Saturday 5 April 2014

అమ్మా సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ..... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తి కీర్తనలు ,
భూపాల రాగం = ఆట తాళం 
=================*===================
అమ్మా సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ ! అమ్మ బంగరు బొమ్మ లెమ్మా !!
అమ్మారొయిమ్మూగ అరుణోదయం బయ్యె ! అమ్మాల గన్నమ్మ లెమ్మా !!అ !!

తెల తెల్ల వారెను కలకల మని ! పక్షి కులము లెల్లడ లేచె లెమ్మా !!
కిలకిలా రవమూలు చిలుకాలు చెల రేగి ! జలజాక్షి జానకీ లెమ్మా !!అ !!

సతి పతుల మిము జూడ సాధు సజ్జను లెల్ల ! సంతోషమున వచ్చె లెమ్మా !!

సతతాము మీ పాద సరసీజ యుగళము ! స్తుతి యించి తరియింత్రు లెమ్మా !!అ !!

భక్తు లందురు గూడి ప్రార్థింపు చున్నారు ! భక్తా పరాధీన లెమ్మా !!
భక్త శిఖామణి పావని యరు దెంచె ! ముక్తి ప్రదాయనీ లెమ్మా !!అ !!

బ్రహ్మాండ మలరంగ వహ్ని వెలువడి మించు ! జిహ్వేతర చరిత లే లెమ్మా !!

బ్రహ్మరుద్రేంద్రూలు ప్రస్తుతింపగ నొప్పు ! బ్రహ్మ స్వరూపిణీ లెమ్మా !!అ!!

వెల లేని సొమ్ములు వెలదీరా  ధరియించు ! వేళాయె మాయమ్మ లెమ్మా !!
కేలా నద్దము బూని లీలా శ్రీ రాముని ! మేలు గొలుపగ నిద్ర లెమ్మా !!అ!!

ముసిముసి నగవులు పసి పిల్లాలిద్దారు ! కుశలవులు లేచిరీ లెమ్మా !!  

అసహాయ శూరులు ఆకలి గొని నీదు ! దెన చూచు చున్నారు లెమ్మా !!అ!!

మమ్మూ మరువకమ్మ మాయమ్మ సీతమ్మ ! నమ్మి యున్నా మమ్మ లెమ్మా !!
నమ్మిన వారల నరసి బ్రోచుట నీదు ! సొమ్ము గాదటె తల్లి లెమ్మా !!అ!!

సచరా చరంబైన జగ మెల్ల సృజియించి ! పోషించు నడి పించు చిర చిద్రూపిణి లెమ్మా !!

లేచి చిర్రావూరు కామేశ్వర దాసూని ! బ్రోచు వేళాయెను లెమ్మా !!అ!!  

No comments:

Post a Comment