Friday 11 November 2011

భక్తి

పల్లవి :నిజము దెలియక నీనామ మిడచి నే నింత కాలము మూర్ఖుడ నైతిని స్వామీ......
చ:1. ఆశల గిరులపై అనుబందపు సాలెగూళ్ళను గట్టి వ్యథలు జెందితి స్వామీ...... || నిజము || 
2. అవమానములన్నియు నవనాడులు నిండగ నిద్రకు నీళ్ళొదిలితి స్వామీ...... || నిజము || 
3. శివుని రాజ్యమందున చీమకు జిక్కును మనిషిగ నే నేపాపము జేసితి స్వామీ...... || నిజము || 
4. అసురలకందరికి అభయము నిచ్చితివి నేనంతటి అధముడనా స్వామీ...... || నిజము || 
5. కొడుకుల కోసమని కూడబెట్టి నే గూటికి కరువై దిరుగుచుంటిని స్వామీ...... || నిజము || 
6. అందమందమని నే నీ మాయ లోక మందున కురూపినైతిని స్వామీ...... || నిజము || 
7. ఈభవ బంధమ్ముల బాధలను తాళలేక నిను వేడుకొనుచుంటిని స్వామీ...... || నిజము || 
8. పాఱుపత్తెపు పలుకులు పాముల వంటివని పాతర వేసితి స్వామీ...... || నిజము || 
9 నాకందేనా నీ దివ్య చరణాలు కన్నీటితో కడుగుటకు స్వామీ...... || నిజము ||
10. అణువణువునా నుండెడి వాడవే నా దేహమందు చోటు లేకుండెనా? స్వామీ...... || నిజము || 
11. తప్పులెంచక తమము దీర్చి తోడుగ నుండుము స్వామీ...... || నిజము || 

పల్లవి: దేవి దేవి జగదాంబ ! దేవి దేవి దుర్గాంబ
. మహిషాసురుని మర్థించి ! మైసూరందు కొలువుండి మమ్ముగాచిన చాముండి...చాముండి...చాముండి || దేవి దేవి ||

. శంకరాచార్యులతో నడచి ! శృంగేరి యందు కొలువుండి మా చదువుల తల్లి శారదాంబ...శారదాంబ...శారదాంబ || దేవి దేవి ||
. కృష్ణమ్మ కోరగ కరుణించి ! విజయవాడ లోన కొలువుండి మా దుర్గతి ద్రుంచిన దుర్గాంబ... దుర్గాంబ ...దుర్గాంబ || దేవి దేవి ||
. వనదేవత వడ్డించ ! హోర్నాడందు కొలువుండి మా యకలి దీర్చిన అన్నపూర్ణేశ్వరి ...అన్నపూర్ణేశ్వరి ...అన్నపూర్ణేశ్వరి|| దేవి దేవి ||
. శివ కేశవులకు సాటిగ నిలచి ! కంచిలోన కొలువుండి మా కష్టము దీర్చిన కామాక్షి ... కామాక్షి ...కామాక్షి || దేవి దేవి ||
. ముక్కంటిని మురిపించి ! మధురలోన కొలువుండి మా మిరాశి మీనాక్షి... మీనాక్షి ...మీనాక్షి || దేవి దేవి ||
. విశ్వేశ్వరుని వరియించి ! కాశీలోన కొలువుండి మా వికృతి దీర్చిన విశాలాక్షి ... విశాలాక్షి ...విశాలాక్షి || దేవి దేవి ||
 సీ:
రవికుల దశరథ రాజసుతునిగ జ |  న్మించె విష్ణువు ముని జనగణము
రక్షింప ధరణిపై రాక్షసులను జంపి | తపసి యాగము గాచి తమముదీర్చి
శివుని విల్లు విరచి సీతనుబెండ్లాడి | దారతోడ నయోధ్య జేరి, తండ్రి
మాటకై యడవికి మరలెను తా సతి |   తమ్మునితోగూడి త్వరితగతిని
మారీచుడు మృగమై మాయజేయగ రావ |  ణాసురునకు జిక్కె నాడు సీత
కిష్కింధ జేరి సుగ్రీవ హనుమ జాంబ|  వంతుల తోగూడి వాలిని వధి
యించి రాజ్య మతని కిచ్చి రాజుగ జేసె; |  లంకిణి జంపి, జలధిని దాటి
గనుగొనె సీతను కపిరాజు వనమందు |    నంగుళీయకమును నమ్మకిచ్చి

వాయు నందన  దెచ్చెన  వార్తలు విని
వారధిని గట్టె, కడలిపై వానరులు స
కాలమున నటు లంకకు కాలు మోపి
రావణాదుల గూల్చిరి రణముజేసి
 

రావణానుజు మన్నించి రాజ్యమిచ్చి
పుష్పకవిమానమందున పురముజేరి
రాజ్యమేలెను పురజనరంజకముగ
రక్తి నాదర్శ పురుషుడై రాము డవని.


శుభమస్తు!


సీ . శేషాద్రి గిరిపైన శయనించె నాస్వామి | యెల్లలోకములను నేలివచ్చి
నీలాద్రి గిరిపైన నిద్రించె నాస్వామి | యెల్ల రాక్షసులను నేరివేసి
గరుడాద్రి గిరిపైన కనిపించె నాస్వామి| యెల్ల విఘ్నములను కల్లజేయ
అంజనాద్రిగిరిపై నందుకొనె స్వామి | యెల్ల వినతులను మెల్లగాను
వరునిగ వృషభాద్రిన స్వామి వరములిచ్చె
శిలల నారాయణాద్రిపై జింత దీర్చె
మొదట వేంకటాద్రికి జేర ముక్తినిచ్చె
సప్తగిరి దాట తమము సమాప్తిజేసె|

సీ .
సి )అంజనాద్రిగిరిపై నంజలి ఘటియించి| పాదదాసుడనౌదు ముదముతోడ
వెంకటాద్రిన నేను వేంకటేశుని జూడ | పరమపదవి గందు పరుగు తోడ
నారాయనాద్రిన నారద బూజిత | పాదు ప్రక్క నడచతు భక్తి తోడ
శేషాద్రి పై జేరి శయనించిన పరమ| పురుషుని జేరెద ప్రజ్ఞ తోడ
గురుని గరుడాద్రి పైనేను గురుతుగాను
వరుని వృషభాద్రి పైనేను దిరుగబోదు
మరలు గొల్పు శ్రీవారిని మరల బట్టి
ఉభయ దేవేరులకు మధ్య నుండ జేతు |


