Sunday 30 March 2014

యెన్ని మాయలు నేర్చినాడమ్మ.......!

బ్లాగు వీక్షకులకు జయనామ ఊగాది శుభాకాంక్షలతో 


శ్రీ రాగం= ఆటతాళం శ్రీ కృష్ణలీల
=================*=======================
యెన్ని మాయలు నేర్చినాడమ్మ! యశోద నీ కొడు కన్నిటికి నెరజాణు డోయమ్మ! 
యెన్ని మాయలు నేర్చినాడె! చిన్ని తనయుడు నిన్న రేయున! 
కన్నె పడుచును జూచి రమ్మని కన్ను సైగలు జేసి నాడట! యె!! 

వట్టి మాటలు కావు వినవమ్మ! యీ వాడలోపల ఇట్టి వానిని జూడ లేదమ్మ!
ఉట్టి మీదను చట్టి లోన పట్టి పాలిడి అట్టె బోవగ! 
చట్టి తూటడ గొట్టి కృష్ణుడు పొట్ట నిండా బట్టి నాడట !!యె!! 

బాలుడని ముద్దిడితి నోయమ్మ!! నీ సుతుడు ముద్దు బాలుడనుటకు వీలు లేదమ్మ!
ఆలి మొగడు పరుండి యుండగ యీల గొట్టియు లేపి దానిని! 
వేలివుంగరమిచ్చి కాము కేళికేమో బిలచి నాడట!!యె!! 

యేడ జూచిన నుండునోయమ్మ! నీ సుతుడు మా వాడ వాడల దిరుగు నోయమ్మ ! 
చెడిలందరు గూడి జలక్రీడలాడుచు నుండ వారల! 
జాడ గని తా తోడి బాలుర గూడి చీరెలు దొంగిలించెను !!యె!! 

వింతవింతలు సలుపు నోయమ్మ! నీ చిన్ని తనయుడు యెంత జెప్పిన వినడు గదమ్మ! 
యింతు లెల్లరు గూడి పూల బంతు లాడుచునుండగని! 
మీ బంతు విలువలు యెంతయని చన్బంతులను చేబట్టి నాడట!యె!!

చింత శాయగ రాదు వినవమ్మ! నీ చిన్ని కృష్ణుడు ఇంత వాడని చెప్పరాదమ్మ! 
మంతనంబున పెరటిలో నొక ఇంతి స్నానము లాడగని ! 
చన్బంతులను చేబట్టి దానిని కాంతు కేళిని బిలచినాడట!!యె!! 

చేడెనో యీవార్త వినవమ్మ! నీ సుతుడు జేసిన కోడె తనములు దెలుప రాదమ్మ!
నేడు మా వంటింటిలో మాతోటి కోడలు పెరుగు దరువగ! 
జాడ గని తా వెనుకబడి మొగ పొడుములు జరిగించి నాడట!!యె!! 

భాస మాన విలాసు డోయమ్మ! నీ సుతుడు శ్రీనివాసుడని మది దోచునోయమ్మ!
వాసిగా శ్రీ కాకినాడ నివాసుడైన మంతీన వేంకట! 
దాసుపాలిట జేరి సత్కృప జూచి కొర్కెలొసంగు చుండెను !!యె!! 

Friday 28 March 2014

ఈశ్వర జగధీశ్వరా....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================
నాద నామ రాగము = ఆటతాళం

ఈశ్వర జగధీశ్వరా పరమేశ్వరా కరుణించరా ! 
శాశ్వతంబుగ వేడితిని విశ్వాస ముంచర  ఈశ్వర!!
ముందు జేసిన పూర్వ  కృతములు యిందు లవుము ఈశ్వరా !
 పొందు గా మీ పాద పద్మము జెంది యుంటిని ఈశ్వర! 
కపట విద్యలు నేర్చి పొట్టా గడుపు చుంటిని ఈశ్వర! 
నేరము లెన్నక నన్ను నీ కృప నేలు మీ పరమేశ్వరా !ఈశ్వర! 
ఆరుగురు శత్రువులు నాపై క్రూర మెంచిరి ఈశ్వర! 
పరమ మంత్రము చేత శత్రువుల నురమ వలె   పరమేశ్వరా !ఈశ్వర! తొమ్మిది ద్వారముల కొంపిది నమ్ము నేటికి  !ఈశ్వర! 
బొమ్మ లాటల పాలు జేసి బ్రోవ కుంటివి  !ఈశ్వర! 
మూడు గుణములు విడువ జాలక మోస పోతిని  !ఈశ్వర! 
వేడ్క తోడ నీ మాయ దాట నుపాయ మేదో  !ఈశ్వర!
చంక దుడ్లె మరి కింకరులకు జంక నేలను  !ఈశ్వర! 
అంక మందున జేర్చి సద్గురు శంక దీర్చిరి  !ఈశ్వర! 
ధరణిలో శ్రీ కాకినాడ పురము నిల్కడ  !ఈశ్వర! 
వరము లిచ్చి యడ్ల రామదాసు నేలర  !ఈశ్వర!

