Saturday 4 May 2019

కేశ బంధ తోటక వృత్తము

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ కందుల వరప్రసాద్  కేశ బంధ తోటక వృత్తము విరచించిరి. వారి మాటలలతో పాటు వారి రచనను కూడా తిలకించండి.
నేను తోటక వృత్తము నందు ముకుందుని పై వ్రాసిన పద్యమును జుడగలరు.  కేశవునకు కేశ బంధము లో చిత్తగించ గలరు.  
దమనుండు ముకుందుడు దైత్యులకున్
దమకమ్మున బ్రోచును దాసతతిన్
రమణీయములీశు స్ఫురద్గుణముల్
దుమికించును దూరము దుర్దశలన్ 

సమయించు సమస్యలు సారమతిన్
         కమలాప్తుడు భక్తుల గాచు వెసన్              
యమ బాధలు దీరుచు నా క్షణమే
సమకూరును సర్వము సాధనతో

విముఖత్వము జూపక ప్రేమమెయిన్
కమలాలయ దీర్చును కామితముల్
యమపాశము రాదిక యా దరికిన్
మము జేర్పును చిన్మయ మార్గమునన్

గోపుర బంధము

జైశ్రీరాం. 
ఆర్యులారా! 
శ్రీ కందుల వరప్రసాద్ రచించిన గోపుర బంధమును తిలకించండి.
శ్రీ  
సే
కు
శ్రీ  
రు
యి
భా
సి
ల్లె
డు
క్త
రు
డు
రు
డు
భు
విన్
జే
సె
ము
రి
పు
తి
యి
బా
నే
గాం
చి
యే
లు
వై
కుం
ము
నన్

శ్రీసేవకు శ్రీకరుడయి,
భాసిల్లెడు   భక్తవరుడు, భవహరుడు భువిన్ 
జేసె రణము రిపుతతిపయి,
బాసలనే గాంచి యేలు వైకుంఠమునన్!
భావము : లక్ష్మీ దేవి సేవలతో సంపత్కరుడై, భవ హరుడు ప్రకాశించుచు భువిలో రాక్షస గణమును ద్రుంచి, సద్భక్తులను వైకుంఠమునకుగొనిపోవును.

Monday 22 April 2019

క కారాద్యక్షర కందము

కందము
కవచము కబళించెను కద ,
కవగొనె కలుషమ్ము ఖలుల కలయిక కతమున్
కవి సన్నుత! కరి వరదా!
కవిగొంటిని కర చరణము కరుణను కనుమా!

అర్థం :- కవచము = బాహ్య శరీరము , కబళించెను = మనసును వశపరచు కొనెను, కవగొనె=కూడెను , కలుషమ్ము = మాలిన్యం , ఖలుల కలయిక కతమున్ = దుష్టుల స్నేహము కారణమున , కవిగొంటిని = సహగమనము చేసితి , కర చరణము = తీరము చేర్చు పాదము , కవి సన్నుత! = కవులచే సన్నుతింప బడిన, కరి వరదా! = కరి రాజును కాపాడిన దేవ , కరుణను కనుమా= కరుణతో నను కాపాడు స్వామి .
భావము :- బాహ్య శరీరపు అందములో పడి నా మది పట్టు దప్పెను, దుష్టుల స్నేహము కారణమున నా మది కలుషితమైనది. భవ భయములు తీర్చు పాదములు పట్టితిని, కరి రాజును కాపాడిన రీతి నా పై కరుణారసము కురియ చేయుమా దేవాదిదేవ!

గుడుసుల కందము

కందము
తిరిగి తిరిగి దివిని క్షితిని
సిరిని కినిసి నీలిగించి చిక్కి గిరిని ని
ల్చిరి ప్రీతిని విధి బిగినీ
విరించి కీరితి నిధి నిడి బిలిబిలి గ్రీష్మీ!

