Sunday 22 January 2012

శంకరాభరణం: సమస్యాపూరణం - 600 (కోటికి పడగెత్తికూడ)

శంకరాభరణం: సమస్యాపూరణం - 600 (కోటికి పడగెత్తికూడ)
గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి, కవులందరికి ధన్యవాదములు,
యతిస్థానము తెలియక ప్రాసనియమము తప్పినది క్షమించగలరు.
కోటీశ్వరుడగు కృష్ణుడు
కాటుక కనులవెలయాలి కవ్వింపులకున్
దీటుగ నోటుల విసరగ
కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్
11/07/2012

గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి  ధన్యవాదములు,
పాదాభివందనము జేయుచూ

హాస్యము గా

తల్లి నేర్పు విద్య తప్పుగా వచ్చు గా
ని, దన హితులు జెప్పు నీతు లెల్ల
నిజము కాదు గాని, నిగమము బాటించు
దండ్రి నేర్పు విద్య తప్పు గాదె

13/07/2012


గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి  ధన్యవాదములు,
పాదాభివందనము జేయుచూ


వార్త : పసికందును చెత్త కుండీలో పారవేసిరి

పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె త్రోవ
యందు నడచి బోవ, ముందు వెనుక
జూడ, లేదు పరుల జాడ, వాడకు దెచ్చి
దెలిపె నా విషయము తెగువ తోడ .

17/07/2012


గురువు గారికి జన్మ దిన శుభాకాంక్షలు ,గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి  పాదాభివందనము జేయుచూ


నేమాని వారి వృత్తములో  హాస్యముగా
రచయిత తస్లిమా , సల్మాన్ రష్డిల పై దాడులను

కలము నుండి జారి పడ్డ కఠిన మైన పదములే
బలము నిచ్చు మత ఖలులకు, ఫలము గాదు సత్యమున్
కలియుగమున దెలుప దలచ, కలుగు లోని యెలుకలా
బలుక బాష రాని వాడె పండితుండు  పుడమిపై |

20/07/2012


గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి  పాదాభివందనము జేయుచూ


వరంగల్ లో ఒక గ్యాంగ్ స్టార్ విజటింగ్ కార్డు ప్రింటింగ్ జేసి పంచుతుండెను.
అటు వంటి వారు కష్టములలో కాపాడగలరని భావించిన యువతి గిరిజ
----
కలియుగమున ఖలులు కీర్తి గాంచ , దలచె
సజ్జనుల సాంగత్యము 'జగతి ' నందు
పాడి గాదని దనను గాపాడి నట్టి
కపట గపిని వలచి గిరిజ తపము సేసె |

నలమల యడవి మధ్యన నడచు చుండ
యావు  త్రొక్కిన శివలింగ మైనది ఘన
పుణ్య క్షేత్రము,  వింతగా పుష్కరిణికి
జలము జేరు, నెమ్మది జేరు జనులకెల్ల |

అంతగునకు నిలయ మగు మహా నందికి
పరుగుతోడ రండి పావనమగు
జన్మ పుష్కరిణిన స్నాన మాడగనే స
కల సుఖములు బొందు కాయమెల్ల |












No comments:

Post a Comment