ఆ : కష్ట పడిన గాని కలుగదు సిరియని
ఇష్ట మీర మెడకు కష్ట మునను
నిష్ట తోడ గట్టి నట్టి దేశం నేడు
నష్ట వర్ణ విధము కష్ట మౌను !
ఆ : మంచి పేరు ఉన్న ; ముంచితివి జపాను
పాడు పడ్డ గొంప నేడు కష్ట
మెరిగి నట్టి జనులు మరల నిలిచెదరు
జూడు తనువు గుడిగ జేసి విడచి !
ఆ : సకల భూతములను చెలిమితో బంధించి
ఆ : సకల భూతములను చెలిమితో బంధించి
సకల జగతి కొఱకు, సకల వస్తు
వులను సాటి లేని విధమున సృ ష్టించి ,
దైవ కృపలు లేక దయ్య మిరి !
ఆ : ప్రళయ కాల మందు బ్రమలు తొలగిపోయె
నష్ట మైరి చూడు నేటి జనులు
గోడ కట్టి నాపగలరా సముద్రుడను ?
మాయ లోన పడ్డ మనుజుడితడు !
ఆ: కాల ధర్మ మందు గడతేరి నారిందు
తేనె లోన యీగ తిరిగి నట్టు
తిరుగు చున్న భూమి ; మరు భూమి యేనయ ,
కాల ధర్మ దెలియ గలుగు మేలు !
No comments:
Post a Comment