Friday 11 November 2011

భక్తి

పల్లవి :నిజము దెలియక నీనామ మిడచి నే నింత కాలము మూర్ఖుడ నైతిని స్వామీ......
చ:1. ఆశల గిరులపై అనుబందపు సాలెగూళ్ళను గట్టి వ్యథలు జెందితి స్వామీ...... || నిజము || 
2. అవమానములన్నియు నవనాడులు నిండగ నిద్రకు నీళ్ళొదిలితి స్వామీ...... || నిజము || 
3. శివుని రాజ్యమందున చీమకు జిక్కును మనిషిగ నే నేపాపము జేసితి స్వామీ...... || నిజము || 
4. అసురలకందరికి అభయము నిచ్చితివి నేనంతటి అధముడనా స్వామీ...... || నిజము || 
5. కొడుకుల కోసమని కూడబెట్టి నే గూటికి కరువై దిరుగుచుంటిని స్వామీ...... || నిజము || 
6. అందమందమని నే నీ మాయ లోక మందున కురూపినైతిని స్వామీ...... || నిజము || 
7. ఈభవ బంధమ్ముల బాధలను తాళలేక నిను వేడుకొనుచుంటిని స్వామీ...... || నిజము || 
8. పాఱుపత్తెపు పలుకులు పాముల వంటివని పాతర వేసితి స్వామీ...... || నిజము || 
9 నాకందేనా నీ దివ్య చరణాలు కన్నీటితో కడుగుటకు స్వామీ...... || నిజము ||
10. అణువణువునా నుండెడి వాడవే నా దేహమందు చోటు లేకుండెనా? స్వామీ...... || నిజము || 
11. తప్పులెంచక తమము దీర్చి తోడుగ నుండుము స్వామీ...... || నిజము || 

పల్లవి: దేవి దేవి జగదాంబ ! దేవి దేవి దుర్గాంబ
. మహిషాసురుని మర్థించి ! మైసూరందు కొలువుండి మమ్ముగాచిన చాముండి...చాముండి...చాముండి || దేవి దేవి ||

. శంకరాచార్యులతో నడచి ! శృంగేరి యందు కొలువుండి మా చదువుల తల్లి శారదాంబ...శారదాంబ...శారదాంబ || దేవి దేవి ||
. కృష్ణమ్మ కోరగ కరుణించి ! విజయవాడ లోన కొలువుండి మా దుర్గతి ద్రుంచిన దుర్గాంబ... దుర్గాంబ ...దుర్గాంబ || దేవి దేవి ||
. వనదేవత వడ్డించ ! హోర్నాడందు కొలువుండి మా యకలి దీర్చిన అన్నపూర్ణేశ్వరి ...అన్నపూర్ణేశ్వరి ...అన్నపూర్ణేశ్వరి|| దేవి దేవి ||
. శివ కేశవులకు సాటిగ నిలచి ! కంచిలోన కొలువుండి మా కష్టము దీర్చిన కామాక్షి ... కామాక్షి ...కామాక్షి || దేవి దేవి ||
. ముక్కంటిని మురిపించి ! మధురలోన కొలువుండి మా మిరాశి మీనాక్షి... మీనాక్షి ...మీనాక్షి || దేవి దేవి ||
. విశ్వేశ్వరుని వరియించి ! కాశీలోన కొలువుండి మా వికృతి దీర్చిన విశాలాక్షి ... విశాలాక్షి ...విశాలాక్షి || దేవి దేవి ||
 సీ:
రవికుల దశరథ రాజసుతునిగ జ |  న్మించె విష్ణువు ముని జనగణము
రక్షింప ధరణిపై రాక్షసులను జంపి | తపసి యాగము గాచి తమముదీర్చి
శివుని విల్లు విరచి సీతనుబెండ్లాడి | దారతోడ నయోధ్య జేరి, తండ్రి
మాటకై యడవికి మరలెను తా సతి |   తమ్మునితోగూడి త్వరితగతిని
మారీచుడు మృగమై మాయజేయగ రావ |  ణాసురునకు జిక్కె నాడు సీత
కిష్కింధ జేరి సుగ్రీవ హనుమ జాంబ|  వంతుల తోగూడి వాలిని వధి
యించి రాజ్య మతని కిచ్చి రాజుగ జేసె; |  లంకిణి జంపి, జలధిని దాటి
గనుగొనె సీతను కపిరాజు వనమందు |    నంగుళీయకమును నమ్మకిచ్చి

వాయు నందన  దెచ్చెన  వార్తలు విని
వారధిని గట్టె, కడలిపై వానరులు స
కాలమున నటు లంకకు కాలు మోపి
రావణాదుల గూల్చిరి రణముజేసి
 

రావణానుజు మన్నించి రాజ్యమిచ్చి
పుష్పకవిమానమందున పురముజేరి
రాజ్యమేలెను పురజనరంజకముగ
రక్తి నాదర్శ పురుషుడై రాము డవని.