Saturday 22 March 2014

నారాయణ మంత్రము...!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

నాదనామక్రియ రాగం- ఆదితాళం
===============*===============
నారాయణ మంత్రము నా జిహ్వకు ! నాణెమైన రుచి దొరికె గదా! 
కూరిమితో శ్రీ రామ తారకము! కోరికలర ప్రాప్తమాయెగదా!!నారా!! 

మంచి మంచి మామిడి ఫలచీ నా! పంచదారలకు మించెగదా! 
యెంచి జూడ శ్రీ రామామృత మిది! మంచి రుచియు ప్రాప్తించెగదా!!నారా!! 

అండ పిండబ్రహ్మాండ మంతయును! నిండిన మధురం బిదియు గదా! దండిగ రాముని దలచెడి వారిలో! తాండవ మాడు చునుండెగదా!!నారా!!

కొండ పొడుగు జేసిన పాపము ! నిండి చెలాయించుచుండెగదా!
 దండి ప్రభువు దరిజేరి నందువల ! నిండిన పాపము చెండె గదా!!నారా!!

దేవరహస్యములు దొరికెగదా! యీ జీవము దేవుని చేరుగదా!
 భువిలో మంతిన వేంకటార్య గురు! వర్యుల మదిలో మరువ గదా!!నారా!!

కోరి భజించేవారిని బ్రోచే గదా! తారకాతీతం బిదియు గదా! 
ధారుని యడ్లరామా దాసుడు దెల్పెను! దశరధాత్మజుని రసము గదా!! నారా!! 

జన్మమేలనే...!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట 

భూపాల రాగము = రూపక తాళం
=================*=====================
ప: జన్మమేలనే- వృధా- జన్మమేలనే!
చిన్మయుని పదాంబుజములు చింతన శాయక బ్రతుకు వారి!!జ!!

యెన్నరాని జన్మములలో యెన్నికైన జన్మమెత్తి! 
పన్నుగ మన కోదండ రాముని సన్నుతి సేయక బ్రతుకు వారి!!జ!!

విష్ణు దినములందు భోగ తృష్ణలుడిగి నిదుర మాని!
 కృష్ణరామా యనుచు పరమ నిష్టను సేవింపని వారి !!జ!!

మొలక వెన్నులున్న తులసి దళములా వరించి దెచ్చి ! 
చెలగి పూజలు జేసి హరిని దలచి ధన్యులు గాని వారి !!జ!!

ఆశతోడ నారశింహ దాసుడెపుడు గొలుచు చుండ ! 
దాస పోషకుడైన శ్రీని వాసుని సేవింపని వారి !!జ!!  

మేలుకో సుగుణాల వాల జానకీ లోల !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !


శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన .  

==============*================
భూపాల రాగము = ఆటతాళం

మేలుకో సుగుణాల వాల జానకీ లోల ! భక్త పాలనా నిద్ర మేలుకో
వాలాయముగ మమ్ము పాలించు వేళాయె ! వైకుంఠ వాసూడా మేలుకో!!మే!!

భేరీ మృదంగాది భీషణరవమూలు !  బోరు గొలుపసాగె మేలుకో
తీరైన కస్తూరి తిలకాము జారెను! తీర్చి దిద్దావలె మేలుకో!! మే!!

తారాలు తెల్లానై తెల్లవారెనదె ! వారిజాక్ష నిద్ర మేలుకో
తీరైన ముత్యాలు హారము వలె దీప ! తేజాము గన్పట్టె మేలుకో!!మే!!

తూరుపునకు మంచితీరైన రవి కాంతి ! జేరి మించ సాగె మేలుకో
కారుణ్య సాగరా కమనీయ కటి సూత్ర ! హార మకుట ధార మేలుకో!!మే!!

పారిజాత కుసుమ మాలీక చేబట్టి !నారాదాముని వచ్చె మేలుకో
పాలవారధి యందు పవ్వళించిన యోగ !పరమేశ యిక నిద్ర మేలుకో!!మే!!

భరతూడు మీపాద భక్తుడు శ్రీమించు! పాదూకలను దెచ్చె మేలుకో
వరదూడావై నీవు ధరణిజా గూడి !యీధర యేలుదువు గాని మేలుకో!!మే!!

స్థిరమూగ భద్రాద్రి పుర మూన వెలసీన !శ్రీరఘునాయకా మేలుకో
నరశింహదాసూని అరలేక రక్షించు !పరమ పావన నిద్రమేలుకో!!మే!!