అర్థం :- బిలిబిలి గ్రీష్మీ! = ముద్దు లొలుకు నవ మల్లిక, దివిని క్షితిని = దేవలోకము, భూలోకములలో, తిరిగి తిరిగి= వెదకి, నీలిగించి= తిండి లేక మాడి, సిరిని కినిసి= లక్ష్మీదేవి ని సమీపించి, చిక్కి= కదలలేక, గిరిని నిల్చిరి = కొండపై నిలచి, విధి బిగిని = విధి శాపముచే, ప్రీతిని= ఇచ్ఛ తో, విరించి= విష్ణువు, కీరితి = యశస్సు
నిధి నిడి = స్థానం ఇచ్చెను.
భావము :- ముద్దు లొలుకు నవ మల్లిక, లక్ష్మీ దేవి కొరకు దేవలోకము, భూలోకములలో వెదుకు విష్ణువు శుష్కించి , లక్ష్మీదేవిని సమీపించి తిరుమల గిరిపై నిలచి, ఆ కొండకు ఇంతటి పేరుప్రఖ్యాతులు కలుగ జేసెను.

సచల జిహ్విక ( ప్రతీ అక్షరము పలుకు నప్పుడు నాలుక కదులును)

కందము
ధరణీశ ! నీలకంధర!
నిరంజన !త్రినేత్ర !రుద్ర !నిటలాక్ష !సదా
స్మరణా! చండీశ !జటా
ధరుడా ! నన్నేలు చంద్రధర! జడదారీ!

ప్రతీ అక్షరము పలుకు నప్పుడు నాలుక కదులును
by sri Chnti ramakrishna Rao Guruvu gaaru.

సూదంటురాయి పోలిక
నేదైనను కంటపడగనే వ్రాసెదరే.
మీ దగు మేధా పటిమను
శ్రీధవుఁడే మెచ్చఁగనగు. చిన్మయమూర్తీ.💐👌👍

అష్ట నాగ బంధము

కందము
శ్రీపతి! పథపతి! పాదప
మే పావన గోప! చాప మీ యిల కమ్మా!
దాపరి కాడు! పగ కలుప
ద్వాపరి! పక్షం యిలన్! పదపదా ప్రీతిన్!


No photo description available.

అపంచ వర్గీయము (క చ ట త ప రహితము)

కందము
సారస విరి సాయ! సరస
వైరి హర! యశస్వి వరలు వాళి విహారీ!
సారా ! శ్రీవర! లావరి!
శూర! యరయు శేషసాయి! సురవర! శౌరీ!

అర్థం :- సారస విరి సాయ = తామర పూ బాణమా ,
సరస వైరి హర = ప్రక్కన నుండు శత్రు సంహార, యశస్వి వరలు=కీర్తితో ప్రకాశించు, వాళివిహారీ = గోవుల బాటను విహరించు వాడ, సారా = శ్రేష్ఠా , రిరక్షు = రక్షించు వాడవు,
లావరి = బలవంతుడా , శూర = రణము చేయ ఆశక్తి గల వాడ, శేషసాయి= సర్పరాజ ప్రభువా , సురవర= దేవతలలో శ్రేష్ఠా, శౌరీ= కృష్ణా! అరయు! = కాపాడు ,

భావము :- తామర పువ్వు వంటి సుకుమారమైన వాడ,
దరి నుండు శత్రు సంహారుడవు, కీర్తితో ప్రకాశించుచు,గోవుల బాటను విహరించు వాడ, అందరినీ రక్షించు వాడవు, బలవంతుడవు, శత్రు తతిని దునుమ రణము చేయ ఆశక్తి గల వాడ,శేషుని ప్రభుడవు, దేవాదిదేవ! రక్షింపుము.

అచల సచల జిహ్విక సంకరము

కందము
కల వరమే నాకు నభవు
కలమును బట్టె గద కర్త కారకుడిపుడా
కలకు తగు రూపు నీయను
కలవరమును వీడె పద్య కబ్బము నగజా!
***
భావము :- నా మదిలో సాగర మథనమునకు కర్త , కారకుడు తానై పరమాత్మ , కలకు తగు రూపము నీయగ నా కలమును పట్టి వ్రాయించు చున్నాడు కావున నేను కలవరమును వీడి కావ్యము వ్రాయుచుంటి తల్లీ!

కందము
కాయము మాయము, పగయే
గాయము, మిమ్ము పగ వగయు గావవు మామా!
కాయకమె కాయు కావ్యము /కబ్బము
పాయక పక్కమ్ము బిగియు పైకము మామా!

