Thursday, 11 February 2016

గీత ద్వయ ద్విపద గర్భ సీసము

శ్రీ రాప్తాటి ఓబిరెడ్డి గారి శ్రీనివాస చిత్ర కావ్యము లోని పద్య ప్రేరణ తో నా మిడిమిడి జ్ఞానముతో  శ్రీనివాసుని గొల్చుచు శ్రీవాణి స్తుతి గర్భముగా నా ప్రయత్నము .  

     గీత ద్వయ ద్విపద గర్భ సీసము 

 సీ: శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చుర 
----గోప బాలక వేగ గ్రోల రార !
గాన లోలుడు ! గాన కైంకర్య మందున 
---గాత్ర శుద్ధి యగును ఘనముగాను !
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కులు 
----జిహ్వ బల్కుచు నుండు స్థిరము గాను!
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందున 
----పొంక మలర ముక్తి పొంద గలవు !

గీ: పూలు దండిగ దెచ్చి పూమాల వేయ
మూల మెల్లను దెల్పు భూపాలు డతడు ! 
భక్త వర్యుల గాచు భవ్య ప్రదాత !
ముక్తి నిచ్చుచు నుండు ముప్రొద్దు లందు !


గర్భ గత గీతము ! శ్రీనివాసుని పై 

శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చు 
గాన లోలుడు ! గాన కైంకర్య మందు 
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కు
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందు

గర్భ గత గీతము 2 శ్రీ వాణి స్తుతి

గొల్వ శ్రీ వాణి మెచ్చుర గోప బాల !
గాన కైంకర్య మందున గాత్ర శుద్ధి !
జేయు కొంగ్రొత్త బల్కులు జిహ్వ బల్కు!
మున్గు శ్రీసేవ యందున  పొంక మలర !  

గర్భ గత ద్విపద 

శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చు
గాన లోలుడు ! గాన కైంకర్య మందు 
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కు 
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందు 
పూలు దండిగ దెచ్చి పూమాల వేయ
మూల మెల్లను దెల్పు భూపాలు డతడు ! 
భక్త వర్యుల గాచు భవ్య ప్రదాత !
ముక్తి నిచ్చుచు నుండు ముప్రొద్దు లందు !

శ్రీ శ్రీ చింతా రామకృష్ణా రావు గారి ఆశీస్సులు .

ఆటవెలది పంచక సీసము.

సీ.  ప్రీతి సీసమునను గీత ద్వయంబును 
     - ద్విపద కూడను వ్రాసి తేజరిలిరి.
మీదు గర్భ కవిత  మేలుగా నున్నది 
   - మీదు కృషిని మెత్తు మిగులు గాను.
రేపు కలవ వచ్చు, ప్రీతితో మహితాత్మ! 
    - వరప్రసాద! మనసు పంచవచ్చు.
ఆట వెలది కూడ హాయిగా వ్రాయండి 
    - సీసమునను మీరు ధ్యాస నిలిపి.
ఆ. గణము గుణముఁ గల్గి గణుతింపఁబడియెడి, 
    - చక్కనైన కవిత సరసు లెంచు.
కంది కులజ మీర లందంబుగా చిత్ర 
  - బంధమల్లగలరు. బంధురముఁగ..

Friday, 5 February 2016

పాద గోపనం.... నాల్గక్షరముల కొకటి నాల్గవ పాదము

పాద గోపనం 

కందము మది నుండ కల్ శం సొగసు ను 
దారి ! రా ! మను నవారి రా 
పోక ఆర్త జూచు భూమీశ ! బంగారు !
  
నాల్గక్షరముల కొకటి నాల్గవ పాదము   



ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రక్తమును ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.

ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

రామ చంద్రుని పాదము రక్తి తోడ 
బట్టి, లంకకు వారధి గట్టి వీర
వానరుల తోడను వెడలి వైరితతుల 
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !


ధనికులదిక మయినయట్టి ధరణి యందు 
కులము బలమని దిరుగెడి ఖలులను,తన 
వారనక కలియుగమందు వైరి తతుల
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !

Thursday, 23 October 2014

మా అమ్మ పాడు పాత .పాట.. .