ఆ)
సప్తగిరులపైన నాప్తుడని దెలియ
సప్తగిరులయందు గుప్త చిత్తు,
సప్త సక్తులను సమాప్తిచేయగ నేను
సప్తగిరులమెట్టె స్వామి నేడు|
సీ .అకళ్యాణ రాముని కమనీయ చరితము | కనులార జూడగ కలసి వచ్చె
నవనీత చోరుని నటనముల్ జూడగ | నట్టడవిని దాట నడచి వచ్చె|
తిరునామమును పెట్టు తిరుమల వాసుని| తీరును జూడగ తిరిగి వచ్చె
సిరులిచ్చి గాపాడు శ్రీనివాసునకును| ముడుపులు జెల్లింప నడచి వచ్చె|
కలతలను త్రుంచమని వేడ కదలి వచ్చె|
వ్యథలగడతేర్చ మని కోర వడిగ వచ్చె|
ముక్తినిచ్చిగాపాడగ రక్తితోడ|

పరమ పురుషుడని దెలియ బడయ వచ్చె|
28/nov/2011

౧శరణం స్వామియె శరణం
శరణం హరిహర సుపుత్ర శరణం శరణం
శరణం సద్గురు శరణం
శరణం ఎరుమేలి వాస శరణం శరణం
౨శరణం స్వామియె శరణం
శరణం మాధవ కుమార శరణం శరణం
శరణం శాస్తా శరణం
శరణం శబరిగిరివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం శంకర కుమార శరణం శరణం
శరణం హేప్రభు శరణం
శరణం పంపానివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం
శరణం సత్ప్రభు శరణం
శరణం అళుదా నివాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం ఆనందరూప శరణంశరణం
శరణం మోహన శరణం
శరణం పూంగా వనవిభు శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం ఇరుముడి ప్రియునకు శరణం శరణం
శరణం రక్షక శరణం
శరణం నీలిమలవాస శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం వీరమణి కంఠ శరణం శరణం
శరణం విష్ణుం శరణం
శరణం పులివాహనునకు శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం శిరియాన వట్ట శరణంశరణం
శరణం వల్లభ శరణం
శరణం పెరియాన వట్ట శరణం శరణం

శరణం స్వామియె శరణం
శరణం విల్లాలి వీర శరణంశరణం
శరణం నిర్గుణ శరణం
శరణం పందళ నివాస శరణం శరణం
౧౦
శరణం స్వామియె శరణం
శరణం గురువాయురప్ప శరణంశరణం
శరణం సతతం శరణం
శరణం కాంతమల జ్యోతి శరణం శరణం
౧౧
శరణం స్వామియె శరణం
శరణం మణికంఠ స్వామి శరణంశరణం
శరణం అగజా శరణం
శరణం భూలోకనాథ శరణం శరణం
౧౨
శరణం స్వామియె శరణం
శరణం జ్యోతియ స్వరూప శరణంశరణం
శరణం ఈశ్వర శరణం
శరణం వరదైత్య దమన శరణం శరణం
౧౩
శరణం స్వామియె శరణం
శరణం భువనేశ్వర తవ శరణంశరణం
శరణం షన్ముఖ శరణం
శరణం కలియుగ వరదుడ శరణం శరణం
౧౪
శరణం స్వామియె శరణం
శరణం నారాయణునకు శరణంశరణం
శరణం శ్రీధర శరణం
శరణం రాజాధిరాజ శరణం శరణం
౧౫
శరణం స్వామియె శరణం
శరణం సుర మునిసురక్ష శరణంశరణం
శరణం వీరా శరణం
శరణం పురుషోత్తమునకు శరణం శరణం
౧౬
శరణం స్వామియె శరణం
శరణం మధుసూదనునకు శరణంశరణం
శరణం కేశవ శరణం
శరణం శ్రీరామ చంద్ర శరణం శరణం
౧౭
శరణం స్వామియె శరణం
శరణం కమలేక్షణునకు శరణంశరణం
శరణం సద్గుణ శరణం
శరణం దామోదరునకు శరణం శరణం
౧౮
శరణం స్వామియె శరణం
శరణం నర్తన సుప్రియ శరణంశరణం
శరణం నిరతం శరణం
శరణం మాతా పిత గురు శరణం శరణం

రామా| ఇనకుల సోమా
సోమా| నీనామమేను సోబడు రామా|

రామా| జానకి ధామా|
ధామా| దుర్వాద ద్రుంచు తారక రామా|
( దుర్వాద= నింద)

రామా! రవికుల సోమా!

సోమా! సకల సుగుణాభి సుందర రామా!
రామా! జానకి ధామా!
ధామా! దురితము దహించు దావరి రామా!

21/07/2012
సీ :
సీస పద్యములను వ్రాసెద శ్రీపతి | పాద పద్మములకు ప్రణతి జేసి 
నఖిల లోకములకు నాదారముగ నుండి | మునిజనులను గాచ ముందునిలచు 
శేష శయనుడైన  శ్రీ హరి చరితను, |పుడమి జనులనెల్ల బుట్ట తేనె 
దరికిజేర్తు దిరిగి దిరిగి, దశా వతా | రములు ధరణి యందు  రక్కసులను 
జంపి, పరమ భక్త జనులను రక్షించి 
ధర్మ మార్గములను కర్మతోడ 
దెలుప నెంచి, తనదు దేహ బలము జూప 
గాదు , శరణు యన్న కలిమి నిచ్చు | |
----
రామాయణ ఘట్టములు  కొన్ని తోటక వృత్తములో 

పరివర్తన జెందిన పామరుడే 
విరచించె చరిత్రను వృత్తముగా (వేదము )
త్వరి తమ్మున బ్రోయగ దాససతిన్ 
నరయాసము బట్టిరి నాడికమున్

మురిపించగ జింకయె పుత్తడి గా 
మరి గోరెను సీతయె మైకమునన్ 
పరిగెత్తెను రాముడు వాకమునన్ 
పరి మార్చెను జింకను బాణముతో 

సరితూగు స్వరమ్మున సాధకుడై
మరణించుచు బల్కెను మంజువుగా     
దుర వాసము గోరిన దుర్జనుడై 
ధరణీజను లంకకు తంత్రమునన్ 

నరపాలుడు జేర్చెను నాశము కై 
పరమాత్ముని గాంచిన వానరులే 
శరణాగతవత్సల  సఖ్యము కై 
పరివారము తోడుగ వచ్చెనులే 

దొర తారక రాముని దూత్యము కై 
పర దేశము మారుతి పాదమిడెన్ 
దరహాసము జేయగ దైత్యసతుల్ 
పరికోపము జెందియె వాలముతో 

పుర వీధులు గాల్చెను పూర్ణముగా 
కరిపించెను వైరిని కాతరుడై 
 ధరణీజను గాంచెను  తంత్రముతో 
డరి వర్గము జెందెను యాతనముల్ 


 

  







Thursday 11 August 2011

వరకట్నం

ఆ: కందుకూరి వారు కదనరంగానలే
    రు మన కంది శంకరయ్య గారు
    కట్న కదన మందు కలముతో పోరాడ
    రామ బంటునౌదు రణము లోన|

నిన్న ఓరాక్షసుడు తన బార్యను ఆడపిల్లను కన్నదని చంపేసాడు, మరొకడు
ఆడపిల్లను కనబోతున్నదని కట్నము మళ్ళతెమ్మని చెప్పి చంపేసాడు.

