Thursday 10 March 2011

nagarajevanam

      తే :నగర మందు  జీవన మది    నవ్వు లాట 
           యగును హరి కైన సిరి లేక; యావిరి యగు
           నాశలు కరి ముఖునకు; లాభ మందగలరు 
           విలువల వలువలు విడచి వీగు  వారు  !
    తే : తెలుగు లిపి తోడ ఛందస్సు తెచ్చు సుంద
          రాకృతిని; అలంకారములద్దు  సోయ
          గాలు, వ్యాకరణంబులు గన్ను లౌగ
          వినిన వెంటనే వీనుల విందు జేయు |
  సే : ఆధునిక జ్ఞాన మందరి మదిలోన రామ బాణమువలె రణము జేయ
        కుర్రకారంతయు కార్తి కుక్కలవలె రాత్రింబవళ్ళు దిరుగును, వీరు 
        అన్నపానియము, అమ్మానాన్నలను,అందర్ని  నొదలి ప్రేమదేశ మందు 
        సర్వవ్యసన బానిసై మనః శాంతియు గరువై వికారపు కట్టు బాట్ల
ఆ :   తోడ మంచి చెడులు దెలియక సంకర
        జాతి చెలిమి యందు జీవనంబు
        తాలిబాన్ల మధ్య తరుణివొలెయని ఈ
        జ్ఞాన హీనులకు విజ్ఞాన  మేది ?
 సి : కాసిమో పాలిటన్ కారడవిన చూడు వసుదైక సంతతి విధులు , {రాదు
       ఆమని ( జీవన మందున కొదరి కెన్నడు } వీడదు కాంచనంబు )
       తిరిగేది బెంజిలో త్రాగేది గంజినే , చదువులధికమైన చవట లేను  
       సంపాధనధికులు సంస్కార హీనులు, తరుణులు దిరుగును తుక్కు బట్ట 
  ఆ : గట్టి, చూడ రాని కన్నె అందాలను 
       జూపి , ఆకు వక్క సున్న మైన 
       విడువ లేరు వీరి విధము లొక్కటి యైన 
       వీడును తమ కన్న వారి నైన | 
   
ఆ : పట్టు పరుపు పైన పాలిండ్ల పైనాశ
      బడ్డ మనుజుడు తన పరువు తోడ
      పతనమౌను వంశ పరివార నాడ ప్ర
      తిష్ట, నట్టి వార్కి గష్ట మౌను |
    

No comments:

Post a Comment