సచలాచల జిహ్విక సంకరము కంద పద్యము

కందము
తకధిమి, తకధిమి చపలము
శకలము జేయర విధాయి! శాకునికుడవై!
సకల కళా వల్లభుడ! క
నక నయనా !కాటువడగ నామది గనవా !
***
అర్థం :- విధాయి = కావలసిన వాడ, తకధిమి, తకధిమి చపలము= ఎక్కువ తక్కువ అను చపలత్వము , శకలము జేయర= ముక్కలు జేయర,
శాకునికుడవై = పక్షిని వేటాడు వాడవై , సకల కళా వల్లభుడ!= అన్ని కళలయందు అమృతము పంచువాడ ,
కనక నయనా = బంగారు కనులు గల వాడ , నామది గనవా != నా మదిలోని భావమును చూడవా , కాటువడగ = గాయపడగ.
భావము :- నా మదిలో సాగర మథనము జరుగు చున్నాప్పుడు , నాలోని చపలత్వమును పక్షిని వేటాడు నటుల వేటాడి ముక్కలు చేయవా, సర్వ కళలందు అమృతము పంచుస్వామి!

సపంచ వర్గీయ (క, చ, ట, త, ప వర్గం) కంద పద్యము

కందము
కాకము కాకమె, కాదుగ
కేకి నటన కఠము తోడ గీతను బంచున్
చీకటి గాముని నమ్మక
మేక గమనమునను గనుడు మేదిని మామా!
***
అర్థం :- మామా = మామ, కాకము కాకమె = కాకి నెమలీకలు పెట్టిననూ కాకియే, కేకి నటన కఠము తోడ = నెమలి నాట్యము కంఠస్వరము తో, గీతను బంచున్ = అమృతము పంచును , చీకటి గాముని నమ్మక= మ్రింగే రాహువుని నమ్మకు, మేదిని = ఈ భూమిపై, మేక గమనమునను గనుడు= ముళ్ళలోని ఆకులను తినును కానీ, ముళ్ళను తినదు, ముళ్ళను ఆకులను కొనదు.
భావము :- మామ,కాకికి ఎన్ని నెమలీకలు పెట్టిననూ కాకియే, నెమలి తన నాట్యము మరియు కంఠస్వరము తో, అమృతము పంచును. రక్తము త్రాగు రాహువు ఎంత మంచిగా నటించినా నమ్మకు,ఈ భూమిపై, మేక గమనమునను గనుడు ముళ్ళలోని ఆకులను తినును కానీ, ముళ్ళను తినదు, ముళ్ళను ఆకులను కొనదు ఎన్నడూ. మేక వలె తెలివైన నిర్ణయం తీసుకో..
నిన్ను వంచించు వానిని నమ్మ వద్దని చెప్పుట.

నిరోష్ఠ్య కంద పద్యం ( పెదవులు తగలని పద్యం)

కందము ( పెదవులు తగలని పద్యం)
కలి జేరిన కీలిని నే
నిలచి నిరతిగా దలచితి నీరజనయనా !
తలచిన రీతిగ నాదరి
నిలచిన గలిగిన కలతల నిష్కృతి కృష్ణా!

అర్థం :- కలి = కలి పురుషుడు,
జేరిన = ప్రవేశించిన, కీలిని = అవనిని, అగ్నిని ,నిలచి= నిలచి, నిరతిగా దలచితి= మిక్కిలి ఆసక్తి తో పిలచితి,
నీరజనయనా = తామర రేకుల వంటి కనులు గల వాడ, తలచిన రీతిగ నాదరి నిలచిన = నే కోరిన విధముగా నా ప్రక్కనున్న , కలిగిన కలతల= వచ్చిన కష్టములు , నిష్కృతి కృష్ణా= విముక్తి కృష్ణా!

భావము :- తామర రేకుల వంటి నయనములు గల వాడ, కలి పురుషుడు ప్రవేశించిన యీ కలియుగ మందు, నేను మిక్కిలి ఆసక్తి తో నిన్ను పిలచితి, నీవు నా ప్రక్కనున్న నాకు కలిగిన కష్టములు తొలగిపోవును కృష్ణా!

అమలాపురం కవిసమ్మేళనం లో చదివిన పద్యాలు.