౧. పాపబారమొక్క పాపది గాదురా
    సృష్టికార్యమందు సకల జగతి
    సంతసించు తోడు సహధర్మ చారిణి
    లేకయున్న నీవు లెస్స గాదు|
౨. ఆడపిల్ల రాదు ఆడువారలనుండి
    రొమ్ముపాలు ద్రాగి కొమ్ములొచ్చి
    కొడుకు కొఱకు కొరివి గొడుగు నీడన నిద్ర
    పోకు, నిజము దెలియు నీకు వేమ| ( సాదు)
నాపెరులోని సాదు వేమన గారి స్థానమందు వాడుకోవాలిని ఉంది, మీ అభిప్రాయమును తెలుపగలరు
.ఆడపిల్ల రాదు ఆడువారలనుండి   
    జంట గాక యున్న జగతి లేదు   
    పాపబారమొక్క పాపది గాదురా   
    నీకు సగము గలదు నిజము గాను|
౧౨/౦౮/౧౧

 క:

Tuesday 24 May 2011

యోగ


సెల్ ఫోన్, వాహన కాలుష్యము, యంత్రముల శబ్ధములు యోగ చేయకపోవడము, జంక్ ఫూడ్ తినడము మరియు ఉప్పు అన్నిటియందువేసుకొని తినడము చూచి వ్రాసినది
సీ: నిద్రబద్దకములు నీకీయవు సిరులు | ఆరోగ్య సంపదలబ్బు, నన్న
రసములన్నియరగి రక్తమందు గలియ| ఇందన వాహనమిచ్చు ముదము
యంత్రము దెచ్చును యమభాదలను వేగ| నరకము జేయును నరులకెల్ల
నాలుగడుగులేయి నీకోసముదయాన | కాళ్ళకు వేయకు కళ్ళెములను
ఆ: అడ్డ మైన గడ్డి నడవిజంతువులైన
ముట్టకుండు, జనులు మట్టిలోన
ఎంతవారలైన కాంతదాసులు, తావు(మీరు)
సంగ్రహించుకొండి సత్యమెల్ల.
( కాంత === నాలుక), తావు = మీరు కన్నడభాషలో.
మట్టలోన== భూలోకమున,

ఆ: కష్టమొచ్చిబడ్డ గలతజెందకవిల్లు
సిద్ధబరచి వేగ బుద్ధిశరము
జేతబట్టినీవు సంధించ, ఫలమిచ్చు
పారిబోవదగదు పురుషులకును.
సమస్యను చూచి పారిపోకు మిత్రమా, ధైర్యంగా ఎదురించు.


07/06/2011

Monday 14 March 2011

samasyapuranam


గద్యము వ్రాసిన పూజ్యులు పద్యము వ్రాయు పురుషుండు పాపాత్ముడులే, సద్యోగము చెడి దిరుగుచు మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్|
   24 డిసెంబర్ 2011 8:46 సా
"త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?"
యన్న చిలిపి కృష్ణునకును "నన్ను వీడి
గోపికలతోడ చిందులు గోపబాలు
న కుచిత మగున యీరేయి నల్లనయ్య!"
22/12/11
వ్యర్థములను విడువ వార్థక్యమును బొంది
కంపుగోట్టె నేడు కంచ బంధ
దమము దీర తాను తరళిపోయిన సుర
గంగ ,మునిగి పోయె గంగ లోన
(దమము = క్లే శమునోర్చుగుణము  , కంచ బంధ = గంగ)

21/12/2011
మాన హీనులందరికిని మతులు జెడగ
విష గుళికయయ్యె గీతా వివేక రసము
కుక్క మూతి పిందెలు కారు కూతలు బలు
క పరమ పురుషుని బలుకు కంటగింపు
గురువు గారికి ధన్యవాదములు 
 పరమ పురుషుని బలుకులు గరముగాను
కుక్క మూతి పిందెలు కారు కూతలు బర
దేశమందు ప్రామాణిక దిశను జూప
విష గుళికయయ్యె గీతా వివేక రసము
( దిశ = మార్గము )






  3 సెప్టెంబర్ 2011 10:40 ఉ
( గనులను తిన్న వారు నేడు పడుతున్న భాదలను ఈ విధముగా)
గనుల దిన్న ఘనులనెల్ల కటిక నేల
పై పరుండ బెట్టగ, వారి పసిడి కలలు
చిద్ర మై నిద్రలేకుండ చీకటిన ద
నోడ నేల పయిన్ నడయాడ దొడగె| 

5 సెప్టెంబర్ 2011 2:20 సా

గాలి సోదరులపై
గాలివారు దినెను గనులన్ని, వేగంగ
గాలిలోన దిరిగె ఘనముగాను,
ఎదురుగాలి వీచి యిడుము లందగ నేడు
గాలి కబురు లిపుడు గణన కెక్కె|
6 సెప్టెంబర్ 2011 10:01 ఉ  విభీషనుడు రావణునికి హితబోద జేసెను గాని వాటిని పెడచెవిని బెట్టి
మరణించెను అది
.................................
అన్య కాంతల చెలిమి చేటనెడి సుగుణ
రాము డాతడు, తమ్ముడు రావణునకు
బలు విధముల జెప్పెనుగాని పంతములను
వీడక గడతేర్చెను లంక వీరులలను|
 
4 అక్టోబర్ 2011 1:50 సా
నేటి దొంగలు, నీవు దొంగయన్న వారికి బదులిస్తున్న రీతిని జూడ వారి మునుపటి గుణములు బయటపడును. సుమతీ శతకపు పద్యము "వెనుకటి గుణమేల మాను" తీసుకుంటిని
గురువుగారు మన్నించాలి "మూల ముండు" ను "మూలములను " గా మార్చితిని
తప్పులను జూప రోషము దన్నుకొచ్చి,
పురుషపుంగవ బలుకులే పరుష పదము
కుందనపురీతి, నేరుగ గాంచు జనులు
పాదపపు మూలములను పై భాగమందు|
  14 అక్టోబర్ 2011 10:31 ఉ
మామాయను పదవి కొఱకు
దామోదరు దిట్టు వాడె ధనవంతుడగున్|
ఈ మాయలతోడ జనుల
వేమార్చుటనేర్చినట్టి వేమన తమ్మా|
(మామా = మంత్రి , వేమన = విలాస పురుషుడు)
గురువు గారిని,వేమన గారిని క్షమించమని కోరుతూ| 
 
