Monday, 14 March 2011

2g raja pai 3g

      ಆ : నీటి మీద వ్రాత నీ సంతకంబని
            నీతి వీడి గడ్డి నీవు గడుపు 
            నిండు గార గించి నీతి మంతుడనని
            జెప్ప నమ్మ కుండు జనులు రాజ !
      తే : నీటి మీద వ్రాత యగునా నీ చెవ్రాత
           నీతి విడచి గడ్డి తినిన రీతి రాజ 
           నేటి ప్రభు నూరకుండినా నాటి తప్పు 
           నీడలా నిన్ను విడవదు కడ వరకును ! 
    కం : నీ సంత కంబు తోడను
           నీ సంసార  మొదలి అవినీతి అడవిలో
           నీ సంపాదన ; వర్గము
           నీ సం తోషాలరించి నీడై వచ్చును !

Thursday, 10 March 2011

nagarajevanam

      తే :నగర మందు  జీవన మది    నవ్వు లాట 
           యగును హరి కైన సిరి లేక; యావిరి యగు
           నాశలు కరి ముఖునకు; లాభ మందగలరు 
           విలువల వలువలు విడచి వీగు  వారు  !
    తే : తెలుగు లిపి తోడ ఛందస్సు తెచ్చు సుంద
          రాకృతిని; అలంకారములద్దు  సోయ
          గాలు, వ్యాకరణంబులు గన్ను లౌగ
          వినిన వెంటనే వీనుల విందు జేయు |
  సే : ఆధునిక జ్ఞాన మందరి మదిలోన రామ బాణమువలె రణము జేయ
        కుర్రకారంతయు కార్తి కుక్కలవలె రాత్రింబవళ్ళు దిరుగును, వీరు 
        అన్నపానియము, అమ్మానాన్నలను,అందర్ని  నొదలి ప్రేమదేశ మందు 
        సర్వవ్యసన బానిసై మనః శాంతియు గరువై వికారపు కట్టు బాట్ల
ఆ :   తోడ మంచి చెడులు దెలియక సంకర
        జాతి చెలిమి యందు జీవనంబు
        తాలిబాన్ల మధ్య తరుణివొలెయని ఈ
        జ్ఞాన హీనులకు విజ్ఞాన  మేది ?
 సి : కాసిమో పాలిటన్ కారడవిన చూడు వసుదైక సంతతి విధులు , {రాదు
       ఆమని ( జీవన మందున కొదరి కెన్నడు } వీడదు కాంచనంబు )
       తిరిగేది బెంజిలో త్రాగేది గంజినే , చదువులధికమైన చవట లేను  
       సంపాధనధికులు సంస్కార హీనులు, తరుణులు దిరుగును తుక్కు బట్ట 
  ఆ : గట్టి, చూడ రాని కన్నె అందాలను 
       జూపి , ఆకు వక్క సున్న మైన 
       విడువ లేరు వీరి విధము లొక్కటి యైన 
       వీడును తమ కన్న వారి నైన | 
   
ఆ : పట్టు పరుపు పైన పాలిండ్ల పైనాశ
      బడ్డ మనుజుడు తన పరువు తోడ
      పతనమౌను వంశ పరివార నాడ ప్ర
      తిష్ట, నట్టి వార్కి గష్ట మౌను |
    

Tuesday, 8 March 2011

శంకరాభరణం: సమస్యా పూరణం - 248 (ఆడువారిని తన్నుటే)


తే : నేత గాంధి టోపి ధరించి ప్రీతి తోడ 
ఓటు న ర్థించగా మెచ్చి ఓటు వేసి
ప్రాణ మిచ్చిన; ఓటరు బ్రతుకుతోడ
ఆడు వారిని తన్నుటే న్యాయ మగును !

01/06/2011

: మదిలో నీరూపమును నె
పదిలంగా దాచుకొందు పదికాలలకున్
తుదికంటూ వేచెద నె
ముధిమిన మధురాంమృతంను ముట్టుటగొరకున్.


ఆ: మూడు కనుల వేల్పు మురహరుండు మదిలో
నుండ, హరికి నైన నుండు మురము
రమ్ము, రమ్ముగొట్ట దుమ్ములేపుచునుండు
మురమురమ్ము ముందు మానవులకు.
( మురముర= కోపము)

17/06/2011
తే: వరుడు వనమందు గనిపించె మరుడు వలెను
మరులు గొలిపెడి మగువలు మురిసి బిలువ
మరుడు మురిపించె , యముడు కింకరుల జూపె
వాంఛ దీర వాపులు రాగ, వానిపైన |
( వాపులు = రోగములు)

18/06/2011
క : చింతలధికమై దిరుగగ
     చింతా మణి కంటె మంచి చెలువలు గలరే  ?
     చింతలు ధీర్చ నని దెలుప  
    చింతామణి ఇంటికెడలె నింతి నొదలి తాన్ !

     
   
క: ఉత్తర కుమారుడు బలికె 
    నుత్తరియములను బహుమతి నిచ్చెడ నీకున్
    నుత్తర ! పార్థుని దయతో 
    నుత్తరమున భాను బింబ ముదయంబాయెన్ 


Sunday, 6 March 2011


తేటగీతి
సత్య మెరుగక నిత్యము నిత్య నంద
నామ జపమును  సేయంగ నేమి వచ్చు
తిరిగి తిరుగంగ కలుగును  నారి పొందు
కామ మధికమై కడతేరు కాయ మందు

ఛందస్సుతో ఇది నా మొదటి పద్యం. ఇది నా తెలుగు గురువు గారైన "  శ్రీ మొలుగు పార్ధసారధి" గారి కి మరియూ నా స్నేహితుడు " చెరసాల రేణుకా ప్రసాద్ " కు   అంకితం .
తే : యోగ సంకల్ప మనుజుడు యోగి యౌను
బోగ సంకల్ప మనుజుడు రోగి  యౌను
మలము పోనిచో దేహమే హాల హలము
రోగి యైనచో  దీపమే ఆగి పోవు !

తే : నల్ల ధనముఫై అందరు చల్ల జేయ 
నల్ల ధనపు నేతల అల్ల బెల్ల ములకు 
మల్ల గుల్లాల మన్మోహన్ మెల్ల మెల్ల 
గడుగు లేయగా చిక్కరు పిడుగు లెల్ల !
ఆ : సిటి జనులమనేటి నేటి జనులు తమ 
నాగరీకులన్న నిజము తెలియ 
యోగ సాధనమున యౌగులై సాధించె
దరు సమస్య రహిత దేహమన్ను !
ఆ : చెట్టు నీడ లేక సెగలు పొగలు కక్కు 
నగర జనులు , ఊరి నడుమ నీడ
లేని పురజనులు తలా పిడికెడు తాము 
సేయు తప్పే యన్న సత్యము సుమి !
ఆ : కాయ మందు ప్రాణ వాయు వున్న వరకు 
కాయ ధర్మ మెరిగి కష్ట పడిన 
ఆది జనుల యొక్క ఆరోగ్య సిరుల ల 
గుట్టు ఏమి యన్న గట్టి యోగ !
ఆ: కాల కూట విషము మలమన్న సంగతి
ఇల్లు కట్టి చెప్ప, ఒళ్ళు మరచి
ఉప్పు కప్పు జనులు నొప్పుగా తింటున్ టె
జబ్బు వృద్ధి యగును డబ్బు లాగ !