Monday 22 April 2019

అపంచ వర్గీయము (క చ ట త ప రహితము)

కందము
సారస విరి సాయ! సరస
వైరి హర! యశస్వి వరలు వాళి విహారీ!
సారా ! శ్రీవర! లావరి!
శూర! యరయు శేషసాయి! సురవర! శౌరీ!

అర్థం :- సారస విరి సాయ = తామర పూ బాణమా ,
సరస వైరి హర = ప్రక్కన నుండు శత్రు సంహార, యశస్వి వరలు=కీర్తితో ప్రకాశించు, వాళివిహారీ = గోవుల బాటను విహరించు వాడ, సారా = శ్రేష్ఠా , రిరక్షు = రక్షించు వాడవు,
లావరి = బలవంతుడా , శూర = రణము చేయ ఆశక్తి గల వాడ, శేషసాయి= సర్పరాజ ప్రభువా , సురవర= దేవతలలో శ్రేష్ఠా, శౌరీ= కృష్ణా! అరయు! = కాపాడు ,

భావము :- తామర పువ్వు వంటి సుకుమారమైన వాడ,
దరి నుండు శత్రు సంహారుడవు, కీర్తితో ప్రకాశించుచు,గోవుల బాటను విహరించు వాడ, అందరినీ రక్షించు వాడవు, బలవంతుడవు, శత్రు తతిని దునుమ రణము చేయ ఆశక్తి గల వాడ,శేషుని ప్రభుడవు, దేవాదిదేవ! రక్షింపుము.

No comments:

Post a Comment