17 అక్టోబర్ 2011 9:56 ఉ
దొరికిన దొంగల శిక్షిం
పరు, సూత్రాలెల్ల నేడు పరులకె గదరా|
దొరతనమున దోచుకొనిన,
దొరకని దొరలును , దొరికిన దొంగలు నొకటే| 

18 అక్టోబర్ 2011 2:13 సా
గాలి వారలు దోచిరి గనులనెల్ల
కట్టి బళ్ళారి యంతట గట్టిగాను
గాలి మేడలు, స్వర్గము కన్న మిన్న
సుఖము సకుటుంబమొందెలె సొగసు తోడ|



 20 అక్టోబర్ 2011 12:09 సా
చమురు వెదకెనొకడు సాగర జలములో
నల్పమధిక జేసి యప్పు జూపె
మదుపు దారులకును మార్గనిర్దేశ్యము,
మాటదప్పు వాడె మాన్యుడగును| 
21 అక్టోబర్ 2011 10:17 ఉ
కోదండ విచ్చెసెను కి
ష్కిందకు లక్ష్మణుని తోడ క్రీడన వాలిన్
క్రిందకు గూల్చ దొరకె నా
నందము సుగ్రీవునకు సునందుని గరముల్| 
 21 అక్టోబర్ 2011 10:44 ఉ
కోదండ విచ్చెసెను కి
ష్కిందకు లక్ష్మణుని తోడ క్రీడన వాలిన్
క్రిందకు గూల్చ గలిగె నా
నందము సుగ్రీవునకు సునందుని సేవల్| 

21 అక్టోబర్ 2011 8:19 సా
కదలె నడవికి దన కాంత జానకితోడ
నడవియందు జింక నడచిపోవ
విల్లు బట్టి వెదకె విజ్ఞత విడిచి జా
నకిని గోలుపోయె నాడు తాను. 

   
22 అక్టోబర్ 2011 9:36 ఉ
ఐదు వేల కోటు లయ్యవారికి జాల
కుండె, లక్ష యున్న మండె కట్టె,
వేలు లేకయున్న వ్రేళ్ళుబడకయున్న
ఐదు వందలనిన నల్పమెకద| 

29 అక్టోబర్ 2011 6:34 సా
సిగ్గు విడిచి చెల్లెలి యింట సిరుల గొనుచు
నియమములను పాటింపక నిత్యము దిను
జనులకు భగినీహస్త భోజనము విషము
పాలు ద్రాగగ గరళమౌ పాము వోలె. 

 
29 అక్టోబర్ 2011 11:08 ఉ
మూడు కాళ్ళ జంతువులు ఇంటనున్న మంచిదని తలచి మూర్కునికథ
-------
కందులవారికి గలిగెను
సందేహము,మూడు కాళ్ళ శునకము తోడన్
కుందేటి కాలు విరువగ
కుందేటికి మూడు కాళ్ళు-కుక్కకువలెనే|
౨) నా కవితలు మూడుకాళ్ళ జంతువులవలెనున్నవి.
కందుల వారికి దెలియక
కందపు నియమములు, పొందిక విరుపు లేకన్ |
సుందర కందము గాంచేన్
కుందేటికి మూడు కాళ్ళు-కుక్కకువలెనే|


29 అక్టోబర్ 2011 6:30 సా
వందన యడవిన గాంచెను
కుందేటికి మూడుకాళ్ళు కుక్కకు వలెనే
మందులు వేయగ ముందే
పొందె విఱిగినట్టి కాలు పూర్తి నిడివితో. 

  3 నవంబర్ 2011 2:01 సా
గడాఫీ చరిత్రను ఈ విధముగా
-----------
దోచి సంపదలను దాచిన దొరవారు
పంచె గష్టములను ప్రజలకెల్ల,
తాళలేక పట్టి తన్నఁజూచినయట్టి
జనము గాంచి నేత జాఱుకొనెను. 

 10 నవంబర్ 2011 11:05 ఉ
చంద్రునివలె గురువు జాబిలియైన నే
పాడు పున్నమ యిది, పండుగ కద
రెండు చంద్రులగను రేయి, పూజలు జేయ
యముడు విధిని మరచి దమ్ముడౌనె 
 13 నవంబర్ 2011 8:36 సా
పరువు విలువ లేని పందివలె ఘనులు
జాతి సంపద దిని ఖ్యాతినొంది
ప్రీతితోడ ధనపు బెట్టుబడికి పుత్ర
జగతి మెచ్చు, జనులు జైలు పాలు. 
పచ్చ నోట్లు పంచ బలుమార్గములుజూపు,
జగతియందులేని జాలవిద్య
నేర్చినట్టి వారు, నీతిని జంపియే
ఆపదలను దొలచు పాప చయము
(జాలవిద్య = గారడి విద్య) 
8 డిసెంబర్ 2011 1:06 సా
ఆపదలను దొలచు పాపచయము, నేడు
రాజకీయమందు రాక్షస గణ
మెల్ల జేరి కోట్లు మ్రింగి, కావలియున్న
వారి గష్టములకు వార్థిగట్టి 
జనులు జేరి నిత్యము నామ జపముజేయ
గలిగెను విదేశ భక్తులు కలియుగమున
కొంటెవాడెదిగెను జగద్గురువనంగ,
రాస లీలలందుమునిగె రమణితోడ|
 11/03/11
         క :విస్కీ గురించి జెప్పగ
               విస్కీయేయగు ; తెలియక విప్పిన బిరడా 
               విస్కీ ఉప్పొంగి  వచ్చు 
              విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్.!
      ఆ:మెల్ల కన్ను వాడు మెట్టు పై నుండిన 2
              మెల్ల కొరకు జేయు మొసలి జపము 
              మెల్ల గానె గుట్టు మనుజుడు జెప్పును
              మెల్ల కన్ను వలన మేలు గలిగె.!
            క : ధరలో  నాలుగు విధముల 
                 ధరలు పెరిగి పేదల లకు దప్పిక దరిద్రం 
                 ధరిచేరి విడువకున్నది 
                 ధరిణిపుటంచున నిలిచిన ధర క్రిందగునా !
13/03/11
          ఆ   :  లవణమన్న  దినుట లక్ష్యము నరులకు 
                   ఒక్క తరముకు సరి నొక్క కోటి 
                   వేల కోట్ల సొత్తు ఎవ్వరి కోసమో ?
                  ధనమె లక్ష్య మగును తాపసులకు.!2
14/03/11
           ఆ : వాహ నంబును వడివడిగా నమర్చి నే 
                  లోహ పక్షి పెట్టె లోన పెట్ట 
                  ధన్యవాదములను దెలుపుతూ వెడలెను 
                 అర్జునునకు మిత్రుఁ డంగరాజు. !
15/03/11
            ఆ : శ్రమము లేక నేడు శరీరము  జేదిపోవు 
                  పాడు వాస నొచ్చు పరగడుపున 
                  మంచి మార్గ మేది ? మనుజుండు తలచిన