సీ :నీవు కన్మూసిన నిఖిల ప్రపంచంబు! జాలి జెందినదిక మేలుకొనవె!
నీదు పాదయుగంబు నెమ్మి సోకక యున్న! మేధిని వ్యధజెందు మేలుకొనవె !
నీ వీక్షణము లేక నెరదిశలెల్లను !చాల చీకటి గ్రమ్మె మేలుకొనవె  !
నీప్రసన్నత లేక నిగమముల్ విముఖమై !యోలిమూలల జొచ్చె మేలుకొనవె !

గీ :ఫాలలోచన సతిహిత మేలుకొనవె !
గాలి కూరిమి తన యాఢ్య మేలుకొనవె !
మేలు రవివంశ తిలక మమ్మేలు కొనవె!
మేలుకో భద్ర గిరిధామ మేలుకొనవె !

సీ : జారచోరకుల సంచారకబులడగెను !వాలాయముగ నిద్ర మేలుకొనవె !
ఖలిలిల సాధులంబాధింపు చున్నారు !జాలి దీర్చుటకునై మేలుకొనవె! 
దరిచేరు లేక నీదరి జేరి కుయ్యిడు! మేలు భక్తులబ్రోవ మేలుకొనవె !
నరశింహదాసుని అరసిబ్రోచుట నీదు! పాలు గావున నిద్ర మేలుకొనవె !

గీ : కేలనగ మెత్తు నాస్వామి మేలుకొనవె !
లీల పదిరూపములు దాల్చమేలుకొనవె !
మేలు రవి వంశ తిలక మమ్మేలుకొనవె !
మేలుకో భద్రగిరి ధామ మేలుకొనవె  !

Wednesday 19 March 2014

కాల హరణమేలరా...

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన .  

==============*================
అఠాణ రాగము = రూపకతాళం

ప: కాల హరణమేలరా హరే సీతారామ !!కా!!
కాల హరణమేల సుగుణ జాల కరుణాల వాల !!కా!!

చుట్టు తిరిగి పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి భువిని
పుట్ట గానె నీ పదములు బట్టి వేడుకున్న రామ !!కా!!

పుడమి యెంతాడు కొన్న భూమిని త్యాగంబు రీతి
కడు బడలి యున్న నీవు గాక యెవరు నన్ను బ్రోవ !!కా!!

దినదినమును తిరిగి తిరిగి దిక్కు లేక శరణు జొచ్చి
తనువు ధనము నీవే యంటి త్యాగరాజ వినుత రామ !!కా!!

Tuesday 18 March 2014

తపమేమి జేసెనో తెలియా !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన .  

==============*================

ప : శ్రీ రామ జయరామ శృంగార రామ యని ! చింతించరాదె ఓ మనసా!! శ్రీ!!

తళుకు చెక్కుల ముద్దు బెట్టు కౌసల్య మును ! తపమేమి జేసెనో తెలియా ! కౌసల్య తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

దశరధుడు శ్రీ రామ రారయని బిల్వ మును ! తపమేమి జేసెనో తెలియా ! దశరధుడు తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

తనవారి పరిచర్య సేయ సౌమిత్రీ మును !తపమేమి జేసెనో తెలియా ! సౌమిత్రీ తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు మును!తపమేమి జేసెనో తెలియా ! కౌశికుడు తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

శాపంబడగ రూపవతి యౌట కాహల్య మును!తపమేమి జేసెనో తెలియా ! అహల్య తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

ధర్మాత్ము చరణంబు సోక శివుచాపంబు మును !తపమేమి జేసెనో తెలియా ! శివ చాపంబు తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

తన తనయ నొసగ కనులార గన జనకుండు మును !తపమేమి జేసెనో తెలియా ! ఆ జనకుండు  తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

దహనంబు కరగ కరమును బట్టి జానకి మును !తపమేమి జేసెనో తెలియా ! ఆ జానకి తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

త్యాగ రాజాప్తయని పొగడ నారదమౌని మును! తపమేమి జేసెనో తెలియా ! ఆ మౌని తపమేమి జేసెనో తెలియ  !! శ్రీ!!

Monday 17 March 2014

దొరకెనమ్మా వెన్న దొంగ....

గురుదేవులకు కృజ్ఞతాభివందనములతో....   
                                                                                                                                                                                                                                                                                                                                          


బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

 
సావేరి  రాగము = చాపు తాళము 

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన .  

==============*================

ప : దొరకెనమ్మా వెన్న దొంగ మనకు దొరకెనమ్మా చిన్ని దొంగా !

చ : దొరకెను మనకిపుడు చిరకాలమున కితడు! దొరల కైనను గాని దొరక బడని వాడు !! దొ !! 

గోపాల కృష్ణుడు వీడు చిన్న పాపాడై తిరుగు చున్నాడు ! 
పాపా సంహారుడు తాపాస శరణుడు యే  పాటి వాడో యితడెరుగ బడని వాడు !! దొ !!  

లజ్జీ విడచిన  వాడు వీడు యీ ముజ్జగంబులు నేలు వాడు!
బుజ్జగించిన గాని బువ్వైన తిన రాడు బొజ్జలో పదునాల్గు భువనములు గల వాడు !! దొ !! 

