శ్రీ రాప్తాటి ఓబిరెడ్డి గారి శ్రీనివాస చిత్ర కావ్యము లోని పద్య ప్రేరణ తో నా మిడిమిడి జ్ఞానముతో శ్రీనివాసుని గొల్చుచు శ్రీవాణి స్తుతి గర్భముగా నా ప్రయత్నము .
గీత ద్వయ ద్విపద గర్భ సీసము
సీ: శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చుర
----గోప బాలక వేగ గ్రోల రార !
గాన లోలుడు ! గాన కైంకర్య మందున
---గాత్ర శుద్ధి యగును ఘనముగాను !
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కులు
----జిహ్వ బల్కుచు నుండు స్థిరము గాను!
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందున
----పొంక మలర ముక్తి పొంద గలవు !
గీ: పూలు దండిగ దెచ్చి పూమాల వేయ
మూల మెల్లను దెల్పు భూపాలు డతడు !
భక్త వర్యుల గాచు భవ్య ప్రదాత !
ముక్తి నిచ్చుచు నుండు ముప్రొద్దు లందు !
గర్భ గత గీతము ! శ్రీనివాసుని పై
శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చు
గాన లోలుడు ! గాన కైంకర్య మందు
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కు
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందు
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందు
గర్భ గత గీతము 2 శ్రీ వాణి స్తుతి
గొల్వ శ్రీ వాణి మెచ్చుర గోప బాల !
గాన కైంకర్య మందున గాత్ర శుద్ధి !
జేయు కొంగ్రొత్త బల్కులు జిహ్వ బల్కు!
మున్గు శ్రీసేవ యందున పొంక మలర !
గర్భ గత ద్విపద
శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చు
గాన లోలుడు ! గాన కైంకర్య మందు
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కు
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందు
పూలు దండిగ దెచ్చి పూమాల వేయ
మూల మెల్లను దెల్పు భూపాలు డతడు !
భక్త వర్యుల గాచు భవ్య ప్రదాత !
ముక్తి నిచ్చుచు నుండు ముప్రొద్దు లందు !
శ్రీ శ్రీ చింతా రామకృష్ణా రావు గారి ఆశీస్సులు .
ఆటవెలది పంచక సీసము.
సీ. ప్రీతి సీసమునను గీత ద్వయంబును
- ద్విపద కూడను వ్రాసి తేజరిలిరి.
మీదు గర్భ కవిత మేలుగా నున్నది
- మీదు కృషిని మెత్తు మిగులు గాను.
రేపు కలవ వచ్చు, ప్రీతితో మహితాత్మ!
- వరప్రసాద! మనసు పంచవచ్చు.
ఆట వెలది కూడ హాయిగా వ్రాయండి
- సీసమునను మీరు ధ్యాస నిలిపి.
ఆ. గణము గుణముఁ గల్గి గణుతింపఁబడియెడి,
- చక్కనైన కవిత సరసు లెంచు.
కంది కులజ మీర లందంబుగా చిత్ర
- బంధమల్లగలరు. బంధురముఁగ..