బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ రామదాసు చరిత్రము లోని భక్తిపాట
సౌరాష్ట్ర రాగము
==============*================
భజన జేసే విధము దెలియండీ! జనులార మీరు నిజము గనుగొని మోదమందండి !! భ !!
భజన జేసే విధము తెలియక నిజముగా హరి భక్తు లనుకొని మద గజము తెగ వ్రేయ లేకను !సుజనులని తిరుగంగ నేలను !! భ !!
వారు వీరని యెంచ బోకండీ! జనులార మీరు! నోరు జచ్చిన వారు గాకండీ !
వారు వీరని యెంచు టెల్లను సారము లేనట్టి హీనత ! పౌరుల కే గాక పుణ్యము యూరి కదలం దేమి యున్నది !! భ !!
జ్ఞానులను కొని యెగసి పడి యజ్ఞా నములు పై బెట్టు కొనినను ! మానసంబున బుట్టి వచ్చియు పూని మరి జన్మింప వలయు !! భ !!
ఝాట మాట లాడ బోకండీ!నరులార కలియుగ నాటకములో జిక్క బోకండీ!ఝాట మాట లాడి పొట్ట కూటికి వేషములు దాల్చక ! యాటికి యమ బాధలచే కాటికి పోవంగ నేటికి !! భ !!
మూల స్థానము తెలిసి బ్రతకండి ! జనులార మీరు! మేలిమిగ శ్రీ హరిని వెదకండి ! మూల స్థానము తెలిసి మీలో చాలగా వెలిగేటి జ్యోతిలో ! లీలమై వెలుగొందు బాలుని నీల మధ్యము నందు దలచుచు !! భ !!
ధరణి శ్రీ నరహరిని గొలువండి ! జనులార మీరు! పరమ పదవిని పొంద గోరండి ! ధరను శ్రీ ఘటికాద్రి వర హరి పరమ భక్త వరుల మనుకొని ! విరివిగా నరసింహ దాసుని వర కవిత్వము సారమను కొని !! భ !!
No comments:
Post a Comment