బాలూడు గాడమ్మ వీడు నలువను బాలునిగ గన్నట్టి వాడు !
బాలూరితో నాట పాట లాడెడు వాడు ! ఫాల లోచనునైన బేల చేసెడి వాడు !! దొ !! 

లచ్చికి సరియైన వరుడు నీల పచ్చాని దేహము వాడు !
అచ్చాపు ప్రేమ చే మచ్చిక య్యెడు వాడు ! విచ్చల విడిగ యెచ్చట నైన దిరుగాడు వాడు !! దొ !! 

అండాండములు  నిండి నాడు బ్రహ్మాండ నాయకుండు  వీడు ! 
కుండాల శయనూ డు  పుండా రీ కాక్షుడు ! అంజాసనుడు మార్తాండ వంశోద్భవుడు వాడు !! దొ !! 

కామజనకు డాటే వీడు  కామ దహనూడు గొలి చేటి వాడు !
మామా సంహారుడు ప్రేమ మయుండి తడు ! రామ దాసుల నేలు రాజ గోపాలుడు వాడు !! దొ !!  


మేలుకో కైలాస వాస... మేలుకో!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన . 


భూపాల రాగము - మిశ్ర గతి 
===================*=====================

మేలుకో కైలాస వాస దయానిధే ! కాలకంఠి నిద్ర మేలుకో! 
పలు విధముల మిమ్ము ప్రార్థించు భక్తుల! పావనుల జేయ మేలుకో!

పంచ భూత ములకు పరుడవై విలసిల్లు ! ఫాలలోచన నిద్ర మేలుకో! 
అంచితముగ శివ కంచిని నివసించు ! ఆది ప్రుద్విలింగ మేలుకో! 

జల రూపమున నుండు జంబుకేశ్వర! భక్త జనుల రక్షింపను మేలుకో! 
కలి బాధ లెల్లను ఖండించి మము బ్రోవ ! కారుణ్య సాగర మేలుకో!

అఖిల భూతము లందు నంతర్యామివైన ! అరుణాచలేశ్వర  మేలుకో !
నిఖిల చరా చర నిర్మాణ ధౌరేయ ! నీల కంఠ నిద్ర  మేలుకో !     

వాయు రూపుడవగుచు వసుధలో భక్తుల ! వాత్యల్యమున బ్రోవ మేలుకో ! 
కాయ జాంతక మమ్ము కరుణతో రక్షింప కాళహస్తీశ్వర మేలుకో!

దహరా కాశమునందు దండిగ వెలుగు! చిదంబరేశ్వర లింగ మేలుకో! 
యిహపరంబుల నెల్ల నిచ్చెద పాద! మెత్తిన నటరాజ మేలుకో!

గంగా తీరముననుప్పొంగుచు వశియించు! కాశీ విశ్వనాధ మేలుకో! 
సంగ వర్జితులగుచు సన్నిధిని  వశియించు ! సాధుజనుల బ్రోవ మేలుకో!

అన్నిటి కంటెనే నధికుండవని దెల్పు! అమరేశ్వర లింగ మేలుకో! 
చిన్ని రేజ మధుపా! శ్రీ సంగమేశ్వర ! శిష్టజనుల బ్రోవ మేలుకో!

యింద్ర నీల పర్వతంబున నెలకొన్న! యిభ చర్మాంబర ధర మేలుకో! 
సాంద్ర కరుణా దుర్గ మల్లేశ్వర లింగ !సాధు జనుల బ్రోవ మేలుకో!

కోరిన భక్తులకు కోటి వరముల నిచ్చు కోటీశ్వర లింగ మేలుకో! 
ఘోర పాప హరణా! గోకుల వర్ధన ! గోకర్ణేశ్వరలింగ మేలుకో!

గొప్పాగ శ్రీశైల గోపుర మందూన! మెప్పుగ వశియించు వాడ మేలుకో!
 నొప్పుల కుప్పా మల్లెశా నా తప్పులు ! తప్పక మన్నింప మేలుకో!

శ్రీ పీతా నాధుని చేత పూజలు గొన్న ! సేతు రామలింగ మేలుకో! 
కాశీనుండి వచ్చి గంగ నభిషేకింప ! గాచి యున్నారయ్య మేలుకో !

చిలు మూరు పురవాస ములుకుల్లు సద్వంశ!జలధి నుద్దా రింప  మేలుకో !
కలుష హరణ రామ లింగేశ్వర మము బ్రోవ!కాంక్షించుచున్నాము మేలుకో !   

Friday 14 March 2014

లాలి పాట!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండురంగ భక్తి కీర్తనలు పుస్తకము లోని లాలి పాట. నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను తెలుపమని ప్రార్థిస్తూ.

