Tuesday, 16 June 2020

ఊర్వశి వృత్త గర్భ సీసము

ఊర్వశి వృత్త గర్భ సీసము

మురళీధర కరణ! భూమీశ! మోక్షప్రదాయకా! శ్రీ నిధి ధర్మ తేజ
గోవర్థన గరిమ! గోపాల! శృంగార గానలోలా! హరి కరద దీర్చు
దీనజన భరిమ! ధీమంత కావంగ రమ్ము శ్రీశా! వేగ రంగ రంగ
దివ్యాయుధ భరణ! దివ్య ప్రభావా! మనోహరా రావయ్య నోములు గన

పారి పోకుమ రఘువర పాడి గాదు
దేవదేవుడవని విని తిరిగి తిరిగి
కడు బడలి యుంటి నురూపు కానలేక
కరుణ జూపు భక్తులపైన కంజనేత్ర!

ఊర్వశి వృత్త (నతతరగ యతి 8)

కరణ! భూమీశ మోక్షప్రదాయకా! శ్రీ
గరిమ! గోపాల! శృంగార గానలోలా! 
భరిమ! ధీమంత కావంగ రమ్ము శ్రీశా!
భరణ! దివ్య ప్రభావా! మనోహరా రా !

No comments:

Post a Comment