Monday 7 April 2014

శ్రీ కృష్ణ - గోపికా సంవాదము.


బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

శ్రీ కృష్ణ - గోపికా సంవాదము 

కొంచె మైనను జాలి లేదులె గోప బాలుని కేల నో !
గాంచ కుండిన మానసమ్మున గాయ మాయెను జూడ రా !
పంచ దారను జివ్హ యెందుకొ వంచ కుండెను మాధవా !
మంచి మాటను జెప్ప కుండిన మాయ గాడివి మాధవా ! 1!

కట్టి వేసెను రాతి బండకు కష్ట మాయెను గోపికా !  
వట్టి మాటలు కావు కావివి పట్టి జూడవె గోపికా !  
పట్టి జూడక నీవు నిల్చిన బాధ హెచ్చెను గోపికా !  
రట్టు జేయక చెట్టు వద్దకు రమ్ము  రమ్మిక గోపికా !  2!

మాయ గాడివి పొమ్ము పొమ్మిక మాయ మాటలు వద్దికా !
మాయ జేయుట నేర్చి యుండిన మంత్ర గాడివి మాధవా ! 
మాయ లందున మోస పోతిని మంచి వాడివి కాదు రా !
మాయ మాటల తోడ నామది మార్చ లేవుర మాధవా ! 3!

వద్దు వద్దిక దొడ్డ మాటలు వద్ద నిల్చితి గోపికా !
రద్దు జేయక ముద్దు మాటలు  రమ్ము వేగమె గోపికా !
వద్ద నిల్చితి జూడ మంటిని వాజ్య మేలను  గోపికా !
ముద్దు మాటలు శూన్య మైనను ప్రొద్దు పోవదె  గోపికా !4!

తోడ నుండిన కూర్మి నొందితి, దూర మైనను మాధవా !
గోడ నైతిని వాడ వాడల గూర్మి నొందక  మాధవా !
వీడు చుంటిని వాద మెల్లను వీడ వద్దుర మాధవా !
వీడి యుండుట వల్ల కాదుర వేడు చుంటిని మాధవా !5!

No comments:

Post a Comment