Saturday 5 April 2014

లేరా నాపాలి శ్రీ వీర రాఘవ... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తి కీర్తనలు ,
మల మారుతి రాగం = చాపు తాళం 
=================*===================
లేరా నాపాలి శ్రీ వీర రాఘవ ! లోకాధార మాధవ శౌరి లేరా !!
కారుణ్య సాగర కలుష విదూర నను ! కరుణింతువు గాని  లేరా !!లే !!

అత్రి వశిష్టాది మునులు మీ కృప గోరి ! పాత్రూలై యున్నారు లేరా !!
పద్మమిత్ర వంశోద్భవ గాత్ర నీరద ! చారిత్ర పావిత్ర లేరా !!లే !!

తెల్ల టేనుగు వచ్చి వాకిట నున్నాది ! నల్లాని నా స్వామి లేరా !!
కల్ల గాదు జగ మెల్ల యేలేడు ! రఘు వల్లభ యిక నిద్ర లేరా !!లే !!

అభ్యంగనము నీకు అనురంగ జేసెడు ! అనువైన వేళాయె లేరా !!
సభ్యు లందరు గూడి  సాక్షాత్కరిం చీరి! సంశయముల మాన్ప లేరా !!లే !!

పరమ భక్తులు నిన్ను ప్రార్థించు చున్నారు ! పన్నగాధిప తల్ప లేరా !!
వర భద్రా చలమున శరణాగత త్రాణ ! బిరుదు బూనిన తండ్రి లేరా !!లే !!

నిరతము సంసార భరము బాపెడు ! భక్త వరద సీతా రామ లేరా !!
నరశింహదాసుని వెరుపకు మని వెంట ! దిరుగు వేళాయెను లేరా !!లే !!               

No comments:

Post a Comment