గీ ":-
ఆది కవి నన్నయ కలమునందు బుట్టి
తిక్కన కరము నందున తీపిని గొని
తెలుగు జాతికి నిండుగ వెలుగు నిచ్చు
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

ఎంచ నెర్రా ప్రగడ వారు మంచి దనుచు
శంభుదాసుడై కొంగ్రొత్త శైలి యందు
విష్ణు కథలు వ్రాయగ మంచి విరుపు తోడ
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

నవరసముల శ్రీనాథుని నవ్య శైలి
పదపదమను పోతన గారి పద్యరాశి
తెలుగు వారింట మెండగు దీపమయ్యి
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

సత్కవుల చిరు నగవుల సంపదలను
భావితమ్ముల వారికి పంచ నెంచి
శతక కర్తలు నీతుల శాంతి నింపు
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

పలుక నన్యులు తెనుగును పరవశమున
దేవరాయుల జిహ్వకు తీపి నింప
దేశ భాషలయందున తెలుగు లెస్స
తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!

ద్విపద, మత్తకోకిల, కంద, ఆటవెలది గర్భ సీసము
@@@@@@@@@@
సీ:- రామ నామము జాలు రాఘవ లక్ష భూముల కన్న నీ పొడమున్ గనంగ
నామమున్ జపియించు నామది నమ్మె రామ మరా యనన్ రమ మంత్ర మోను
పామరుండను భక్త పావన పాహి మోమును జూప రా ముదమున్ ముకుంద
మామ మామవు రామ మన్నియ మౌని శ్యామ పరాత్పరా యతి మాననీయ
గీ :- కందుము వర వంశ ఘనుడ కంద కవిత
నందు కవుల కావ్య మలర గనఘ నీకు
వందనశతమందు వనజ బంధువవగ
నిందు దిగులు బాయు మికవ నినెద రామ.
ద్విపద
రామ నామము జాలు రాఘవ లక్ష
భూముల కన్న నీ పొడమున్ గనంగ
నామమున్ జపియించు నామది నమ్మె
రామ మరా యనన్ రమ మంత్ర మోను
పామరుండను భక్త పావన పాహి
మోమును జూప రా ముదమున్ ముకుంద
మామ మామవు రామ మన్నియ
మౌని శ్యామ పరాత్పరా యతి మాననీయ
మత్తకోకిల,
రామ నామము జాలు రాఘవ లక్ష భూముల కన్న నీ
నామమున్ జపియించు నామది నమ్మె రామ మరా యనన్
పామరుండను భక్త పావన పాహి మోమును జూప రా
మామ మామవు రామ మన్నియ మౌని శ్యామ పరాత్పరా !
కందము
కందుము వర వంశ ఘనుడ
కంద కవిత నందు కవుల కావ్య మలర గన్
వందనశతమందు వనజ
బంధువవగ నిందు దిగులు బాయు మికవనిన్ .
ఆటవెలది
కందుము వర వంశ ఘనుడ కంద కవిత
నందు కవుల కావ్య మలర గనఘ
వందనశతమందు వనజ బంధువవగ
నిందు దిగులు బాయు మికవ నినెద.

చతుర్విధ కంద ప్రమితాక్షర గర్భ చంపక మాల
******@@@@@@@*****
చం:-
కనకన మండుటెండ వెనుకన్ వనమున్ గని భేలవైతి వే
మన మనమున్ వికారి వరమా యనినన్ వరమందు నేను రం
జన జనులెల్ల భద్ర మను సద్ఘనులై యిడ రమ్ము వేగమే
మునమున లాడవద్దు కటమున్ వినవే కవితా సదస్సునన్!
ప్రమితాక్షర వృత్తం (1, 9యతి)
కన మండుటెండ వెనుకన్ వనమున్
మనమున్ వికారి వరమా యనినన్
జనులెల్ల భద్ర మను సద్ఘనులై
మున లాడవద్దు కటమున్ వినవే !

చతుర్విధకందం
కన మండుటెండ వెనుకన్
వనమున్ మనమున్ వికారి వరమా యనినన్
జనులెల్ల భద్ర మను స
ద్ఘనులై మున లాడవద్దు కటమున్ వినవే !

