

చింత శాయగ రాదు వినవమ్మ! నీ చిన్ని కృష్ణుడు ఇంత వాడని చెప్పరాదమ్మ! 
మంతనంబున పెరటిలో నొక ఇంతి స్నానము లాడగని ! 
చన్బంతులను చేబట్టి దానిని కాంతు కేళిని బిలచినాడట!!యె!! 

చేడెనో యీవార్త వినవమ్మ! నీ సుతుడు జేసిన కోడె తనములు దెలుప రాదమ్మ!
నేడు మా వంటింటిలో మాతోటి కోడలు పెరుగు దరువగ! 
జాడ గని తా వెనుకబడి మొగ పొడుములు జరిగించి నాడట!!యె!! 

భాస మాన విలాసు డోయమ్మ! నీ సుతుడు శ్రీనివాసుడని మది దోచునోయమ్మ!
వాసిగా శ్రీ కాకినాడ నివాసుడైన మంతీన వేంకట! 
దాసుపాలిట జేరి సత్కృప జూచి కొర్కెలొసంగు చుండెను !!యె!! 

Friday, 28 March 2014

ఈశ్వర జగధీశ్వరా....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================
నాద నామ రాగము = ఆటతాళం

ఈశ్వర జగధీశ్వరా పరమేశ్వరా కరుణించరా ! 
శాశ్వతంబుగ వేడితిని విశ్వాస ముంచర  ఈశ్వర!!
ముందు జేసిన పూర్వ  కృతములు యిందు లవుము ఈశ్వరా !
 పొందు గా మీ పాద పద్మము జెంది యుంటిని ఈశ్వర! 
కపట విద్యలు నేర్చి పొట్టా గడుపు చుంటిని ఈశ్వర! 
నేరము లెన్నక నన్ను నీ కృప నేలు మీ పరమేశ్వరా !ఈశ్వర! 
ఆరుగురు శత్రువులు నాపై క్రూర మెంచిరి ఈశ్వర! 
పరమ మంత్రము చేత శత్రువుల నురమ వలె   పరమేశ్వరా !ఈశ్వర! తొమ్మిది ద్వారముల కొంపిది నమ్ము నేటికి  !ఈశ్వర! 
బొమ్మ లాటల పాలు జేసి బ్రోవ కుంటివి  !ఈశ్వర! 
మూడు గుణములు విడువ జాలక మోస పోతిని  !ఈశ్వర! 
వేడ్క తోడ నీ మాయ దాట నుపాయ మేదో  !ఈశ్వర!
చంక దుడ్లె మరి కింకరులకు జంక నేలను  !ఈశ్వర! 
అంక మందున జేర్చి సద్గురు శంక దీర్చిరి  !ఈశ్వర! 
ధరణిలో శ్రీ కాకినాడ పురము నిల్కడ  !ఈశ్వర! 
వరము లిచ్చి యడ్ల రామదాసు నేలర  !ఈశ్వర!

Saturday, 22 March 2014

నారాయణ మంత్రము...!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

నాదనామక్రియ రాగం- ఆదితాళం
===============*===============
నారాయణ మంత్రము నా జిహ్వకు ! నాణెమైన రుచి దొరికె గదా! 
కూరిమితో శ్రీ రామ తారకము! కోరికలర ప్రాప్తమాయెగదా!!నారా!! 

మంచి మంచి మామిడి ఫలచీ నా! పంచదారలకు మించెగదా! 
యెంచి జూడ శ్రీ రామామృత మిది! మంచి రుచియు ప్రాప్తించెగదా!!నారా!! 

అండ పిండబ్రహ్మాండ మంతయును! నిండిన మధురం బిదియు గదా! దండిగ రాముని దలచెడి వారిలో! తాండవ మాడు చునుండెగదా!!నారా!!

కొండ పొడుగు జేసిన పాపము ! నిండి చెలాయించుచుండెగదా!
 దండి ప్రభువు దరిజేరి నందువల ! నిండిన పాపము చెండె గదా!!నారా!!

దేవరహస్యములు దొరికెగదా! యీ జీవము దేవుని చేరుగదా!
 భువిలో మంతిన వేంకటార్య గురు! వర్యుల మదిలో మరువ గదా!!నారా!!

కోరి భజించేవారిని బ్రోచే గదా! తారకాతీతం బిదియు గదా! 
ధారుని యడ్లరామా దాసుడు దెల్పెను! దశరధాత్మజుని రసము గదా!! నారా!! 

జన్మమేలనే...!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట 

భూపాల రాగము = రూపక తాళం
=================*=====================
ప: జన్మమేలనే- వృధా- జన్మమేలనే!
చిన్మయుని పదాంబుజములు చింతన శాయక బ్రతుకు వారి!!జ!!

యెన్నరాని జన్మములలో యెన్నికైన జన్మమెత్తి! 
పన్నుగ మన కోదండ రాముని సన్నుతి సేయక బ్రతుకు వారి!!జ!!

విష్ణు దినములందు భోగ తృష్ణలుడిగి నిదుర మాని!
 కృష్ణరామా యనుచు పరమ నిష్టను సేవింపని వారి !!జ!!

మొలక వెన్నులున్న తులసి దళములా వరించి దెచ్చి ! 
చెలగి పూజలు జేసి హరిని దలచి ధన్యులు గాని వారి !!జ!!

ఆశతోడ నారశింహ దాసుడెపుడు గొలుచు చుండ ! 
దాస పోషకుడైన శ్రీని వాసుని సేవింపని వారి !!జ!!  

మేలుకో సుగుణాల వాల జానకీ లోల !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !


శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన .  

