Monday 7 April 2014

మత్త కోకిల చరణములు -2

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

ఆది దేవుని విశ్వ రూపుని యంత రాత్మగ గొల్వరా !
వాద భేదము లెన్ని యున్నను వాని జెంతకు జేర రా !
వేద వేద్యుడు కాల చక్రుడు విశ్వ మంతయు నిండె రా !
పాద పద్మము బట్టి యుండిన పాడి పంటల నిచ్చు రా ! 1!

రాక పోకల మర్మ మంతయు లాఘవమ్మున జెప్పెరా!
చీక టెల్లను పార దోలెను జేతి తోడను జూడరా !
శోక మందున సౌఖ్య  మందున సోమ సింధుని బిల్వరా !
లోకు లెల్లరు గాకు లైనను లోక నాధుడు గాచు రా !2!

వేకువందున బల్క కుండిన విష్ణునామము శిష్యుడా ! 
కాకు లెల్లను గూడు జేరగ గష్ట మొందెను జూడరా !  
యా కుచేలుడు చెంత జేరగ యార్తి నంతయు  దీర్చె రా !
యేకు లెల్లను మేకు లైన గజేంద్రుడుండెను జూడరా !3!

ఆర్తి తోడను గొల్చు వారిని యాద రమ్మున బిల్చెరా !
కీర్తి నొందిన సార సాక్షుడు కీలు దెల్పుచు నుండెరా !
కర్త వీవని  వేడు వారల కష్ట మెల్లను దీర్చె రా !
గుర్తు బట్టిన వారి నెల్లను కొండ దాపున జేర్చె రా !4!

చెట్టు లెక్కిన చిత్ర భానుని చిన్ని కృష్ణుని జూడరా !
కట్టి వేయగ గోప బాలుడు కష్ట మొందక నుండెరా !
పట్టు వీడక పంక జాక్షుని పాద పద్మము బట్టరా !
బెట్టు జేయక రట్టు దీయక ప్రీతి తోడుత నుండు రా !5!  
     
రామ నామము రామ నామము రక్ష యన్నది నేర్వ రా !
రామ నామము తామ సమ్మును రట్టు జేయును జూడరా !
రామ నామము కష్ట మందున రామ దాసుని గాచెరా !
రామ నామము జాలు నొక్కటి రామ భద్రుని జేర గా ! 6!

No comments:

Post a Comment