Sunday 30 March 2014

యెన్ని మాయలు నేర్చినాడమ్మ.......!

బ్లాగు వీక్షకులకు జయనామ ఊగాది శుభాకాంక్షలతో 


శ్రీ రాగం= ఆటతాళం శ్రీ కృష్ణలీల
=================*=======================
యెన్ని మాయలు నేర్చినాడమ్మ! యశోద నీ కొడు కన్నిటికి నెరజాణు డోయమ్మ! 
యెన్ని మాయలు నేర్చినాడె! చిన్ని తనయుడు నిన్న రేయున! 
కన్నె పడుచును జూచి రమ్మని కన్ను సైగలు జేసి నాడట! యె!! 

వట్టి మాటలు కావు వినవమ్మ! యీ వాడలోపల ఇట్టి వానిని జూడ లేదమ్మ!
ఉట్టి మీదను చట్టి లోన పట్టి పాలిడి అట్టె బోవగ! 
చట్టి తూటడ గొట్టి కృష్ణుడు పొట్ట నిండా బట్టి నాడట !!యె!! 

బాలుడని ముద్దిడితి నోయమ్మ!! నీ సుతుడు ముద్దు బాలుడనుటకు వీలు లేదమ్మ!
ఆలి మొగడు పరుండి యుండగ యీల గొట్టియు లేపి దానిని! 
వేలివుంగరమిచ్చి కాము కేళికేమో బిలచి నాడట!!యె!! 

యేడ జూచిన నుండునోయమ్మ! నీ సుతుడు మా వాడ వాడల దిరుగు నోయమ్మ ! 
చెడిలందరు గూడి జలక్రీడలాడుచు నుండ వారల! 
జాడ గని తా తోడి బాలుర గూడి చీరెలు దొంగిలించెను !!యె!! 

వింతవింతలు సలుపు నోయమ్మ! నీ చిన్ని తనయుడు యెంత జెప్పిన వినడు గదమ్మ! 
యింతు లెల్లరు గూడి పూల బంతు లాడుచునుండగని! 
మీ బంతు విలువలు యెంతయని చన్బంతులను చేబట్టి నాడట!యె!!

చింత శాయగ రాదు వినవమ్మ! నీ చిన్ని కృష్ణుడు ఇంత వాడని చెప్పరాదమ్మ! 
మంతనంబున పెరటిలో నొక ఇంతి స్నానము లాడగని ! 
చన్బంతులను చేబట్టి దానిని కాంతు కేళిని బిలచినాడట!!యె!! 

చేడెనో యీవార్త వినవమ్మ! నీ సుతుడు జేసిన కోడె తనములు దెలుప రాదమ్మ!
నేడు మా వంటింటిలో మాతోటి కోడలు పెరుగు దరువగ! 
జాడ గని తా వెనుకబడి మొగ పొడుములు జరిగించి నాడట!!యె!! 

భాస మాన విలాసు డోయమ్మ! నీ సుతుడు శ్రీనివాసుడని మది దోచునోయమ్మ!
వాసిగా శ్రీ కాకినాడ నివాసుడైన మంతీన వేంకట! 
దాసుపాలిట జేరి సత్కృప జూచి కొర్కెలొసంగు చుండెను !!యె!! 

No comments:

Post a Comment