బ్లాగు వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో ... 

ఇల్లు ఇల్లాంటావు, ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడే చిలుకా ? 
అల్లంత దూరాన వల్ల కాడు లోన నీ ఇల్లు ఉన్నదే చిలుకా ... 

వచ్చు నాడు నీవు వెంటేమి తెచ్చావు, పోవు నాడునూ అంతేను చిలుకా ... 
మున్నాళ్ళు ముచ్చటకు మురిసేవు, భ్రమసేవు, ముందు గతి కానవే చిలుకా ... !! ఇల్లు !!

ఆలు బిడ్డలంటూ, అన్నదమ్ము లంటూ, ఆరాట పడ బోకె చిలుకా ... 
నీకు నీవే గాని, నీ కెవ్వరును లేరు నామాట నమ్మవే చిలుకా  !! ఇల్లు !!  

ఆస్థి పాస్తుల కొరకు అస్తమాను నీవు కుస్తీలు పట్టేవు చిలుకా 
అస్థిరముల పైన గస్తీలు నీ కేల కాస్త యోచించవే చిలుకా ... !! ఇల్లు !!

ఊపిరున్నన్నాళ్ళు ఊరి లోని వారు మావారు అందురే చిలుకా 
ఊపిరి పోగానె భార్య బిడ్డలు కూడ నిన్ను జూడ కుందురే చిలుకా ... !! ఇల్లు !!

పేరు తెచ్చానంటు, పైకి వచ్చానంటు, వీర్ర వీగకె వెఱ్ఱి చిలుకా 
ఈ శ్వాస ఎంతెంత, నీ పేరు ఎంతెంత, ఇకనైన మేలుకో చిలుకా ... !! ఇల్లు !!

డబ్బు డబ్బంటావు, ఇబ్బంది పడి మురికి దిబ్బలో దిగబోకె చిలుకా 
జబ్బు వచ్చాక, యముడు దబ్బు దబ్బున లాగ, తబ్బిబ్బు కానేల చిలుకా ... !! ఇల్లు !!

ఇప్పుడు చచ్చిన వానిని చూచి బావురు మనుచు వాపొక నేలనే చిలుకా 
రేపు నీ చావుంది తప్పించు కోలేవు ముందే జాగ్రత్త పడవే చిలుకా ... !! ఇల్లు !!

నీ దన్న దేహము నిన్ను కాదని పోవు నీ దనేదిక యేది చిలుకా 
ఎవరిదేదియు లేదు ఏది నీతో రాదు, కాదు శాశ్వత మేది చిలుకా ... !! ఇల్లు !!

సారమే లేనట్టి సంసార వలయాన చిక్కి సొక్కగ నేల చిలుకా 
నారు పోసిన వాడు దేవుడున్నాడ నుచు నోరార చాటవే చిలుకా ... !! ఇల్లు !!                  


    

Saturday, 24 May 2014

హరి రిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళివరే......

  

                   అష్టపది  నాధనామక్రియ= ఆదితాళం
|| || హరి రిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళివరే ||

. చందనచర్చిత నీలకళేబర పీతవసనవనమాలీకేళిచలన్మణికుండల మండిత గండయుగస్మితశాలీ  !! !!

.పినవయో ధరభారభరేణ హరిం పరిరభ్యసరాగం| గోపవధూరనుగాయతికాచి దుదంచితపంచమరాగం !!!!

.కాపివిలాస వలోల విలోచన  ఖేలనజనితమనోజం| ద్యాయతిమ్ముగ్ధ వధూరధికం మధుసూధనవదనసరోజం !! !!

.కాపికపొలతలే మిళితా లపి తుంకమపిశ్రుతిమూలేకాపిచుచుంభవినితంబవతి దయతంపులకైరనుకూలే !!!!

.కేళికళాకుతు కేనచకాచిదముం యమునాజలకూలే |మంజుల వంజులకుంజగతం విచకర్షకరేణదుకూలే !! !!

.కరతలతాళ తరళవలయావళి కలితకలస్వనవంశే |రాసరసే సహనృర్యవరా హరి ణాయువతిఃప్రతిశంసే !! !!