==============*================
భూపాల రాగము = ఆటతాళం

మేలుకో సుగుణాల వాల జానకీ లోల ! భక్త పాలనా నిద్ర మేలుకో
వాలాయముగ మమ్ము పాలించు వేళాయె ! వైకుంఠ వాసూడా మేలుకో!!మే!!

భేరీ మృదంగాది భీషణరవమూలు !  బోరు గొలుపసాగె మేలుకో
తీరైన కస్తూరి తిలకాము జారెను! తీర్చి దిద్దావలె మేలుకో!! మే!!

తారాలు తెల్లానై తెల్లవారెనదె ! వారిజాక్ష నిద్ర మేలుకో
తీరైన ముత్యాలు హారము వలె దీప ! తేజాము గన్పట్టె మేలుకో!!మే!!

తూరుపునకు మంచితీరైన రవి కాంతి ! జేరి మించ సాగె మేలుకో
కారుణ్య సాగరా కమనీయ కటి సూత్ర ! హార మకుట ధార మేలుకో!!మే!!

పారిజాత కుసుమ మాలీక చేబట్టి !నారాదాముని వచ్చె మేలుకో
పాలవారధి యందు పవ్వళించిన యోగ !పరమేశ యిక నిద్ర మేలుకో!!మే!!

భరతూడు మీపాద భక్తుడు శ్రీమించు! పాదూకలను దెచ్చె మేలుకో
వరదూడావై నీవు ధరణిజా గూడి !యీధర యేలుదువు గాని మేలుకో!!మే!!

స్థిరమూగ భద్రాద్రి పుర మూన వెలసీన !శ్రీరఘునాయకా మేలుకో
నరశింహదాసూని అరలేక రక్షించు !పరమ పావన నిద్రమేలుకో!!మే!!

సీ :నీవు కన్మూసిన నిఖిల ప్రపంచంబు! జాలి జెందినదిక మేలుకొనవె!
నీదు పాదయుగంబు నెమ్మి సోకక యున్న! మేధిని వ్యధజెందు మేలుకొనవె !
నీ వీక్షణము లేక నెరదిశలెల్లను !చాల చీకటి గ్రమ్మె మేలుకొనవె  !
నీప్రసన్నత లేక నిగమముల్ విముఖమై !యోలిమూలల జొచ్చె మేలుకొనవె !

గీ :ఫాలలోచన సతిహిత మేలుకొనవె !
గాలి కూరిమి తన యాఢ్య మేలుకొనవె !
మేలు రవివంశ తిలక మమ్మేలు కొనవె!
మేలుకో భద్ర గిరిధామ మేలుకొనవె !

సీ : జారచోరకుల సంచారకబులడగెను !వాలాయముగ నిద్ర మేలుకొనవె !
ఖలిలిల సాధులంబాధింపు చున్నారు !జాలి దీర్చుటకునై మేలుకొనవె! 
దరిచేరు లేక నీదరి జేరి కుయ్యిడు! మేలు భక్తులబ్రోవ మేలుకొనవె !
నరశింహదాసుని అరసిబ్రోచుట నీదు! పాలు గావున నిద్ర మేలుకొనవె !

గీ : కేలనగ మెత్తు నాస్వామి మేలుకొనవె !
లీల పదిరూపములు దాల్చమేలుకొనవె !
మేలు రవి వంశ తిలక మమ్మేలుకొనవె !
మేలుకో భద్రగిరి ధామ మేలుకొనవె  !

Wednesday, 19 March 2014

కాల హరణమేలరా...

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన .  

==============*================
అఠాణ రాగము = రూపకతాళం

ప: కాల హరణమేలరా హరే సీతారామ !!కా!!
కాల హరణమేల సుగుణ జాల కరుణాల వాల !!కా!!

చుట్టు తిరిగి పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి భువిని
పుట్ట గానె నీ పదములు బట్టి వేడుకున్న రామ !!కా!!

పుడమి యెంతాడు కొన్న భూమిని త్యాగంబు రీతి
కడు బడలి యున్న నీవు గాక యెవరు నన్ను బ్రోవ !!కా!!

దినదినమును తిరిగి తిరిగి దిక్కు లేక శరణు జొచ్చి
తనువు ధనము నీవే యంటి త్యాగరాజ వినుత రామ !!కా!!

Tuesday, 18 March 2014

తపమేమి జేసెనో తెలియా !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన .  

==============*================

ప : శ్రీ రామ జయరామ శృంగార రామ యని ! చింతించరాదె ఓ మనసా!! శ్రీ!!

తళుకు చెక్కుల ముద్దు బెట్టు కౌసల్య మును ! తపమేమి జేసెనో తెలియా ! కౌసల్య తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

దశరధుడు శ్రీ రామ రారయని బిల్వ మును ! తపమేమి జేసెనో తెలియా ! దశరధుడు తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

తనవారి పరిచర్య సేయ సౌమిత్రీ మును !తపమేమి జేసెనో తెలియా ! సౌమిత్రీ తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు మును!తపమేమి జేసెనో తెలియా ! కౌశికుడు తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

శాపంబడగ రూపవతి యౌట కాహల్య మును!తపమేమి జేసెనో తెలియా ! అహల్య తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

ధర్మాత్ము చరణంబు సోక శివుచాపంబు మును !తపమేమి జేసెనో తెలియా ! శివ చాపంబు తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

తన తనయ నొసగ కనులార గన జనకుండు మును !తపమేమి జేసెనో తెలియా ! ఆ జనకుండు  తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

దహనంబు కరగ కరమును బట్టి జానకి మును !తపమేమి జేసెనో తెలియా ! ఆ జానకి తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

త్యాగ రాజాప్తయని పొగడ నారదమౌని మును! తపమేమి జేసెనో తెలియా ! ఆ మౌని తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!