==============*================

ప:లాలి శ్రీజన లోల లీలా వినోదా!లాలి శ్రీద్వారకా బాల గోపాలా!!లా!1
మిశిమి మించిన మంచి పసిడి గొలుసులును! పొసగ వజ్రాలతో పొందు పరచగను!
అసమాన తొట్టిలో కుసురు పాన్పునను!భస్మాపు టేదరు బాలీశు లోను!!లా!!
అందముగ జాంబవతి చందనము పూయ!పొందుగా కాళింది పూవు లందీయ!యిందు ముఖి లక్షణా వింజామ రేయ!!లా!!
మిత్ర విందయు చాల అత్తరవు పూయ!సత్య భామయు మంచి జవ్వాది పూయ!భద్ర నీ టుగ నిలువు టద్ద మందీయ!సుగంధి సొగసుగా సుర టీలు వేయ!!లా!!
పద హారు వేల గోప స్త్రీల చాలా!మోదమున నేలితివి మదన గోపాలా!కందర్ప సుందరా కవిజనా పాలా!నంద నందన స్వామి నన్నేల వేలా!!లా!!
కోటి సూర్యుల కాంతి కొమ రొప్ప గాను!పట్టింపు దేవితో పవళించ గాను!చుట్టు గోప స్త్రీలు తొట్టె నూచగను!కోరి రామ దాసు కోర్కె లొసగ గను!!లా!!

మత్త కోకిల చరణములు!


శ్రీ నేమాని గురువుగారికి కృజ్ఞతాభివందనములతో....
============*===========
రామ నామము రామ నామము రక్ష యన్నది నేర్వ రా !
ప్రేమ తోడను బిల్చి నంతనె పెక్కు లాభము లుండు రా !
కామి తమ్ముల నిచ్చి యుండిన క్ష్మావరేశుడు  శిష్యుడా !
రామ నామము రామ నామము రమ్య మైనది శిష్యుడా !1!

గాధ లందున జెప్పి యుండిన ఖ్యాతి గల్గిన వాడురా !
మోధ మందున బాధ లందున ముక్తి నిచ్చెడి  వాడురా !
వేద వేద్యుడు దేవ దేవుడు వెంట వచ్చెడి  వాడురా !
రాధికేశుడు పద్మ నాభుడు రత్న గర్భుడు  వాడురా !2!

ఖ్యాతి గల్గిన వారి కెల్లను గాత్ర మిచ్చెను జూడరా !
నీతి యన్నది నిండు కుండిన  నేనె వత్తుననెన్ వెసన్!
త్రాత యైనను  దూతయేనట దాట కుండగ జూడరా !
రాతి బండకు మోక్ష మిచ్చిన రామ పాదము బట్టరా !3!

కావ రమ్మని భక్త దంతియె గావు బెట్టన నాడు రా !
దేవ దేవుడు పద్మ నాభుడు దేవ లోకము వీడె రా !
దేవ దానవ సంగరంబున
తీర్పు జెప్పెన వాడురా !
సేవ జేయగ వైరి వర్గము సీమ నిచ్చెను జూడరా !4!

కోరి వచ్చిన గొల్ల భామల కోర్కె లెల్లను దీర్చెరా !
భార మంతయు తాను మోసిన భాను మంతుడు వాడురా !
గోరు పైనను కొండ నంతను గూర్మి తోడను నెత్తెరా !
నోరు జచ్చిన వారికెల్లను నూరు మారులు జెప్పరా !5!

కన్న వారల కూర్మి నొందగ కంస మామను జంపెరా !
కన్నె భామల చీర లెల్లను గట్ట గట్టెను జూడరా !
వెన్న దొంగగ మన్ను మెక్కుచు వీధు లందున నిల్చెరా !
మన్ను తోడను మిన్ను జూపెను మాత కప్పుడు శిష్యుడా !6!

దంతి రక్షక  భక్తవత్సలు దాపు జేరగ నేర్వరా !
చింత లందున పెద్ద దిక్కని శేష శాయిని బిల్వరా !
కాంతి మంతుడు కీర్తి మంతుడు గట్టి వేయగ నుండె రా !
పంత మేలను? నారసింహుడు ప్రక్క నుండెను జూడరా !7!

ఘోర రాక్షసి దాడి జేయగ గూల్చి వేసెను జూడరా !
దార కోరిన జింక వెంబడి తాను వెళ్ళెను జూడరా!
వైరి వర్గము గూర్మి నొందగ వంత బాడెను జూడరా !
వీర వానర సైన్య మెల్లను వెంట వచ్చిరి జూడరా !8!

నీటి యందున సర్ప రాజును నేల గూల్చిన వాడురా !
కాటి రేడును కష్ట మందున గాచి యుండిన వాడురా !
ఝూట మాటలు కట్టబెట్టిక శుద్ధసత్త్వుని జూడరా!
నోటి యందున విశ్వ మంతయు నోము జేయగ జూపురా! 9!



