Thursday 11 February 2016

గీత ద్వయ ద్విపద గర్భ సీసము

శ్రీ రాప్తాటి ఓబిరెడ్డి గారి శ్రీనివాస చిత్ర కావ్యము లోని పద్య ప్రేరణ తో నా మిడిమిడి జ్ఞానముతో  శ్రీనివాసుని గొల్చుచు శ్రీవాణి స్తుతి గర్భముగా నా ప్రయత్నము .  

     గీత ద్వయ ద్విపద గర్భ సీసము 

 సీ: శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చుర 
----గోప బాలక వేగ గ్రోల రార !
గాన లోలుడు ! గాన కైంకర్య మందున 
---గాత్ర శుద్ధి యగును ఘనముగాను !
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కులు 
----జిహ్వ బల్కుచు నుండు స్థిరము గాను!
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందున 
----పొంక మలర ముక్తి పొంద గలవు !

గీ: పూలు దండిగ దెచ్చి పూమాల వేయ
మూల మెల్లను దెల్పు భూపాలు డతడు ! 
భక్త వర్యుల గాచు భవ్య ప్రదాత !
ముక్తి నిచ్చుచు నుండు ముప్రొద్దు లందు !


గర్భ గత గీతము ! శ్రీనివాసుని పై 

శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చు 
గాన లోలుడు ! గాన కైంకర్య మందు 
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కు
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందు

గర్భ గత గీతము 2 శ్రీ వాణి స్తుతి

గొల్వ శ్రీ వాణి మెచ్చుర గోప బాల !
గాన కైంకర్య మందున గాత్ర శుద్ధి !
జేయు కొంగ్రొత్త బల్కులు జిహ్వ బల్కు!
మున్గు శ్రీసేవ యందున  పొంక మలర !  

గర్భ గత ద్విపద 

శ్రీనివాసుని ! గొల్వ శ్రీ వాణి మెచ్చు
గాన లోలుడు ! గాన కైంకర్య మందు 
గొల్చు మౌనిని ! జేయు కొంగ్రొత్త బల్కు 
చీల్చు చీకటి ! మున్గు శ్రీసేవ యందు 
పూలు దండిగ దెచ్చి పూమాల వేయ
మూల మెల్లను దెల్పు భూపాలు డతడు ! 
భక్త వర్యుల గాచు భవ్య ప్రదాత !
ముక్తి నిచ్చుచు నుండు ముప్రొద్దు లందు !

శ్రీ శ్రీ చింతా రామకృష్ణా రావు గారి ఆశీస్సులు .

ఆటవెలది పంచక సీసము.

సీ.  ప్రీతి సీసమునను గీత ద్వయంబును 
     - ద్విపద కూడను వ్రాసి తేజరిలిరి.
మీదు గర్భ కవిత  మేలుగా నున్నది 
   - మీదు కృషిని మెత్తు మిగులు గాను.
రేపు కలవ వచ్చు, ప్రీతితో మహితాత్మ! 
    - వరప్రసాద! మనసు పంచవచ్చు.
ఆట వెలది కూడ హాయిగా వ్రాయండి 
    - సీసమునను మీరు ధ్యాస నిలిపి.
ఆ. గణము గుణముఁ గల్గి గణుతింపఁబడియెడి, 
    - చక్కనైన కవిత సరసు లెంచు.
కంది కులజ మీర లందంబుగా చిత్ర 
  - బంధమల్లగలరు. బంధురముఁగ..

Friday 5 February 2016

పాద గోపనం.... నాల్గక్షరముల కొకటి నాల్గవ పాదము

పాద గోపనం 

కందము మది నుండ కల్ శం సొగసు ను 
దారి ! రా ! మను నవారి రా 
పోక ఆర్త జూచు భూమీశ ! బంగారు !
  
నాల్గక్షరముల కొకటి నాల్గవ పాదము   



ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రక్తమును ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.

ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

రామ చంద్రుని పాదము రక్తి తోడ 
బట్టి, లంకకు వారధి గట్టి వీర
వానరుల తోడను వెడలి వైరితతుల 
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !


ధనికులదిక మయినయట్టి ధరణి యందు 
కులము బలమని దిరుగెడి ఖలులను,తన 
వారనక కలియుగమందు వైరి తతుల
రక్తమును ద్రాగు వాడె పో భక్తు డనగ !