Thursday 19 January 2012

శంకరాభరణం: సమస్యాపూరణం - 597 (చెడుగులతో దేశమెల్ల)

శంకరాభరణం: సమస్యాపూరణం - 597 (చెడుగులతో దేశమెల్ల)
గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
మన నేతల తొందరపాటు నిర్ణయములతో, బహుళజాతి కంపెనీల నిర్వాకములతో
నేడు మనదేశము అభివృద్ధి జెందినట్లు కనిపించెనా అది శూన్యమే
-----------
మిడిమిడి జ్ఞానపు నేతలు
వడివడిగా నిర్ణయముల వడ్డనతోడన్
నడతెంచిన పరదేశపు
చెడుగులతో దేశమెల్ల శ్రీకరమయ్యెన్
18/07/2012

గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ

క్రొత్త కాపురములోన కలతలను కూతురి ద్వారా తెలుసుకుని, అత్తమామలు
అల్లుడి తప్పులను సరి జేయగ  వచ్చిరి . వారి రాకతో దంపతుల మధ్య యున్న వైరము పెరిగిపోయే .

కాపురములోన వచ్చెను కలతలు, దన
పుత్రిక కబురు విని వారు పొదిలి యేడ్చి
నెపము లెంచ ముందుగ వచ్చిన పని సఫల
మయ్యె , వైరము హెచ్చెను యా దినమున .
19/07/2012
గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
గురువు గారు పద్య పాదములను మార్చుట శ్రీ పండిత నేమాని వారిది . వారి యడుగు జాడలలో నడచుటకు చిన్ని ప్రయత్నము . ఇది వారి రామాయణము గొప్పదనము దప్ప నాది కాదు.
నాకు తెసిన ఒక కుటుంబములో కోడలు అత్త ముట్టిన, పట్టినవి ముట్టదు . ఆ పై కోపతాపములను ప్రదర్శించును .
పుట్టింటి వైభవమును రోజులకొలది జెప్పును .     ఆ యత్త
------
కోపతాపములను జూపు గోడలి గని
ముగిసె నాషాడ మని యేడ్చే , ముద్దు గుమ్మ
మురిసె పతి యింట పాదము మోపి, దెలిపె
పుట్టినింటి సంగతులను గట్టిగాను .
-----
అత్త గారు ముగిసె నాశాడ మని యేడ్చే ,
ముద్దు గుమ్మ మనసు హద్దు దాటె
పతిని గాంచి దెలిపె నతి వేగమున పుట్టి
నింటి కబురులెల్ల  నింపుగాను .
24/07/2012


గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
తప్పులను జూపి ,సవరణలను జేయ ప్రార్థన 
------
 పుడమి భారమునను ముడువగా వచ్చిన
         వామనుడవు నీవు భక్తపాల
మర్మములను దెల్పు కూర్మ రూపు డవని
        వార్థి దాటె జనులు భక్తపాల 
పుడమి జనుల కెల్ల నడిగిన వరమిచ్చు
        పరమ గురువు నీవు  భక్తపాల 
దేవ దానవులకు మావటి వని విని 
       బడయ వడిగ వచ్చె భక్తపాల 
వైరి వర్గములకు కూరిమి తోడను 
       ముక్తి పదము నిచ్చు భక్తపాల 
దురితములను దీర్చు ధర ప్రాణి కోటికి 
      భుక్తి నిచ్చిన ఘన భక్తపాల 
-------
జిడ్డు గడలి యందు శేషశాయనునకు 
     సేవజేయు సిరికి జెప్ప కుండె,
శంఖ చక్ర గదల వంక జాడక పారు 
    చుండె , మకరి  నోట సోలు చున్న 
కరి మొరలను విన్న కంజ నేత్రుడు క్షీర 
   సాగరమును వీడి , సాధు రక్ష 
కుడు ముముక్షువులను పుడమినందున గాచు 
  భాను తెజమువలె, భక్త వత్స 
లుండు భక్తుల మొర లువిని  దశావ తా 
  రములు దాల్చె నుగ  ధరా తలమున 
రాక్షసమును జంపి రక్షించు నీ దివ్య 
  నామ మంత్ర మహిమ నరులనెల్ల |


శ్రీ నేమాని గురువు గారి దీవెనలు

మీ ప్రయత్నములను మెచ్చుచు శ్రీహరి
ఊతమొసగు గాక ప్రీతి తోడ
మీ రచనము మెండు మేలొన గూర్చుత
మీకు నెల్ల యెడల నో కవివర!

 





 


No comments:

Post a Comment