Monday 22 April 2019

సపంచ వర్గీయ (క, చ, ట, త, ప వర్గం) కంద పద్యము

కందము
కాకము కాకమె, కాదుగ
కేకి నటన కఠము తోడ గీతను బంచున్
చీకటి గాముని నమ్మక
మేక గమనమునను గనుడు మేదిని మామా!
***
అర్థం :- మామా = మామ, కాకము కాకమె = కాకి నెమలీకలు పెట్టిననూ కాకియే, కేకి నటన కఠము తోడ = నెమలి నాట్యము కంఠస్వరము తో, గీతను బంచున్ = అమృతము పంచును , చీకటి గాముని నమ్మక= మ్రింగే రాహువుని నమ్మకు, మేదిని = ఈ భూమిపై, మేక గమనమునను గనుడు= ముళ్ళలోని ఆకులను తినును కానీ, ముళ్ళను తినదు, ముళ్ళను ఆకులను కొనదు.
భావము :- మామ,కాకికి ఎన్ని నెమలీకలు పెట్టిననూ కాకియే, నెమలి తన నాట్యము మరియు కంఠస్వరము తో, అమృతము పంచును. రక్తము త్రాగు రాహువు ఎంత మంచిగా నటించినా నమ్మకు,ఈ భూమిపై, మేక గమనమునను గనుడు ముళ్ళలోని ఆకులను తినును కానీ, ముళ్ళను తినదు, ముళ్ళను ఆకులను కొనదు ఎన్నడూ. మేక వలె తెలివైన నిర్ణయం తీసుకో..
నిన్ను వంచించు వానిని నమ్మ వద్దని చెప్పుట.

No comments:

Post a Comment