.శ్లిష్యతికామపిచుంబతికామపి  రమయతికామపిరామం | వశ్యతిశస్మిత చారుపరామ పరామనుగచ్చతివామం !! !!


.శ్రీదయదేవఫణితమిదమద్భుత కేశవకేళిరహస్యం| బృందావన విపినేలలితం వితనోతుశుభానియశశ్యం!! !!

Monday, 5 May 2014

దినమే శుదినాము సీతారామ | స్మరణే పావనమూ.....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

                              సావేరిరాగం =ఆదితాళం
============*================
|| || దినమే శుదినాము సీతారామ | స్మరణే పావనమూ

. ప్రీతినైన ప్రాణభీతినైన | కలిమచేతానైనా నిన్నే తీరుగాదలచీనా ||ది||
. అర్థాపేక్షను దినము వ్యర్ధాముగాకుండా | సార్ధాకాముగ మిమ్ము ప్రార్థానా జేసినా || ది|| 
. మృదంగా తాలాము తంబురా శృతిగూర్చి | మృదురాగముల కీర్తనలు పాడినా విన్నా ||ది ||
. నిరతముమెరుగు బంగరుపుష్పముల | రఘువరుని పాదంబులు అమరపూజీంచినా || ది || 
. దీనా శరణ్యా మహానుభావా శ్రీ | గానలోలయాని ధ్యానాము జేసినా || ది!!||
. అక్కారా తోడ భద్రాచలమునా నున్నా చక్కాని సీతారాముల గొలచీనా ||ది||

యశోద భాగ్యమే .......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

.                              కేదారగౌళరాగం =ఆదితాళం
==================*=========================
|||| యశోద భాగ్యమే |భాగ్యమే మన యశోద భాగ్యమే ||||

. అశేషజీవాంతరాత్ముడగు హరి | కిశోరమై బుట్టెనే శుకయోగి |||| 

. నందనుడని ఆనందించుటకును | నందుడెంతపుణ్యుడోశుకయోగి |||| 

. సర్వేశ్వరునకు స్తన్యమిచ్చుటకు | యుర్వినేమినోచెనో శుకయోగి ||||

. రమణిరొ పార్ధసారధి యగుకృష్ణుని | కొమరునిగాగనెనే శుకయోగి |||| 

. దురితాత్ముండగు శుదర్శన ధరునకు | నిదర్శనముజూపెనే శుకయోగి ||||  

దొడ్డరాచ బిడ్డడవై నందుకు.....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

 మోహనరాగం= ఆదితాళం
============*=================
|| || దొడ్డరాచ బిడ్డడవై నందుకు | దొరికితి వౌనయ్యారామయ్యా

. దండి రాచకుల మండలిలో ఘన |కొండవనుచు నీయండచేరితిని| మొండిబండ ఉద్యోగంబాయెను | తిండిలేని చాకిరి మెండాయెను ||దొ|| 

. దిట్టమైన ప్రాపకమని నినునే |గట్టిగాను నెరనమ్మినదాసుడ |పొట్టకూటికే గతిలేదాయెను | వట్టిపోతురాజుల కొలువాయెను ||దొ|| 

. పేరుకీర్తిగల ప్రభువులలో ఘన | పేరుగొన్న దొరవనినిను నమ్మితి | పొరుగూరు బిచ్చమీపూరనుదిని|నాపేరుజెప్పుకొని బ్రతుకుమటంటవి ||దొ|| 

.దాచచోటు లేకను నీదగ్గర |దాచుకొన్న బిక్షాటన ద్రవ్యము | జూచిదోసమనిమదిలొనెంచక |దోచుకొందమని యోచనజేస్తివి || దొ||

. విర్రవీగుచును వడివడిగా యా |వెర్రిగోపికల వరగృహములలో |
బొర్రనిండ కర్రావుల పెరుగును | జుర్రమరగి దాసునిగనవైతివి ||దొ|| 

. వాశిమీరగను పాములపాటి | నివాసులైన శ్రీదేవరవారిని | నమ్మియున్న నరహరిదాసుని | దరిజేర్చుమన్న పరదేశిని జేస్తివి ||దొ||