క్రౌంచపద వృత్తము (1, 11 మరియు 19 యతులు )
భారతి! వీణా ! వాజ్మయ వారీ ! పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
శారద! దేవీ! సార విచారీ ! సముచిత వరమిడు సరగున వాణీ!
వారిజ నేత్రీ! పాప నివారీ! వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కోరెద మాతా ! కోమలి గౌరీ ! కొమరుని కరమును కుముదము జేయన్!

గర్భస్థ కంద ద్వయము
భారతి! వీణా ! వాజ్మయ
వారీ ! పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
శారద! దేవీ! సార వి
చారీ ! సముచిత వరమిడు సరగున వాణీ!
కందము 2
వారిజ నేత్రీ! పాప ని
వారీ! వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కోరెద మాతా ! కోమలి
గౌరీ ! కొమరుని కరమును కుముదము జేయన్!

గర్భస్థ రుగ్మవతీ వృత్తం (1,6యతి)
భారతి! వీణా ! వాజ్మయ వారీ !
శారద! దేవీ! సార విచారీ !
వారిజ నేత్రీ! పాప నివారీ!
కోరెద మాతా! కోమలి గౌరీ !
గర్భస్థ కమల విలసిత వృత్తం (1,9 యతి)
పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
సముచిత వరమిడు సరగున వాణీ!
వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కొమరుని కరమును కుముదము జేయన్!
*************//*******
పమిడి= బంగారం, వమథువు = తుంపర,

బహువిధ కందము ప్రత్యేకతలు

1. సర్వ లఘు కందము
2. అష్టాక్షరి కందము
బంధములు
1. శ్రీ కార బంధము
2. ఓం కార బంధము
3. ఖడ్గబంధము 1
4. ఖడ్గబంధము 2
5. ధనుర్బంధము
6. శార్జ్గ బంధము
7. శర బంధము
8. త్రిశూలబంధము
9. కుంతల (బల్లెము) బంధము
10. నాగపాశ బంధము 1
11. నాగపాశ బంధము 2
12. శంఖ బంధము
13. గదా బంధము
14. పుష్పగుచ్ఛ బంధము
15. చామర బంధము
16. హార బంధము
17. పుష్పపాత్ర బంధము
18. పల్లకి బంధము
19. పతాక బంధము
20. ధ్వజ బంధము
21. వీణ బంధము
22. నాగ బంధము
23. అష్టనాగ శ్రీకార బంధము
24. ఫణి కోణ బంధము
25. గోమూత్రికా బంధము1
26. గోమూత్రికా బంధము 2
27. చింతాకు పతక బంధము
28. అశ్వగతి ముక్తాహార బంధము
29. కురంగ హస్త బంధము
30. నగ బంధము
31. పుష్పమాలిక బంధము
32. కుండల నాగ బంధము
33. ద్వినాగ బంధము
34. చతుర్నాగ బంధము
35. మక్షిక బంధము
36.ఛూరికా బంధము
కం
వనజ నయన/ యిన వనమున
ధన జన మనమున/ నినయన/ ధనదు నటనమున్
మనమనమున/ కనకనమన
కనక నవనము న/ను నన న/కనక నమనమున్
(వనజ నయన= తామర రేకుల వంటి నయనములు గల్గి, యిన వనమున = ఇన వంశములో, ధన = ఆవుల మంద, సిరి,లక్ష్మి, జన = ప్రజలు, మనమున = హృదయములో, ధనదు నటనమున్ = కుబేరుడు నృత్యం లో (ధనము సంపాదన) నినయన = క్రుమ్మరించుట చేత, మనమనమున = సకల ప్రాణులందు, కనకనమన = మిక్కిలి ప్రకాశవంతమైన, కనక = బంగారు, నవనము = స్తోత్రము, నను = పిలుపు, నన = పుష్పం, నకనక = బడలిక, నమనమున్ = వంగును )
భావము :- తామర రేకుల వంటి నయనములు గల్గిన రామ, ఇన వంశమున బుట్టిన వాడ! గోవుల ,(సిరి) జనుల, సకల భూతములయందు ప్రకాశవంతమైన శక్తి నీవు, నీ సహస్ర నామములు బంగారము తో సమానమైనవి, వాటిని బలుకగ మదిలోని బడలిక దీరును గద!
Image may contain: drawingNo photo description available.No photo description available.No photo description available.No photo description available.