శుభమస్తు!


సీ . శేషాద్రి గిరిపైన శయనించె నాస్వామి | యెల్లలోకములను నేలివచ్చి
నీలాద్రి గిరిపైన నిద్రించె నాస్వామి | యెల్ల రాక్షసులను నేరివేసి
గరుడాద్రి గిరిపైన కనిపించె నాస్వామి| యెల్ల విఘ్నములను కల్లజేయ
అంజనాద్రిగిరిపై నందుకొనె స్వామి | యెల్ల వినతులను మెల్లగాను
వరునిగ వృషభాద్రిన స్వామి వరములిచ్చె
శిలల నారాయణాద్రిపై జింత దీర్చె
మొదట వేంకటాద్రికి జేర ముక్తినిచ్చె
సప్తగిరి దాట తమము సమాప్తిజేసె|

సీ .
సి )అంజనాద్రిగిరిపై నంజలి ఘటియించి| పాదదాసుడనౌదు ముదముతోడ
వెంకటాద్రిన నేను వేంకటేశుని జూడ | పరమపదవి గందు పరుగు తోడ
నారాయనాద్రిన నారద బూజిత | పాదు ప్రక్క నడచతు భక్తి తోడ
శేషాద్రి పై జేరి శయనించిన పరమ| పురుషుని జేరెద ప్రజ్ఞ తోడ
గురుని గరుడాద్రి పైనేను గురుతుగాను
వరుని వృషభాద్రి పైనేను దిరుగబోదు
మరలు గొల్పు శ్రీవారిని మరల బట్టి
ఉభయ దేవేరులకు మధ్య నుండ జేతు |


ఆ)
సప్తగిరులపైన నాప్తుడని దెలియ
సప్తగిరులయందు గుప్త చిత్తు,
సప్త సక్తులను సమాప్తిచేయగ నేను
సప్తగిరులమెట్టె స్వామి నేడు|
సీ .అకళ్యాణ రాముని కమనీయ చరితము | కనులార జూడగ కలసి వచ్చె
నవనీత చోరుని నటనముల్ జూడగ | నట్టడవిని దాట నడచి వచ్చె|
తిరునామమును పెట్టు తిరుమల వాసుని| తీరును జూడగ తిరిగి వచ్చె
సిరులిచ్చి గాపాడు శ్రీనివాసునకును| ముడుపులు జెల్లింప నడచి వచ్చె|
కలతలను త్రుంచమని వేడ కదలి వచ్చె|
వ్యథలగడతేర్చ మని కోర వడిగ వచ్చె|
ముక్తినిచ్చిగాపాడగ రక్తితోడ|