సోమ యాజులు సొక్కి యుండిన సోమ బంధువు వాడురా !
తామ సమ్మును ద్రుంచు వేసెడి ద్వాద శాత్ముడు వాడురా !
కామ పాలుడు భక్త వర్యుల కష్ట మెల్లను దీర్చు రా !
వామ లోచన రూప మందున పంచబాణుని మించెరా !10!

ఆను పానులు దెల్పు చుండెడి అంబుజాక్షుని వేడరా !
కాన లందున మౌని వర్యుల గాచి యుండిన వాడురా !
వానరమ్ములు సేవ జేసిన వాని దాపున జేర రా !
భాను వంశము నందు బుట్టిన వాని నెయ్యము పొంద రా !11!

విష్ణు చిత్తుని యల్లు డయ్యెను వేడి నంతనె జూడరా !
విష్ణు భక్తుల మార్గ మందున వీత రాగము లేదు రా !
విష్ణు పాదము బట్టి యుండిన పేర్మి గల్గును నిండుగా  !
విష్ణు మాయకు భస్మమైరి విర్రవీగిన వారురా !12!

కోటి కొక్కడు జూడ గల్గిన కోసలేశుడు  వాడురా !
ఆట పాటలు నేర్చి లోకము నాడు చుండెను జూడరా !
కోటి విధ్యలు నేర్చి యుండిన గొల్ల బాలుడు వాడురా !
మేటి రాక్షస గర్వ మంతయు మెట్టు తోడను గూల్చె రా !13!

భక్తపాలకుడుండె రాముడు భద్రశైలము పైనరా! 
ముక్తి కోరిన దాస దాసులు పొందు గోరుచు నుండ గా !
భక్తి తోడను సొక్కు చుండగ భద్ర శైలము జెర్చె రా !
ముక్తి నొందిన వారు దెల్పిరి మూలమెల్లను లెస్సగా !14!


ఆదుకొమ్మని యొక్క యాడుది ప్రార్థనమ్మొనరింపగా !
ఆదరమ్మున గోపబాలకు డార్తినంతయు దీర్చె రా !
బాధ నొందుచు యుద్ధ మందున పాండుసూనుడు పార గా !
వేదవేద్యుడు కూర్చి ధైర్యము వేదసారము చెప్పెరా !15!

గొల్ల భామలు చల్ల జేయుచు గోపబాలుని  గొల్వగా  !
చల్ల మెక్కుచు గొల్ల భామల శంక లెల్లను  దీర్చె రా !
నల్ల నయ్యను గొల్ల బాలలు నమ్మి జెంతకు చేరగా  !
కల్ల లాడక గోకులమ్మున కాతరిల్లుచు నుండెరా !16!
  
వేంకటాద్రికి జేరి యుండిన వేంక టేశుని జూడరా !
పంక జాక్షుడు పద్మ నాభుడు పట్టు వీడక నుండెరా !
శంక లెల్లను పాతి బెట్టుచు శక్తి మీరగ గొల్వరా !
వంక లెల్లను కట్టి బెట్టిన భక్త పాలుడు గాంచు రా !17!
అంజనాద్రికి జేరి యుండిన అబ్జనాభుని జూడరా !
కంజ నేత్రుడు దారి వెంబడి గాచ నిల్చిన శిష్యుడా !
పంజ రమ్మున చేరియుండిన పాచి నంతయు నుడ్చినా !
ముంజ కేశుడు వచ్చి యుండును, పొందు ముక్తిని  శిష్యుడా !18!

రక్ష రక్షని రెండు మారులు రంగ నాధుని బిల్వగా !
పక్షి వాహను డెగుదెంచెను పాలు దేనెలు బెట్టరా !
పక్ష పాతము జూప కుండెడు పార్థసారధి వాడురా !
మోక్ష మిచ్చెడి భక్త పాలుడు ముందు కాళ్ళను బట్టరా !19!

దృష్టినంతయు నిల్పి యుంచిన దేవ దేవుడు గాంచు రా!
నిష్ఠ తోడను పూజ సేయగ నీత మిచ్చును జూడరా !
దుష్టు లెల్లరు గాసి బెట్టగ ద్రుంచి వేసెను  శిష్యుడా !
కష్ట మందున కావు రమ్మని కంజ నేత్రుని బిల్వరా !20!

Thursday 13 March 2014

తారక మంత్రము కోరిన దొరకెను...

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట   
  ధన్యాసి రాగము = ఆది తాళము 
==============*================
తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓ రన్నా! 
మీరిన కాలుని దూతల పాలిటి  మృత్యువు యని నమ్మక యున్నా!! తా !!

మచ్చిక తో ని క బాత కంబుల మాయలలో బడ బో కన్నా! 
హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు లెలమి  దిరుగ బని లేదన్నా!!తా !!

ముచ్చటగా నా పుణ్య నదులలో ముని గెడి పని యేమిటి కన్నా!
వచ్చెడి పర్వపు దినములలో సుడి వడి పడుటలు మాను మికన్నా!!తా !!

