Monday 22 April 2019

క కారాద్యక్షర కందము

కందము
కవచము కబళించెను కద ,
కవగొనె కలుషమ్ము ఖలుల కలయిక కతమున్
కవి సన్నుత! కరి వరదా!
కవిగొంటిని కర చరణము కరుణను కనుమా!

అర్థం :- కవచము = బాహ్య శరీరము , కబళించెను = మనసును వశపరచు కొనెను, కవగొనె=కూడెను , కలుషమ్ము = మాలిన్యం , ఖలుల కలయిక కతమున్ = దుష్టుల స్నేహము కారణమున , కవిగొంటిని = సహగమనము చేసితి , కర చరణము = తీరము చేర్చు పాదము , కవి సన్నుత! = కవులచే సన్నుతింప బడిన, కరి వరదా! = కరి రాజును కాపాడిన దేవ , కరుణను కనుమా= కరుణతో నను కాపాడు స్వామి .
భావము :- బాహ్య శరీరపు అందములో పడి నా మది పట్టు దప్పెను, దుష్టుల స్నేహము కారణమున నా మది కలుషితమైనది. భవ భయములు తీర్చు పాదములు పట్టితిని, కరి రాజును కాపాడిన రీతి నా పై కరుణారసము కురియ చేయుమా దేవాదిదేవ!

No comments:

Post a Comment