Thursday 1 May 2014

కనుగొంటి నమ్మా.... !

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ యడ్ల రామదాసు గారి భక్తిపాట
==============*================  
నాద నామ క్రియ రాగము = ఆటతాళం

కనుగొంటి నమ్మా ! బ్రహ్మము నాలో ! గనుగొంటి నమ్మా ! గనుగొంటి నమ్మాగురు కరుణా కటాక్షమున ! దనరూ చు సద్భక్త ! వరులు జూచేటి వాని !!గను !!

భయ మొంద కమ్మా ! మన పాలి దేవుని ! దయ గల్గెనమ్మా ! అయ్య నీ దర్శన ! మయ్యె దెటులని వేడ ! చయ్య నతని లో ! ప్రసన్న మయ్యెడి వాని !!గను !!  

పద్మాసనము నా ! యాపదన కలుగులు ! బంధించు కున్నా ! చిద్వి లాసమున ! యా  శృంగార పురి జొచ్చి ! గంగ యమునల మధ్య ! దొంగ వానిని రాత్రి  !!గను !!

విన్నారట మ్మా దేవుడు మనలో ! వున్నాడో  యమ్మా ! వన్నె మీరగ భువిలో ! చిన్న పెద్దల యందు ! యెన్నో విధంబులై ! యున్న చిద్రూపుని !!గను !!   

అందు న్నార మ్మా ! మంతీ న వేంకటార్యు లే కొమ్మా ! సందేహమేల! యీ సహస్రార వీధిని ! యిందు రమ్మని చిన్న ! ఈల గొట్టిన వాని  !!గను !!

ఆశా పాశము లా ! గురు వరుని కృప చే ! కోసీ నే రోసి ! వాసి మీరగను యడ్ల ! రామ దాసుడ నే ! ఒక దీక్ష చే గురు నీ ! వుపాసమున దేశకునీ !!గను !!  

No comments:

Post a Comment