                  శ్రమమునందు మనకు శాంతి దొరకు.!
          ఆ: దాచ వలసి( దాన్ని దాచ కుండా పోయి
               చూప దగిన దాన్ని జూప కుండి
               దాచి దాచ నట్టు దాగుడు మూతల
               నాడు వారు నేడు ఆడు వారు ! 
1/04/11
      ఆ :   తన్మయత్వ మందు తానుండ కనులకె
                దురుగ రంభ నిలిచి మురిసి  బిలువ
                దెలియ కుండు , నట్టి తీరు తోడ  ప్రసిద్ధ
              కవులు నియమములకుఁ గట్టుపడరు !
02/04/11
    క  :  మకరందము  రుచి కై  గో 
           ధిక, తుమ్మెద పాట్లు జూడ నికరం గానే 
           మకరందం పై మిక్కిలి
           మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా!
    క   : నాడు కపిల్ దేవ్ జిమ్మిలు 
            నేడు యువీ ధోని ఆడ నాటి విజయమే 
             నేడు గలిగేరా ! గంభీర్ 
            మాడు పగులగొట్ట కోహ్లి మెల్లగ పంపెన్ !
    క :  విశ్వ విజేత మన సచిన్
          విశ్వాసము తోడ జూలు విడిచి యువకులా
          డ శ్వాస నిలిచి పోయే !
          శాశ్వత విజయాల కీర్తి సాధించును లే !
     క : పొత్తు  తోటి పరుగులను
          ఎత్తుల తో ఆడి గెలువ ఎల్లరు మెచ్చున్
          జిత్తుల సంగకర తిలక్ 
          భిత్తర బోవంగ జిక్కె బృందావనమే!
02/10/౨౦౧౧
          గురువుగారికి ప్రణమిల్లి
     నేటి రాజకీయ  నాయకులే కాదు , ప్రజలు కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు  

    తే : మాయ జేయగా మన్నించి వేయు ఓటు,
         ధన మివ్వ మానప్రాణ , తనువు నిచ్చు 
        నట్టి యల్ప సంతోషులు అవని నుండ,
         మాయ జేయ ఘనుండె గాంధేయ వాది |


03/04/11
ఉ : యాంత్రిక జీవనం మనకు నెవ్వరి తోడును చిక్క నీ యదే
      కాదది కాల కూటము ఒకానొకుపాయము తోడ నిక్కమున్ 
      అందరి ఆప్తుడై మెలగ నందును అందరి శ్రీకరం, మదే
     కారము గన్నులం బడిన గల్గును మోదము మానవాళికిన్!
06/04/11
 ఆ  :  ఆది కాల మందు  నార్యులు కాల గ 
         మనము జూచి జేచి, మనన గొరకు
         నామకరణ ! ముందు నిలచె శ్రీఖరము యా  
        ఖరమె మన కొసంగు ఘనసుఖములు.
07/04/11
 తే    : నిద్ర బద్దకము లొసంగు నీకు సిరులు 
         యన్న వట్టి మాటలు, నవి దున్న పాలు 
        నిచ్చు నట్టి సత్యము సుమీ , నిత్య సత్య 
        మేమియన గట్టి వ్యాయామమేను భామ !    
 తే :  సమర మందున శ్రీతోడ సత్య భామ 
       నరకునుని జంపిన బిదప నీర జాక్షు 
       నియదలో స్థానమును బొంద , నాతి పైన 
       నంధు డానందమున మెచ్చె - నతివ సొగసు !
 
సి : కోట్లను పొందిన కూడుగ తినుటకు , మీకు లవణమన్నమే గ తౌ ను ,
      మేలిమి బంగారమును  మింగ లేరుగ, ఎందుకు సాగర మేదు రీత ?
      అవినీతి సొమ్ముతో ఆనంద ముండునా ? తెరచి జూడ తరంగ తంతి యందు
      పురుగులు గనిపించ పెల్లుభికెను కదా ? ఆగ్రహ జ్వాలలు అందరందు !
  ఆ : లంచ గోండు లన్ను లోక్ పాలు బిల్లుతో
         చీడ పురుగు లాట చీటి తోడ
         నరక వచ్చు నధిప నేరుగా , అందరూ
         హాజరేల నీత్కి హార తినియ ! 

     చీటి = RTI ,నధిప = రాజ


10/04/11
క :    చిన్నదగు  ఇంట ఇల్లాలు
        జున్నును తిన్నట్లు యుండు, జుంటి మధురమే 
        నిన్ను వెదక శత ఆయువు ,
        చిన్నిల్లు న్నెనె కలుగు న శేష  సుఖంబుల్ ! 

 ఉ : గడ్డిని జూచియే గలుగు గాడిద కైనను సంతసం సుమీ ౧
       గడ్డిని జూపగా వెనుక గన్నులు మూసియే సంతకంబులన్
       గడ్డియె గడ్డు కాలమును గూర్చి మినై దెలుపంగ మానవుల్
       లంచము మేయు వారలెక ళంక విదూరులు నీతి వర్తనుల్ !
     
     గడ్డి   =  లంచము
11/04/11
తే : పిల్ల వాడికి పాలను పట్ట కుండ
      పరుగులిడు పడతియు ; కుటుంబమును పగలు
      జూడని పతియు నుండగ జగతి యందు
     పిండి తక్కువైయెను,  దోసె పెద్ద దయ్యె !

 { పిండి = వ్యాయామము , దోసె = రోగము }

తే  :  దేవుడు, గురువు, పెద్దలు దయ్య మైరి
       కుక్క మూతి పిందెలు హెచ్చు కలియుగంలొ
       గౌరవము గాడిదలకివ్వ  గజము జెప్పె
       పిండి తక్కువైనను దోసె పెద్దదయ్యె !

