Tuesday 29 April 2014

మనసా నీకొక నమస్కార మూ.....!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !


శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
నాద నామ క్రియ రాగము = ఆది తాళం

మనసా నీకొక నమస్కార మూ ! నా మనవిదె చే కొనుమా  ! అనిశము ఆత్మావ లోకన చే !పరమంది సుఖించు సుమా !! మన !! 

సారము లే నటు వంటి భవార్థి పడి చెడి పోక వె మనసా ! నేరుపు తో హరి హరుల భజించుచు ! జేరవె గురు దరి  మనసా !! మన !!

మూర్ఖ తనంబున కోర్కెల లోబడి ! మోసము నొంద కె మనసా! మురికి తనువు పై మోహ ముడిగి నీ !వెరుకు వెరుంగ వె మనసా !! మన !!

యిందు ముఖుల గని మంద హాసమున ! చిందులు ద్రొక్కకె మనసా ! నింది తమగు యమ బంధ హేతువుల నొంద నేటికి మనసా !! మన !!

ధాత్రిలోను శ్రీ యడ్ల రామ గురు ! మూర్తి సత్కృపను మనసా! నేత్రము తో పరమాత్మ స్వ రూపుని ! స్తోత్రము చేయ వె మనసా!! మన !!

నిత్య నిర్మలంబయిన మార్గ మిది ! నెరిగి సుఖించ వె మనసా ! సత్య వాడ వెంకట దాసుని మృదు ! సరణి గ్రహించ వె మనసా  !! మన !! 

యిలను సద్గురు సేవ జేసితే.... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
హిందుస్తాని కాఫీ  రాగము = ఆటతాళం

యిలను సద్గురు సేవ జేసితే !ఫలము యేమిటి గురు వరా ? 
యీ ధరను సద్గురు ! కృపను పరమునకు ! దారి దొరకును శిష్యుడా  !! ఇల !! 

పంచ భూతము లే స్థలంబున ! సంచ రించును గురు వరా ?
పంచ భూతము లైదు గూడి ! ప్రపంచ మాయెను శిష్యుడా  !!  ఇల  !!  

మూడు కాల్వలు దాట మంటి ! ర దేమిటో సద్గురు వరా ?
ఆశ లే యమ పాశములు ! అవి కోసి వేయర శిష్యుడా  !!  ఇల  !!

తీరుగా జపమాల వ్రేళ్ళను ! త్రిప్పు టేలను గురు వరా ?
ముందు సద్గురు దెల్పిన ! మూల మంత్రము శిష్యుడా  !!  ఇల  !!

ముక్కు చెవులూ నోరు కన్నులు మూసు టేలను గురు వరా ?
అదే షణ్ముఖ ముద్ర యోగుల ! సాధనము రా శిష్యుడా  !!  ఇల  !!

నలు విధంబుల వాద భేదము ! లాభ మేమిటి గురు వరా ?
వేద శాస్త్ర పురాణ గాధలు ! వెర్రి బోధలు శిష్యుడా  !!  ఇల  !!

గురు శిష్యుల ! పరమ రహస్యము దొరకు టెట్లది  గురు వరా ?
ధరను యడ్లా రామ దాసుని ! యడిగి తెలియరా  శిష్యుడా  !!  ఇల  !!

దీని బావము దెలియరా దుర్గుణములిక నెడ బాయరా... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

దీని బావము దెలియరా! దుర్గుణములిక నెడ బాయరా ! దీనర్థమే పర మార్థమని! నీ ఆత్మలో నేరి గుండరా !!  దీని !! 

వాద భేదము మానరా! మన మొచ్చినది పొరుగూరు రా !  ఈ పక్షి దెల్పిన మాట లన్నియు తక్షణం యోచించ రా !! దీని !!

ప్రాకటముగ నమ్మరా! ఈ లోక మంతయు మాయ రా ! రాక పోకలు లేని చోటను! రాజువై కూర్చుండ రా !! దీని !! 

మాయ మాటలు మానరా ! యిది మట్టి బొమ్మని తెలియరా ! దేవుడే యీ పాడు ఘటమునకు ! జీవు డాయెను చూడ రా  !! దీని !!    
  
అడవి పందులు మూడు దనతో ! ఆటలాడెను జూడరా ! కాచి యున్న కాకి పిల్లను! గుటుకుమని దిగ మ్రింగె రా ! ! దీని !! 