ఎన్ని జన్మముల నెంచి చూచినను ఏకో నారాయణు డన్నా!
అన్ని రూపులై యున్న పరమాత్ముని నా మహాత్ము కధలను విన్నా!!తా !!

ఎన్ని జన్మముల జేసిన పాపము లీ జన్మము తో విడు నన్నా!
అన్నిటి కిది కడ సారి జన్మ మిది సత్యం బిక బుట్టుట సున్నా !!తా !!

నిర్మల మంతర్లక్ష్య భావమున నిత్యానందము తో నున్న!
కర్మంబులు విడి మోక్ష సద్గతిని గన్నుల నే చూచు చును న్నా!!తా !!

ధర్మము తప్పక భద్రా ద్రీశుని దన మదిలో నమ్ముచు నున్న!
మర్మము దెలిసిన రామదాసుని మందిర మున కేగుచునున్న  !!తా !!     

Tuesday 11 March 2014

రామా యను కొండి !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

మా అమ్మ గారి చిన్నతనములో ఒక భక్తురాలు పాడిన  పాట, కానీ ఇప్పుడు మా అమ్మ గారికి కూడా గుర్తు లేదు. కొన్ని చరణములు గుర్తు వచ్చినవి, కొన్ని పదములు మారి యుండ వచ్చు మీకు తెలిసిన తెలుప ప్రార్థన !

==============*================

ప : రామా.. యను కొండి ! శ్రీ  రామా.. యను కొండి ! అపుడెపుడో... మీరన లేరు ! ఇపుడే శ్రీ రామా... యను కొండి ! 

1.కాకులు గూటికి జేరక ముందే ! కన్న కొడుకు దండించక ముందే !! రామా!!

2.కంటి జూపు తగ్గక ముందే ! కాళ్ళూ జేతులు వణకక ముందే !! రామా!! 

3.పంచ భూతములు పగ బట్టక ముందే ! దుర్వార్తలు దరి జేరక ముందే !! రామా!!

4.పండ్ల పటుత్వము తగ్గక ముందే ! కాటికి కాళ్ళను జాపక ముందే !! రామా!!

5.యమ పాశము దరి జేరక ముందే ! కాలుని రాకను గాంచక ముందే !! రామా!!   

Monday 10 March 2014

బ్రహ్మ పట్నము పోద మంటే......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

మా అమ్మ గారి చిన్నతనములో ఒక భక్తురాలు పాడిన  పాట

==============*================

చ : బ్రహ్మ పట్నము పోద మంటే పిరికి పుడుతుం దన్నయా ! 
పిరికి దీసి వెరుక బరచి.. పరమనొందవె చెల్లులా !   

బ్రహ్మ పట్నము పోద మంటే నదీ యడ్డము రన్నయా !
"ఓంకార" మనెడి తెడ్డి దీసి పడవ నడపి.. పరమనొందవె చెల్లులా ! 
   
బ్రహ్మ పట్నము పోద మంటే నడవి యడ్డము రన్నయా !
"ఓంకార" మనెడి కత్తి  దీసి అడవి నరకి.. పరమనొందవె చెల్లులా !

అన్న నిన్ను జూద్ద మంటే చీకటొస్తుం దన్నయా !  
"ఓంకార" మనెడి జ్యోతి వెలిగించి.. నన్ను జూడవె చెల్లులా !

Saturday 8 March 2014

భజన జేసే విధము దెలియండీ!

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట   

సౌరాష్ట్ర   రాగము 
==============*================
భజన జేసే విధము దెలియండీ! జనులార మీరు నిజము గనుగొని మోదమందండి !! భ !!    
             
భజన జేసే విధము తెలియక నిజముగా హరి భక్తు లనుకొని మద గజము తెగ వ్రేయ లేకను !సుజనులని తిరుగంగ నేలను !! భ !!  

వారు వీరని యెంచ బోకండీ! జనులార మీరు! నోరు జచ్చిన వారు గాకండీ ! 
వారు వీరని యెంచు టెల్లను సారము లేనట్టి హీనత ! పౌరుల కే గాక పుణ్యము యూరి కదలం దేమి  యున్నది !! భ !! 

జ్ఞానులను కొని యెగసి పడి యజ్ఞా నములు పై బెట్టు కొనినను ! మానసంబున బుట్టి వచ్చియు పూని మరి జన్మింప వలయు !! భ !! 

ఝాట మాట లాడ బోకండీ!నరులార కలియుగ నాటకములో జిక్క బోకండీ!ఝాట మాట లాడి పొట్ట కూటికి వేషములు దాల్చక ! యాటికి యమ బాధలచే కాటికి పోవంగ నేటికి  !! భ !!

మూల స్థానము తెలిసి బ్రతకండి !  జనులార మీరు! మేలిమిగ శ్రీ హరిని వెదకండి !  మూల స్థానము తెలిసి మీలో చాలగా వెలిగేటి జ్యోతిలో ! లీలమై వెలుగొందు బాలుని నీల మధ్యము నందు దలచుచు  !! భ !!