{ గజము = నిమ్మధస్తుడు, పిండి =  జ్గ్ఞానము,తెలివి , దోసె = పదవి }
13/04/11
క : కామాన్ధులు కత్తుల తో 
     రోమాల తో తరగతి కరుదెంచ, భామా 
     భూమ్యా కాశమందున
      గో మాంసము దినిటి వాడు గురువుగ నొప్పున్ !
క  :  పతి దేవుని పాదములకు 
      సుతి మెత్తగ తాకి పూజ సేసిన బిదప సు 
      మతి తా మ్రొక్కి మొదటి హా 
      రతి కై సోదరిని వేగ రమ్మని పిలిచెన్ !
 క :  కులుకులు దానికి సొంతం
       పలుకును మామిచిగురు తిని పల్లె లెచుటకున్ 
       అలుగున నుకరింపగనే  
       కలుగును మోదము సమస్త కణజాలముకున్ !
  క : తిరు నామ మెట్టి గోర్కెలు ,
       బరువులు ద్రుంచగ  ముదమున భక్తులు ముక్తి కి 
       మరు దర్శనమును గోరగ 
       తిరుమల రాయనికి లేవు తిండియు సుఖముల్ !
   25/04/11
తే: అడగకమునుపే వరమిచ్చె  నాత్మ బంధు
    నందరి మదిలో నుండగ; నాత్మ పోయి
   శివుని జేర మరణమంచు చెప్పగ నిజ
   మరణ మందిన వాడె యమరు డనదగు.
16/04/11
ఆ: పట్టుచీరదెచ్చి పాన్పుపై పవళింప
     జేసి,గోర్కె దీర్చి సేవ జేయు
     ననిదలచిన రాత్రి యాశలు వమ్ముమై
     కవిని పెండ్లి యాడి కాంత వగచె !
   19/05/11
క: రంపముల వంటి పలుకులు
జంపాలాటాడని పతి జంటగ నుండన్
పంపానది తీరములో
సంపాద్న లేని పతిని సతి మెచ్చుకొనెన్.
( జంపాలాట = మధ్యము సేవించుట)
20/05/11
ఆ: ధనము వలన గలుగు ఘనులకైన మదము
చిన్నవారి జెలిమి చెఱపి వారు
మరచి   ముందు వెనుక  మసలుచు  పోయెడి
గొప్ప వారి, కుండు గోచె బుద్ధి|


04/06/2011
  
: కుక్కలు రక్కిన పిక్కలు
చుక్కలు జూప, దన రోజు జక్కగ లేకన్
జిక్కితినె, గోపమున నీ
యక్కా, రమ్మనుచు మగడు నాలింబిలిచెన్,
తే :కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు
     దైత్య వర్గమెల్లను అరు దెంచి నేమి
     పెండ్లి మెచ్చునే పదుగురు ? పలుకులువిన
     స్వప్నము గరగి యతడును, సంతసించె
05/06/2011

తే :జగను కాప్త మిత్రుడు గదా చంద్రబాబ  
      టన్న కాదు  కాదుందురే   యాప్తులేల్ల
     ఔను వారిద్ద  రొకతాను ముక్క లేయ
     టంచు సామాన్య జను లెంతు రెంచి చూచి |
క: కప్పలు పదులుగ జేరి నె
గొప్పలు జెప్పనొకగప్ప గూరిమితోడన్
జెప్పెను, మీకథలకు మా
గప్ప్లకు సంపంగినూనెకావలె, వింటే,


 
06/06/2011
ఆ: నల్ల ధనము తోడ చల్లగా నుండెడి
కల్ల లాడు వారె కవులుగాదె?
మల్ల యుద్దమేను, మాట్లాడువార్లపై
చల్ల జేయకుండు మెల్లగాను!
కవులు = రాజకీయనాయకులు, నిన్న జరిగిన రామ్ దేవ్ బాబా
సంఘటనను ఈరూపమున తెలియజేయుచున్నాను.

07/06/2011
ఆ: ఎండమావినీరు ఎకరము దడిపెను,
గొడ్డుటావు పాలు కుండనిండె
నన్న, నమ్మిదిరిగె నమ్మలక్కలునేడు
వరుసబెట్టి జెప్పు వివరములను!

08/06/2011
తే: చీమలేగదా యవి తానుజెప్పినట్లు
నాట్యమాడునులేయని, నాయకుండు
నిద్రలోనుండ, జిక్కిన నలుసు తోడ
చీమ కుట్టగ, జచ్చెను సింహ బలుడు.
( చీమలు = తాపెంచిన ఉగ్రవాదులు,నాయకుడు = అమెరిక, నలుసు= విమానము)
అమెరికపైన ఆల్ ఖైదా దాడిని ఈరూపమున వ్రాసితిని.
 

క: ప్రేమించితినని జెప్పగ
భామిని కళ్యాణమాడి భార్యగ మారెన్
భూమికకు సవతినని దెలియ
భామాకుచమండలంబు భస్మం బాయెన్.
(భూమిక = మొదటి భార్య)
09/06/2011
ప్రస్తుత ఆంధ్ర రాజకీయములను ఈ రూపున
క: నటునిటు గా రెడ్లుండగ
    చటుకున గొట్ట నధికార సారద్యమునన్
    పటుతర ప్రభుత్వముండగ
    కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్.
( కుటిలాలక = సొనియాగాంధి )

24/06/07 
చోర వృత్తుల నేతలు చేరి సకల
జనుల ప్రాణములను కష్ట జలధి యందు
గలుప పల్కనెల్లరు , వారి కలిమి పెంచు
ఐకమత్యమ్ము గలిగించు నధిక హాని !
   తే : చోర వ్యాపార నేతలు చేరి సకల 
        జనుల మాన ప్రాణములను జలధి యందు 
         గలుప పల్కు నెల్లరు , వారి కలిమి గొరకు
        ఐకమత్యమ్ము గలిగించు నధిక హాని !
29/06/2011
 తే: కలియుగములోన కండలు గలిగియున్న,
     నీకు నూరు జనులు జేరి నలుగు బట్టు 
    ఖలుల కిచ్చు గూరిమితోడ కానుక మరి 
    కుత్తుకలు గోయు వానికి కోటి నుతులు !
తే: కలియుగములోన కండలు గలిగియున్న,
    నీకు నూరు జనులు జేరి నలుగు బట్టు
    ఖలుల కిచ్చు గూరిమితోడ కానుక,మరి
    కుత్తుకలు గోయు వానికి కోటి నుతులు !