మదపు టేనుగు లారు జోడు! పొదల చాటుకు జేరె రా  ! ఈ  గుట్టు తెలిసిన గ్రుడ్లా గూబ గుటుకు మని దిగ మ్రింగె రా ! ! దీని !! 

తొమ్మిదీ కాలువల చెరువు లో !దున్నలై పరుండె రా ! చెరువు వొడ్డున నున్న! కొంగ చేప లన్నిటిని మ్రింగె రా  !! దీని !!  

కొండ చిలువలు రెండు గూడి ! మొండి కెత్తెను జూడ  రా! గండు చీమొకటోచ్చి రెంటిని ! గరచి తిన్నగ ద్రిప్పెరా !!దీని !!

కన్నులకు  గనపడదురా! సద్గుణము సాహసు రాలురా ! మేరు శిఖరము చాటు నుండి! యెగురు చున్నది జూడరా !!దీని !!   

దీనిని గ్రహించుటకు దుష్టులకు !వశ మవదు రా ! నేను నినను భేదము డిగిన! దీని గనుగొన నెంత రా!! దీని !!

ధరలో శ్రీ కాకినాడ పురము నను కాపురము రా  ! గురు మాట తెలిపిన శ్రీ యడ్ల రామదాసుని వర కవిత్వము దెలియ రా !! దీని !!

Monday 28 April 2014

దీని బావము దెలియ వలెనయ్యా... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

దీని బావము దెలియ వలెనయ్యా  ! నరులార మీరు ! దేహ వాసన విడువ గదరయ్యా ! దీని బావము దెలియ లేకను ! దేహ వాసన విడువ జాలక ! గాఢ యోగము దాల్చి పుడమిని ! మూఢులై చెడి పోవ నేలను !!  దీని !! 

వురుము  లే నొక మెరుపు మెరిసే ! మబ్బు లే నొక వాన గురిసెను ! వాన గురిసిన కారణము చే ! సోమ సూర్యులు సాము జేసిరి  !! దీని !!

ధారుణి తల మందున నవ ద్వార  ! వర పుర మందు నిద్దరు  ! వీర వర్యులు గూడి ! ఆకస వీధులకు నపు డెగసి పోయిరి !! దీని !! 

అర్థ రేయిని లేచి ఖేచరి ! ముద్ర యోగము జూచు వేళలో  ! రుద్ర రామా భద్రులకు  ! యే రూప నామ క్రియలు లేవు !! దీని !!    
  
మూడు గెలిచే మూడు రోసి  ! మూడు ముడా డింట నిలచే !  ఏడు కిటకీల మేడ మీదా ! యెక్కి చూడగా తాను తానై ! ! దీని !! 

యి వ్విధంబున నెరుగ జేసిన  ! హిత గురువు మంతిన వేంకట ! యతియు మర్మము ! దెలియకను ! మతి లేక జెడి పొయినారు కొందరు ! ! దీని !! 

వాసిగా శ్రీ యడ్ల రామా !  దాసు దెల్పిన తత్వ మార్గము ! ఆశతో గను గొన్న వారికి ! అపరిమిత సౌఖ్యంబు గల్గును !! దీని !!    

Saturday 26 April 2014

దీని బావము దెలియరా......... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట
==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

దీని బావము దెలియరా ! ఆనంద పదవిని జెందరా ! దీనర్థమే ఘన పరమ పదమని! అను దినము గనుగొనుము రా ! దీని !! 

రెక్క ముక్క లేని కాకి ! దిక్కు లన్నియు దిరిగె రా ! ధిక్కరించక దోమ దానిని గ్రక్కునను దిగ మ్రింగె రా !! ! దీని !!

చావు లేనిది సరస నున్నది ! నీవు యిది శోధించ రా ! దేవుడే యీ పాడు ఘటము కు ! జీవుడాయేను జూడ రా ! దీని !! 

కొండ మీదను రెండు పాముల ! మెండుగా నాడించ రా ! కుండ లాగ్రము నందు నుండెను ! దండి గురు పాదము కోర రా ! దీని !!    
  
వాద బేదము మాన రా ! ఘన నాద బ్రహ్మము గానరా ! సాదు సద్గురు భోధ లిని ! ప్రదానివై కూర్చుండ రా ! దీని !! 

ప్రాకటము గా నమ్మరా ! యీ లోక మంతయు మాయరా ! జోక తో యేకాక్షుర్గ డ వై ! రాక పోకలు మాన రా ! దీని !! 

