Monday 5 May 2014

యేమయ్య రామ......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట
   
                                 కాంభోజిరాగం =జంపెతాళం
===================*======================
|| యేమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన నీమాయ దెలియవశమా|| యే||

అ||కామారి వినుతగుణధామ కువలయదళ శ్యామా రామ నీ మహిమలెన్నగ మాకు తరమౌన|| యే||


. సుతడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవు డతిబలుడ వనుచు కవులు క్షితిపతివనుచు భూపతులు గిలిచిరిగాని పతితపావనుడవని మతిదెలియలేరైరి || యే|| 

. చెలికాడవని పాండవులు విరోధివటంచు అల జరాసంధాదులు కలవాడవని కుచేలుడు నినుగొలిచె గాని జలజాక్షుడని నిన్ను దెలియంగలేరైరి || యే||

. నరుడవని నరులు తమదొరవనుచు యాదవులు వరుడనుచు గోపసతులు కధివరద భద్రాద్రిగిరినిలయ రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి|| యే||

No comments:

Post a Comment