Monday 28 April 2014

దీని బావము దెలియ వలెనయ్యా... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
 
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

దీని బావము దెలియ వలెనయ్యా  ! నరులార మీరు ! దేహ వాసన విడువ గదరయ్యా ! దీని బావము దెలియ లేకను ! దేహ వాసన విడువ జాలక ! గాఢ యోగము దాల్చి పుడమిని ! మూఢులై చెడి పోవ నేలను !!  దీని !! 

వురుము  లే నొక మెరుపు మెరిసే ! మబ్బు లే నొక వాన గురిసెను ! వాన గురిసిన కారణము చే ! సోమ సూర్యులు సాము జేసిరి  !! దీని !!

ధారుణి తల మందున నవ ద్వార  ! వర పుర మందు నిద్దరు  ! వీర వర్యులు గూడి ! ఆకస వీధులకు నపు డెగసి పోయిరి !! దీని !! 

అర్థ రేయిని లేచి ఖేచరి ! ముద్ర యోగము జూచు వేళలో  ! రుద్ర రామా భద్రులకు  ! యే రూప నామ క్రియలు లేవు !! దీని !!    
  
మూడు గెలిచే మూడు రోసి  ! మూడు ముడా డింట నిలచే !  ఏడు కిటకీల మేడ మీదా ! యెక్కి చూడగా తాను తానై ! ! దీని !! 

యి వ్విధంబున నెరుగ జేసిన  ! హిత గురువు మంతిన వేంకట ! యతియు మర్మము ! దెలియకను ! మతి లేక జెడి పొయినారు కొందరు ! ! దీని !! 

వాసిగా శ్రీ యడ్ల రామా !  దాసు దెల్పిన తత్వ మార్గము ! ఆశతో గను గొన్న వారికి ! అపరిమిత సౌఖ్యంబు గల్గును !! దీని !!    

No comments:

Post a Comment