Sunday 6 March 2011


తేటగీతి
సత్య మెరుగక నిత్యము నిత్య నంద
నామ జపమును  సేయంగ నేమి వచ్చు
తిరిగి తిరుగంగ కలుగును  నారి పొందు
కామ మధికమై కడతేరు కాయ మందు

ఛందస్సుతో ఇది నా మొదటి పద్యం. ఇది నా తెలుగు గురువు గారైన "  శ్రీ మొలుగు పార్ధసారధి" గారి కి మరియూ నా స్నేహితుడు " చెరసాల రేణుకా ప్రసాద్ " కు   అంకితం .
తే : యోగ సంకల్ప మనుజుడు యోగి యౌను
బోగ సంకల్ప మనుజుడు రోగి  యౌను
మలము పోనిచో దేహమే హాల హలము
రోగి యైనచో  దీపమే ఆగి పోవు !

తే : నల్ల ధనముఫై అందరు చల్ల జేయ 
నల్ల ధనపు నేతల అల్ల బెల్ల ములకు 
మల్ల గుల్లాల మన్మోహన్ మెల్ల మెల్ల 
గడుగు లేయగా చిక్కరు పిడుగు లెల్ల !
ఆ : సిటి జనులమనేటి నేటి జనులు తమ 
నాగరీకులన్న నిజము తెలియ 
యోగ సాధనమున యౌగులై సాధించె
దరు సమస్య రహిత దేహమన్ను !
ఆ : చెట్టు నీడ లేక సెగలు పొగలు కక్కు 
నగర జనులు , ఊరి నడుమ నీడ
లేని పురజనులు తలా పిడికెడు తాము 
సేయు తప్పే యన్న సత్యము సుమి !
ఆ : కాయ మందు ప్రాణ వాయు వున్న వరకు 
కాయ ధర్మ మెరిగి కష్ట పడిన 
ఆది జనుల యొక్క ఆరోగ్య సిరుల ల 
గుట్టు ఏమి యన్న గట్టి యోగ !
ఆ: కాల కూట విషము మలమన్న సంగతి
ఇల్లు కట్టి చెప్ప, ఒళ్ళు మరచి
ఉప్పు కప్పు జనులు నొప్పుగా తింటున్ టె
జబ్బు వృద్ధి యగును డబ్బు లాగ !



                     







1 comment:

  1. బావుందండి. అధిక టైపాటుతోఅదిక అనిపడింది చూడండి. మీరు ఈ బ్లాగు http://kandishankaraiah.blogspot.com/ తప్పక చూడాలి మరి.

    ReplyDelete