పరమ పురుషుడని దెలియ బడయ వచ్చె|
28/nov/2011

౧శరణం స్వామియె శరణం
శరణం హరిహర సుపుత్ర శరణం శరణం
శరణం సద్గురు శరణం
శరణం ఎరుమేలి వాస శరణం శరణం
౨శరణం స్వామియె శరణం
శరణం మాధవ కుమార శరణం శరణం
శరణం శాస్తా శరణం
శరణం శబరిగిరివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం శంకర కుమార శరణం శరణం
శరణం హేప్రభు శరణం
శరణం పంపానివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం
శరణం సత్ప్రభు శరణం
శరణం అళుదా నివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం ఆనందరూప శరణంశరణం
శరణం మోహన శరణం
శరణం పూంగా వనవిభు శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం ఇరుముడి ప్రియునకు శరణం శరణం
శరణం రక్షక శరణం
శరణం నీలిమలవాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం వీరమణి కంఠ శరణం శరణం
శరణం విష్ణుం శరణం
శరణం పులివాహనునకు శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం శిరియాన వట్ట శరణంశరణం
శరణం వల్లభ శరణం
శరణం పెరియాన వట్ట శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం విల్లాలి వీర శరణంశరణం
శరణం నిర్గుణ శరణం
శరణం పందళ నివాస శరణం శరణం
౧౦
శరణం స్వామియె శరణం
శరణం గురువాయురప్ప శరణంశరణం
శరణం సతతం శరణం
శరణం కాంతమల జ్యోతి శరణం శరణం
౧౧
శరణం స్వామియె శరణం
శరణం మణికంఠ స్వామి శరణంశరణం
శరణం అగజా శరణం
శరణం భూలోకనాథ శరణం శరణం
౧౨
శరణం స్వామియె శరణం
శరణం జ్యోతియ స్వరూప శరణంశరణం
శరణం ఈశ్వర శరణం
శరణం వరదైత్య దమన శరణం శరణం
౧౩
శరణం స్వామియె శరణం
శరణం భువనేశ్వర తవ శరణంశరణం
శరణం షన్ముఖ శరణం
శరణం కలియుగ వరదుడ శరణం శరణం
౧౪
శరణం స్వామియె శరణం
శరణం నారాయణునకు శరణంశరణం
శరణం శ్రీధర శరణం
శరణం రాజాధిరాజ శరణం శరణం
౧౫
శరణం స్వామియె శరణం
శరణం సుర మునిసురక్ష శరణంశరణం
శరణం వీరా శరణం
శరణం పురుషోత్తమునకు శరణం శరణం
౧౬
శరణం స్వామియె శరణం
శరణం మధుసూదనునకు శరణంశరణం
శరణం కేశవ శరణం
శరణం శ్రీరామ చంద్ర శరణం శరణం
౧౭
శరణం స్వామియె శరణం
శరణం కమలేక్షణునకు శరణంశరణం
శరణం సద్గుణ శరణం
శరణం దామోదరునకు శరణం శరణం
౧౮
శరణం స్వామియె శరణం
శరణం నర్తన సుప్రియ శరణంశరణం
శరణం నిరతం శరణం
శరణం మాతా పిత గురు శరణం శరణం

రామా| ఇనకుల సోమా
సోమా| నీనామమేను సోబడు రామా|

రామా| జానకి ధామా|
ధామా| దుర్వాద ద్రుంచు తారక రామా|
( దుర్వాద= నింద)

రామా! రవికుల సోమా!

సోమా! సకల సుగుణాభి సుందర రామా!
రామా! జానకి ధామా!
ధామా! దురితము దహించు దావరి రామా!

21/07/2012
సీ :
సీస పద్యములను వ్రాసెద శ్రీపతి | పాద పద్మములకు ప్రణతి జేసి 
నఖిల లోకములకు నాదారముగ నుండి | మునిజనులను గాచ ముందునిలచు 
శేష శయనుడైన  శ్రీ హరి చరితను, |పుడమి జనులనెల్ల బుట్ట తేనె 
దరికిజేర్తు దిరిగి దిరిగి, దశా వతా | రములు ధరణి యందు  రక్కసులను 
జంపి, పరమ భక్త జనులను రక్షించి 
ధర్మ మార్గములను కర్మతోడ 
దెలుప నెంచి, తనదు దేహ బలము జూప 
గాదు , శరణు యన్న కలిమి నిచ్చు | |
----
రామాయణ ఘట్టములు  కొన్ని తోటక వృత్తములో 

పరివర్తన జెందిన పామరుడే 
విరచించె చరిత్రను వృత్తముగా (వేదము )
త్వరి తమ్మున బ్రోయగ దాససతిన్ 
నరయాసము బట్టిరి నాడికమున్

మురిపించగ జింకయె పుత్తడి గా 
మరి గోరెను సీతయె మైకమునన్ 
పరిగెత్తెను రాముడు వాకమునన్ 
పరి మార్చెను జింకను బాణముతో 

సరితూగు స్వరమ్మున సాధకుడై
మరణించుచు బల్కెను మంజువుగా     
దుర వాసము గోరిన దుర్జనుడై 
ధరణీజను లంకకు తంత్రమునన్ 

నరపాలుడు జేర్చెను నాశము కై 
పరమాత్ముని గాంచిన వానరులే 
శరణాగతవత్సల  సఖ్యము కై 
పరివారము తోడుగ వచ్చెనులే 

దొర తారక రాముని దూత్యము కై 
పర దేశము మారుతి పాదమిడెన్ 
దరహాసము జేయగ దైత్యసతుల్ 
పరికోపము జెందియె వాలముతో 

పుర వీధులు గాల్చెను పూర్ణముగా 
కరిపించెను వైరిని కాతరుడై 
 ధరణీజను గాంచెను  తంత్రముతో 
డరి వర్గము జెందెను యాతనముల్