  30/06/11
 ఆ: సిరులు గలిగి యున్న చేరు గప్పలు వేలు
     గాను, సంగమమున కామ చేష్ట
     లధికమై దినదిన యభివృద్ధి జెందగా
     వారువీరనకనె వరుస గుదుర |ఆ: వీధి కుక్కలవలె విధులు మఱచి నేటి
     యువత దిరుగు చుండె, ఊరి జాత
     రవలె నోక్కరోజు రవిజాలనెడి వారి
     సిరులవలన నేఁడు చేటు గలిగె|     ( రవి= సంభరం )
11/07/11

ఆ: మంత్రులెల్ల నీకు మచ్చలు బెట్టగా
బెట్టినావు కట్ట గట్టి ఖైదు
నందు, వారి చర్య లరికట్టి జూడగ
వ్యాధియుపశమొంచె బాధహెచ్చె
12/07/11
తే: క్రొత్త దంపతుల లరుచు కోరికోరి
నల్లమల విహారముబోవ, వల్లకాని
త్రోవ యందున జిక్కగా , తొలిత వార్కి
యడవిఁ గాచిన వెన్నెల, హాయి నొసగె!
/౦7/2011
 చక్కంగనుండ వచ్చును
ముక్కంటికి మ్రొక్కువాడు, మూర్ఖుడు జగతిన్
జక్కంబడునే? లక్ష
రొక్కం జిక్కిన వెనుకటి రోధన కేడ్చున్|
 

 12/08/11
వరముల నాశించి జనులు
వరలక్ష్మీవ్రతము జేయ వలదని రార్యుల్
పరిపరి విధముల జెప్పిన,
సిరులను గోరుచునె జేయు సిరిపుత్రులెల్లన్, 
09/08/11
కలియుగంబున దొరకును కలిమి గొరకు
మందు, యంత్రతంత్రములతో మంత్రి పదవు
లొచ్చు, గోటితో గిల్లిగ నొచ్చు కీర్తి,
పొర్లు దండాలతో రాచ పుండు మానె| 
08/08/11
అక్రమార్జనమ్మె యాటలాడుచునుండ
సిరుల రాక పోక చిత్రము గన
గ సి.బి .ఐ, విషయము గరళము వోలె యా
విరులు దాక గానె , వేడి పుట్టె|
04/08/11
క: కవి కోకిలబలుకుల తో
భువి పరవశమొందె నాడు భుజబలలోకం
చెవిలో, నేడు సరిగమల
కవితా గానమ్ము లోక కంటక మయ్యెన్| 
03/08/11
ప్రాసయతులనుచును పద్యము వ్రాయక,
పామరులు బఠించె పద్యములను
వ్రాసి రావు గారు వాసికెక్కగ నేడు
ప్రాసయతులు లేక పద్యమలరె|
రావు గారు= "శ్రీ శ్రీ "వారు 
03/08/11
 పరిపరి విధముల పొగడెడ
 మరి నీ పాదము వదలక మరిమరి నిన్నే
  కరివదనా , వందనమున
  సరిసరి | మాపనిని సరిగ సాగుగనిమ్మా
18/08/11
 తే: కాల హరణమే చేకుర్చు గార్యఫలమ
ని మన నేతలు నిద్రలో నుండ, రైతు
కష్టములు దీర్చ, సురులకు గష్టమై, న
దృశ్యమైరి భారతదేశ దృశ్యమందు.
16/08/11
పరువు నరువుగా దెచ్చెడి పండితులకు
గురువు స్థానమందుండిన కుత్సితులకు
సిరులు కోరుచు చదువును జెప్పు వారు
గురువు లైన నేమౌను రా | కొట్టవచ్చు|
20/08/2011
క: జాతిని మేల్కొల్పుటకై
నేత నడుము గట్ట, తోడు నీడగ నడువన్
ప్రీతిగ జనులెల్లరు, అవి
నీతికి చెఱసాలె నేడు, నేస్తంబయ్యెన్ 
22/08/11
తే: దేవకీదేవి గర్భాన దేవదేవు
డైన కృష్ణుడు జన్మించె, అష్టకష్ట
ములను దీర్చగ ,ఆనంద ముగను జేయు
కృష్ణ జన్మాష్టమిని నేడు తృష్ణతోడ |
కనుల విందుగాను దవళ కాంతి కొఱకు
దీపములుబెట్టి, జైకొట్టుదురులె యువత,
ఇట్టి వేడుక గాంచిన చిట్టి వార్కి
కృష్ణ జన్మాష్టమి కి వచ్చు క్రిస్మసు గద|
26/08/11

తే: సౌరభము సుంత లేని పుష్పములె మేలు 
     నీతి నిండుకున్న ప్రభుత జాతి చాలు,
     కోతి రూపమున్న వెనుక కోట్లు జాలు ,
      నేడు మధ్యము, ధనమిచ్చు నేత జాలు
25/08/11

ఆస్తి పంపకములలోన నావు పోయె
తమ్మునికి పాలుగా, మేక దనకు దక్కె,
తమ్మునింట నీనగ యది, తనకు జున్ను
పాలు గావలెనని యన్న పట్టు బట్టె| 
23/08/11
చిరంజీవి నేడు చిరుజీవిగా మారుటపై
తే:కండువాగప్పుటకు గూడ కదలకుండె
నేడు కలహాల కాంగ్రేస్సు నేతలెల్ల,
అమ్మ కిచ్చిన మాటపై యస్తమించి
హస్తగతుడయ్యె సూర్యుడత్యద్భుతముగ |
02/09/11
పాపపు జగమున నప్పుల
దీపము వెలిగించినంత, తిమిరముగ్రమ్మెన్
మాపును దన మర్యాధలు
శాపమునిచ్చి, రహదారి సంకట మయమౌ|
28/09/2011
|
గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
చేతబడులనుచూ చిన్నారులను, పగవారిని కడతేర్చు వారిపై
జగమందున పన్నగములు
భగవంతుని నామ జపము పగవానిని క్రిం
దగుటకు జేయునులే, తగ
నిగమము పఠియించి, దర్మనిష్ఠత విడిచెన్|
19/09/2011
పరువు ముఖ్యమనుచు నటి, పయిట తోడ
పాత్రయందు జీవింపగ పరమ జెత్త
యనుచు ప్రక్కన బెట్టగ, నాశ వీడి
పదుగురు గనంగ వనిత వివస్త్రయయ్యె |
20/09/11
బోదకాలువాని బోధనలకు జాత
కాలు నమ్మి, కొలిచి, కాలు గెలిచె
నాతఁ డెన్నికలల నందలమెక్కఁ దా
మరచె ముందువెనుక మొరకు గనుక. 
22/09/2011
క: మామంచి మామ యిచ్చిన
జామను దినిమళ్ళి గోర, జామల తోడన్
బామువిషపు ఫలమిచ్చెన్,
మమిడి ఫలమున్ దినంగ మరణము గల్గెన్| 
26/09/2011
క: దండు కొనెలే టుజీ యం
దుండు ధన మెండుగను చిదంబర ఎండ్ కో
దండుడు, నేడది బయలై
డండం డడడం డడండ డండం డడడం|
భగవంతునిబిడ్డననుచూ
నిగమము పఠియించి, దర్మ నిష్ఠత విడిచెన్ |
పగటి గలలు గని దిరుగగ
జగనుకు జుక్కలనుగాంచి , జగతిని మడిచెన్|( జగతి = జగతి పబ్లికేషన్)
17/09/2011
ప్రముదకు సుమనిష్టము, మరి
జమునకు సుమనోహరుడగు జగనిష్టము, ని
త్యము భూప్రదక్షిణలు జే
యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్| 
16/09/2011