వాసిగా మంతిన వెంకట దేశకుని పూజించ రా ! భాసు రమ్ముగా యడ్ల రామ దాసుడిది రచియించె రా ! దీని !!    

Monday 7 April 2014

చూడ చక్కని చిన్నదీ....... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

చూడ చక్కని చిన్నదీ ! కడ మేడ గదిలో నున్నదీ ! మూడు రంగుల మడుగులో జలక్రీడ లాడు చున్నదీ ! !చూడ!!

వేద శాస్త్ర పురాణముల కే నాది దేవత నన్నదీ ! వాద భేదము లేని సాధుల ! బోధ జేయుచు నున్నదీ ! !చూడ!!

గురుని మంత్రము గన్న వారికి ! వరము లొసగెద నన్నదీ ! తరము గానటు వంటి పరములకు ! తెరువు జూపుచు నున్నదీ ! !చూడ!!

పాప పుణ్యము లేనిదీ కనుపాప లోపల యున్నదీ ! చూపు లో లోచూపు జూచితె ! వ్యాపకంబై యున్నదీ !!చూడ!!

నామ రూప క్రియలు లేకను ! నాసికాగ్ర మున్ననదీ ! పామరత్వము జేయు వారికి ! భామ భువి గన రానిదీ !!చూడ!!

ధరను మంతిన వెంకటార్యుల కరుణ చే నా చిన్నదీ ! స్థిరతరంబుగ యడ్ల రామా ! దాసు హృదయము నున్నదీ !!చూడ!! 

మత్త కోకిల చరణములు -2

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

ఆది దేవుని విశ్వ రూపుని యంత రాత్మగ గొల్వరా !
వాద భేదము లెన్ని యున్నను వాని జెంతకు జేర రా !
వేద వేద్యుడు కాల చక్రుడు విశ్వ మంతయు నిండె రా !
పాద పద్మము బట్టి యుండిన పాడి పంటల నిచ్చు రా ! 1!

రాక పోకల మర్మ మంతయు లాఘవమ్మున జెప్పెరా!
చీక టెల్లను పార దోలెను జేతి తోడను జూడరా !
శోక మందున సౌఖ్య  మందున సోమ సింధుని బిల్వరా !
లోకు లెల్లరు గాకు లైనను లోక నాధుడు గాచు రా !2!

వేకువందున బల్క కుండిన విష్ణునామము శిష్యుడా ! 
కాకు లెల్లను గూడు జేరగ గష్ట మొందెను జూడరా !  
యా కుచేలుడు చెంత జేరగ యార్తి నంతయు  దీర్చె రా !
యేకు లెల్లను మేకు లైన గజేంద్రుడుండెను జూడరా !3!

ఆర్తి తోడను గొల్చు వారిని యాద రమ్మున బిల్చెరా !
కీర్తి నొందిన సార సాక్షుడు కీలు దెల్పుచు నుండెరా !
కర్త వీవని  వేడు వారల కష్ట మెల్లను దీర్చె రా !
గుర్తు బట్టిన వారి నెల్లను కొండ దాపున జేర్చె రా !4!

చెట్టు లెక్కిన చిత్ర భానుని చిన్ని కృష్ణుని జూడరా !
కట్టి వేయగ గోప బాలుడు కష్ట మొందక నుండెరా !
పట్టు వీడక పంక జాక్షుని పాద పద్మము బట్టరా !
బెట్టు జేయక రట్టు దీయక ప్రీతి తోడుత నుండు రా !5!  
     
రామ నామము రామ నామము రక్ష యన్నది నేర్వ రా !
రామ నామము తామ సమ్మును రట్టు జేయును జూడరా !
రామ నామము కష్ట మందున రామ దాసుని గాచెరా !
రామ నామము జాలు నొక్కటి రామ భద్రుని జేర గా ! 6!

శ్రీ కృష్ణ - గోపికా సంవాదము.


బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

శ్రీ కృష్ణ - గోపికా సంవాదము 

కొంచె మైనను జాలి లేదులె గోప బాలుని కేల నో !
గాంచ కుండిన మానసమ్మున గాయ మాయెను జూడ రా !
పంచ దారను జివ్హ యెందుకొ వంచ కుండెను మాధవా !
మంచి మాటను జెప్ప కుండిన మాయ గాడివి మాధవా ! 1!

