Monday 22 April 2019

నిరోష్ఠ్య కంద పద్యం ( పెదవులు తగలని పద్యం)

కందము ( పెదవులు తగలని పద్యం)
కలి జేరిన కీలిని నే
నిలచి నిరతిగా దలచితి నీరజనయనా !
తలచిన రీతిగ నాదరి
నిలచిన గలిగిన కలతల నిష్కృతి కృష్ణా!

అర్థం :- కలి = కలి పురుషుడు,
జేరిన = ప్రవేశించిన, కీలిని = అవనిని, అగ్నిని ,నిలచి= నిలచి, నిరతిగా దలచితి= మిక్కిలి ఆసక్తి తో పిలచితి,
నీరజనయనా = తామర రేకుల వంటి కనులు గల వాడ, తలచిన రీతిగ నాదరి నిలచిన = నే కోరిన విధముగా నా ప్రక్కనున్న , కలిగిన కలతల= వచ్చిన కష్టములు , నిష్కృతి కృష్ణా= విముక్తి కృష్ణా!

భావము :- తామర రేకుల వంటి నయనములు గల వాడ, కలి పురుషుడు ప్రవేశించిన యీ కలియుగ మందు, నేను మిక్కిలి ఆసక్తి తో నిన్ను పిలచితి, నీవు నా ప్రక్కనున్న నాకు కలిగిన కష్టములు తొలగిపోవును కృష్ణా!

No comments:

Post a Comment