దోచుకొన్న వాడె తోడు నీడగనుందు
నన్న గొఱ్ఱె వలెను కన్న వారి
వీడి ఖలుని జేర విచ్చేయు వారలు
నేడు సకల జనుల నాయకులగు| 
కన్న వారిపైన కరుణ జూపగలేరు
దోచు కొను నతనికి తోడు నీడ
నిల్చి, గణన జేయు నీలపు రాళ్ళను
పది తరముల కొఱకు పటుతరముగ|
(నీలపు రాళ్ళ = వజ్రాలు, ఎక్కువ మొత్తములో ధనము)

03/10/2011
గురువు గారి సవరణలకు ధన్యవాదములు
గాలి సొదరులు సి బి ఐ వారికి సమాదానములివ్వ కుండెను, అది మంచిదను కొనుచుండెను.
పలుకు బలకకుండెను లే
బలువుర తోడ మనగాలి పదుగురెదుట దా
పలుకుబడి పలుచనై, నే
డలుక, విభూషణము సుజనులగు వారలకున్|
04/10/2011
గురువు గారికి ధన్యవాదములు
నేటి దొంగలు, నీవు దొంగయన్న వారికి బదులిస్తున్న రీతిని జూడ వారి మునుపటి గుణములు బయటపడును ,
సుమతీ శతకపు పద్యము " వెనుకటి గుణమేల మాను" తీసుకుంటిని
గురువుగారు మన్నించాలి "మూల ముండు" ను "మూలములను " గా మార్చితిని
--------------------------------
తప్పులను జూప రోషము దన్నుకొచ్చి,
పురుషపుంగవ బలుకులే పరుష పదము
కుందనపురీతి, నేరుగ గాంచు జనులు
పాదపపు మూలములను పై భాగమందు|
14/10/11
౨౯/౧౦/౧౧



మామాయను పదవి కొఱకు
దామోదరు దిట్టు వాడె ధనవంతుడగున్|
ఈ మాయలతోడ జనుల
వేమార్చుటనేర్చినట్టి వేమన తమ్మా|
(మామా = మంత్రి , వేమన = విలాస పురుషుడు)
గురువు గారిని,వేమన గారిని క్షమించమని కోరుతూ|
గురువు గారికి నమస్కరిస్తూ
మూడు కాళ్ళ జంతువులు ఇంటనున్న మంచిదని తలచి మూర్కునికథ
-------
కందులవారికి గలిగెను
సందేహము,మూడు కాళ్ళ శునకము తోడన్
కుందేటికి కాలు విరవగ
కుందేటికి మూడు కాళ్ళు-కుక్కకువలెనే|
౨) నా కవితలు మూడుకాళ్ళ జంతువులవలెనున్నవి. 
కందుల వారికి దెలియక
కందపు నియమములు, పొందిక విరుపు లేకన్ |
సుందర కందము గాంచేన్
కుందేటికి మూడు కాళ్ళు-కుక్కకువలెనే|
  5 డిసెంబర్ 2011 12:03
అనవరతము రాముని సే
వను జేయు ఘనునకు భార్య వరుసలగునులే
దన బహ్మచర్య, భక్తియు,
హనుమంతుని భార్యలిద్దఱని చెప్పదగున్| 
ఫలితము లేదని ముదుసలి
బలుకును పరభాష నేడు బలువురితోడన్
తెలుగునకు దెగులు బట్టగ
"తెలుగేలా? యాంగ్ల భాష తీయగనుండన్," 
షరాశి వారు నన్ను క్షమించమని కోరుతూ,
---------------

హీనులకు శుభమ్ములిచ్చు శివుడనంగ
మేము హీనులమని మేషరాశి
వారు ముందు నిల్చి, వదల బొమ్మాళి వ
దల యనగ, జనులకు దైవమేది?
( మేషరాశివారు = రాక్షసులుగా బావించగలరు)
  12 డిసెంబర్ 2011 10:52 ఉ
శ్రమయనక మన హజారే
సమరమునే కోరినాడు, శాంతిని పొందన్
తమ దుర్గతి దొలగు సమా
గమమును జూడ జనులెల్ల గర్జించిరిలే|
( సమాగమమును = మంచి రోజు) 


japan pai

             ఆ  :  కష్ట పడిన గాని కలుగదు సిరియని 
                     ఇష్ట మీర మెడకు కష్ట మునను
                     నిష్ట తోడ గట్టి నట్టి దేశం నేడు 
                     నష్ట వర్ణ విధము కష్ట మౌను !
             ఆ : మంచి పేరు ఉన్న ; ముంచితివి జపాను 
                   పాడు పడ్డ గొంప నేడు కష్ట 
                   మెరిగి నట్టి జనులు మరల నిలిచెదరు
                    జూడు తనువు గుడిగ జేసి విడచి !
           ఆ :   సకల భూతములను చెలిమితో బంధించి 
                  సకల జగతి కొఱకు, సకల వస్తు 
                  వులను సాటి లేని విధమున సృ ష్టించి ,
                   దైవ కృపలు లేక దయ్య మిరి !
           ఆ :  ప్రళయ కాల మందు బ్రమలు తొలగిపోయె
                 నష్ట మైరి చూడు నేటి జనులు 
                 గోడ కట్టి నాపగలరా సముద్రుడను ?
                 మాయ లోన పడ్డ మనుజుడితడు !
          ఆ:   కాల ధర్మ మందు గడతేరి నారిందు 
                తేనె లోన యీగ తిరిగి నట్టు 
                తిరుగు చున్న భూమి ; మరు భూమి యేనయ ,
                కాల ధర్మ దెలియ గలుగు మేలు !