కట్టి వేసెను రాతి బండకు కష్ట మాయెను గోపికా !  
వట్టి మాటలు కావు కావివి పట్టి జూడవె గోపికా !  
పట్టి జూడక నీవు నిల్చిన బాధ హెచ్చెను గోపికా !  
రట్టు జేయక చెట్టు వద్దకు రమ్ము  రమ్మిక గోపికా !  2!

మాయ గాడివి పొమ్ము పొమ్మిక మాయ మాటలు వద్దికా !
మాయ జేయుట నేర్చి యుండిన మంత్ర గాడివి మాధవా ! 
మాయ లందున మోస పోతిని మంచి వాడివి కాదు రా !
మాయ మాటల తోడ నామది మార్చ లేవుర మాధవా ! 3!

వద్దు వద్దిక దొడ్డ మాటలు వద్ద నిల్చితి గోపికా !
రద్దు జేయక ముద్దు మాటలు  రమ్ము వేగమె గోపికా !
వద్ద నిల్చితి జూడ మంటిని వాజ్య మేలను  గోపికా !
ముద్దు మాటలు శూన్య మైనను ప్రొద్దు పోవదె  గోపికా !4!

తోడ నుండిన కూర్మి నొందితి, దూర మైనను మాధవా !
గోడ నైతిని వాడ వాడల గూర్మి నొందక  మాధవా !
వీడు చుంటిని వాద మెల్లను వీడ వద్దుర మాధవా !
వీడి యుండుట వల్ల కాదుర వేడు చుంటిని మాధవా !5!

Saturday 5 April 2014

అమ్మా సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ..... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తి కీర్తనలు ,
భూపాల రాగం = ఆట తాళం 
=================*===================
అమ్మా సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ ! అమ్మ బంగరు బొమ్మ లెమ్మా !!
అమ్మారొయిమ్మూగ అరుణోదయం బయ్యె ! అమ్మాల గన్నమ్మ లెమ్మా !!అ !!

తెల తెల్ల వారెను కలకల మని ! పక్షి కులము లెల్లడ లేచె లెమ్మా !!
కిలకిలా రవమూలు చిలుకాలు చెల రేగి ! జలజాక్షి జానకీ లెమ్మా !!అ !!

సతి పతుల మిము జూడ సాధు సజ్జను లెల్ల ! సంతోషమున వచ్చె లెమ్మా !!

సతతాము మీ పాద సరసీజ యుగళము ! స్తుతి యించి తరియింత్రు లెమ్మా !!అ !!

భక్తు లందురు గూడి ప్రార్థింపు చున్నారు ! భక్తా పరాధీన లెమ్మా !!
భక్త శిఖామణి పావని యరు దెంచె ! ముక్తి ప్రదాయనీ లెమ్మా !!అ !!

బ్రహ్మాండ మలరంగ వహ్ని వెలువడి మించు ! జిహ్వేతర చరిత లే లెమ్మా !!

బ్రహ్మరుద్రేంద్రూలు ప్రస్తుతింపగ నొప్పు ! బ్రహ్మ స్వరూపిణీ లెమ్మా !!అ!!

వెల లేని సొమ్ములు వెలదీరా  ధరియించు ! వేళాయె మాయమ్మ లెమ్మా !!
కేలా నద్దము బూని లీలా శ్రీ రాముని ! మేలు గొలుపగ నిద్ర లెమ్మా !!అ!!

ముసిముసి నగవులు పసి పిల్లాలిద్దారు ! కుశలవులు లేచిరీ లెమ్మా !!  

అసహాయ శూరులు ఆకలి గొని నీదు ! దెన చూచు చున్నారు లెమ్మా !!అ!!

మమ్మూ మరువకమ్మ మాయమ్మ సీతమ్మ ! నమ్మి యున్నా మమ్మ లెమ్మా !!
నమ్మిన వారల నరసి బ్రోచుట నీదు ! సొమ్ము గాదటె తల్లి లెమ్మా !!అ!!

సచరా చరంబైన జగ మెల్ల సృజియించి ! పోషించు నడి పించు చిర చిద్రూపిణి లెమ్మా !!

లేచి చిర్రావూరు కామేశ్వర దాసూని ! బ్రోచు వేళాయెను లెమ్మా !!అ!!  