ధరణి శ్రీ నరహరిని గొలువండి ! జనులార మీరు!  పరమ పదవిని పొంద గోరండి ! ధరను  శ్రీ ఘటికాద్రి వర హరి పరమ భక్త వరుల మనుకొని ! విరివిగా నరసింహ దాసుని వర కవిత్వము సారమను కొని  !! భ !!  

Friday 7 March 2014

వెఱ్ఱి మనసా !

బ్లాగు వీక్షకులేల్లరికి శుభోదయం !

శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట   

జంఝాటి రాగము 
==========*==================

నర హరిని నమ్మక నరులను నమ్మిన నర జన్మ మీడేరున ! చెరకుండగ వెఱ్ఱి చెరకును నమ్మిన జిహ్వాకు రుచి పుట్టున మనసా !! నర !!

కాళ్లుండగ మోకాళ్ళతో నడిచిన కాశికి పోవచ్చున ! నీళ్లుండగ ఉమ్మి నీటిని మ్రింగిన నిండు దాహము తీరున   మనసా !! నర !!

కొమ్మ యుండగ కొయ్య బొమ్మను కలసిన గోరిక గొన సాగున మనసా !! నర !!

అమ్మా యుండగ పెద్దమ్మా ను గోరిన యర్థము చేకూడున  మనసా !! నర !!

అన్నముండగ సన్న బియ్యము తిని నంత యాకలి వెత తీరున మనసా !! నర !!

వెలదు లుండగా చిత్ర కన్నెల గలసిన కామ వ్యధ  తీరున మనసా !! నర !!

క్షుద్ర బాధచే నుపద్రవమును బడు వేళ నిద్ర కంటికి వచ్చునా ! భద్ర గిరీశు పై భక్తి లేని నరుడు పరమును గన నేర్చునా మనసా !! నర !!                 

Thursday 6 March 2014

రాతి రోలన వలెను!

హాయిరి రాగము- చాపు తాళము

రామాయని మిమ్ము దలుచని నోరు! రాతి రోలన వలెను! 


ముమ్మాటికి రాతి రోలన వలెను! 

బ్రతికినన్నాళ్ళు నీ భజన జేయుట! రామా! 

భవ బంధ మోచనము! అతి దయా పరుడని యార్త రక్షకుడని యానంద 

పడవలెను  వో!రామా! 

రామా యని కన్నులున్నందుకు ఘనమై మి మూర్తిను గొంటి 

భాగ్యమున! పన్నగ భయము లేకున్న రక్షకుడని యున్నదే సార్ధకము శ్రీ 

రామా! రామా! 

వాసిగ భద్రాచలేశుడవని నిన్ను వాసనెరింగితిని న్నాసించిన 

నరసింహ దాసుడనని దోసిలొగ్గి వేడితి శ్రీరామా! రామా!

జోల పాట

"శ్రీ పాండు రంగ భక్త మాలకీర్తనలు " పుస్తకము నందు గల జోల పాట మీ కొరకు 

పల్లవి : జో అచ్యుతా నంద జోజో ముకుందా! 
           రార పరమానంద రామ గోవిందా !! జోజో!!

తొలుత బ్రహ్మాండంబు తొట్టె గావించి! నాలుగు వేదములు గొలుసుల మరించి !
బలువైన ఫణిరాజు పాన్పునమరించి! చెలియ డోలికపైని చేరిలాలించి !! జోజో!!

తొమ్మిది వాకిళ్ళ తొట్టిలోపలను ! క్రూరులు ఆరుగురు సాధులైదుగురు!
అందులో ముగ్గురు మూర్తులున్నారు! తెలిసి తెలిపే వాడు దేవుడున్నాడు !! జోజో!!

పట్టువలె నలుగురిని పదిలంబుగాను! కట్టవలె ముగ్గురిని కదలకుండగను 
వుంచవలె ఒక్కరిని హృత్కమల మందు! వుండవలె పండువెన్నెల బయలలోను !! జోజో!!

యీడు గలవానిని కూడుండ వలెను! జోడుగల వానిచే జాడ గనవలెను
మేడ మీదను వుండె మహిమ గనవలెను! కోరి యా గోవిందు గురుని గనవలెను !! జోజో!!

వీధి నొక బాటలో గీతంబు శాయ ! కోటలోభేరి మృదంగంబులు మ్రోయు
కోట కావలి వాండ్రు కోలాట మేయు! ధీటు లేని ప్రభువు దొరతనము శాయ !! జోజో!!

ఓంకార మని యేటి ఒక తొట్టిలోను ! తత్వమని యేటి చలువలంబరచి
వేడ్క తో పావనీ యేర్పాటు జేసి! యేడు భువనముల వారేక మై పాడే !! జోజో!!