Tuesday 29 April 2014

దీని బావము దెలియరా దుర్గుణములిక నెడ బాయరా... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట

==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

దీని బావము దెలియరా! దుర్గుణములిక నెడ బాయరా ! దీనర్థమే పర మార్థమని! నీ ఆత్మలో నేరి గుండరా !!  దీని !! 

వాద భేదము మానరా! మన మొచ్చినది పొరుగూరు రా !  ఈ పక్షి దెల్పిన మాట లన్నియు తక్షణం యోచించ రా !! దీని !!

ప్రాకటముగ నమ్మరా! ఈ లోక మంతయు మాయ రా ! రాక పోకలు లేని చోటను! రాజువై కూర్చుండ రా !! దీని !! 

మాయ మాటలు మానరా ! యిది మట్టి బొమ్మని తెలియరా ! దేవుడే యీ పాడు ఘటమునకు ! జీవు డాయెను చూడ రా  !! దీని !!    
  
అడవి పందులు మూడు దనతో ! ఆటలాడెను జూడరా ! కాచి యున్న కాకి పిల్లను! గుటుకుమని దిగ మ్రింగె రా ! ! దీని !! 

మదపు టేనుగు లారు జోడు! పొదల చాటుకు జేరె రా  ! ఈ  గుట్టు తెలిసిన గ్రుడ్లా గూబ గుటుకు మని దిగ మ్రింగె రా ! ! దీని !! 

తొమ్మిదీ కాలువల చెరువు లో !దున్నలై పరుండె రా ! చెరువు వొడ్డున నున్న! కొంగ చేప లన్నిటిని మ్రింగె రా  !! దీని !!  

కొండ చిలువలు రెండు గూడి ! మొండి కెత్తెను జూడ  రా! గండు చీమొకటోచ్చి రెంటిని ! గరచి తిన్నగ ద్రిప్పెరా !!దీని !!

కన్నులకు  గనపడదురా! సద్గుణము సాహసు రాలురా ! మేరు శిఖరము చాటు నుండి! యెగురు చున్నది జూడరా !!దీని !!   

దీనిని గ్రహించుటకు దుష్టులకు !వశ మవదు రా ! నేను నినను భేదము డిగిన! దీని గనుగొన నెంత రా!! దీని !!

ధరలో శ్రీ కాకినాడ పురము నను కాపురము రా  ! గురు మాట తెలిపిన శ్రీ యడ్ల రామదాసుని వర కవిత్వము దెలియ రా !! దీని !!

No comments:

Post a Comment