లేరా నాపాలి శ్రీ వీర రాఘవ... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తి కీర్తనలు ,
మల మారుతి రాగం = చాపు తాళం 
=================*===================
లేరా నాపాలి శ్రీ వీర రాఘవ ! లోకాధార మాధవ శౌరి లేరా !!
కారుణ్య సాగర కలుష విదూర నను ! కరుణింతువు గాని  లేరా !!లే !!

అత్రి వశిష్టాది మునులు మీ కృప గోరి ! పాత్రూలై యున్నారు లేరా !!
పద్మమిత్ర వంశోద్భవ గాత్ర నీరద ! చారిత్ర పావిత్ర లేరా !!లే !!

తెల్ల టేనుగు వచ్చి వాకిట నున్నాది ! నల్లాని నా స్వామి లేరా !!
కల్ల గాదు జగ మెల్ల యేలేడు ! రఘు వల్లభ యిక నిద్ర లేరా !!లే !!

అభ్యంగనము నీకు అనురంగ జేసెడు ! అనువైన వేళాయె లేరా !!
సభ్యు లందరు గూడి  సాక్షాత్కరిం చీరి! సంశయముల మాన్ప లేరా !!లే !!

పరమ భక్తులు నిన్ను ప్రార్థించు చున్నారు ! పన్నగాధిప తల్ప లేరా !!
వర భద్రా చలమున శరణాగత త్రాణ ! బిరుదు బూనిన తండ్రి లేరా !!లే !!

నిరతము సంసార భరము బాపెడు ! భక్త వరద సీతా రామ లేరా !!
నరశింహదాసుని వెరుపకు మని వెంట ! దిరుగు వేళాయెను లేరా !!లే !!               

Thursday 3 April 2014

ఉల్లి మళ్ళ చీర యింద గొల్లభామా..........!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట, నాదనామక్రియ రాగం ఆదితాళం
శ్రీకృష్ణ గోపికా సంవాదము - కోలాటపు కీర్తన 
=================*===================
ఉల్లిమళ్ళ చీర యింద గొల్లభామా! కల్లగాదు నాదు కోర్కె దీర్చ పల్ల వాధరీ!!

ఉల్లి మళ్ళ చీర దెస్తె కృష్ణమూర్తీ ! భోగ మిళ్ళ వెంబడెళ్ళ వోయి చిన్ని మాధవా !!
భూమిలోన నిన్ను మించి గొల్లభామా! భోగ కాంత లెక్కడుందిలే పల్లవాధరీ!

వగలమాటలాడ బోకు కృష్ణమూర్తీ ! నీకు వరుసగాదు మళ్ళి పోర చిన్ని మాధవా !!

బిగువు చనుల జూడ నాదు గొల్లభామా! మనసు నిలువదాయె యేమి సేతు పల్లవాధరీ!

కాని మాటలాడ బోకు కృష్ణమూర్తీ ! వేశ్యకాంత నను కుంటి వోయి చిన్ని మాధవా !!

వేశ్యకాంత వంటి నంటె గొల్లభామా!  యింత జోస పంత మేల నీకు పల్లవాధరీ! 

అట్టె మాటలాడు చుండు కృష్ణమూర్తీ ! రోట గట్టి వేతు నింక జూడు చిన్ని మాధవా !!

రోట గట్టి పాటి యటవె గొల్లభామా! చిన్న నాటి స్నేహముంచగదవె పల్లవాధరీ! 

చిన్న నాటి స్నేహముంటె కృష్ణమూర్తీ! నీవు నన్ను గోర తగునటోయి చిన్ని మాధవా !!

అడ్దు జెప్ప బోకు సుమ్మి  గొల్లభామా! నీకు బిడ్డ నిచ్చెదను రావె పల్లవాధరీ!

దొడ్డ వాడ వోయి కృష్ణమూర్తీ !నా  గెడ్డ మట్టు కోక పోర చిన్ని మాధవా !!

కొట్ట వచ్చె దాన వేమొ గొల్లభామా! ముద్దు బెట్టితేను లోభమటవె పల్లవాధరీ!

ముట్టు కుంటె కొట్ట రాద కృష్ణమూర్తీ !వద్దు తిట్ట బడక మళ్ళి పోర చిన్ని మాధవా !!

రాయివంటి నీదు మనసు గొల్లభామా!! కరుగ దాయె నింక నేమి సేతు పల్లవాధరీ!!

రట్టు జేసెదవేర  కృష్ణమూర్తీ! యడ్ల రామ దాసు నేలు పోయి రుక్మణీ మనోహరా !!