బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు పుస్తకము లోని పాట
గౌళిపంతు రాగం= ఆదితాళం
===============*================
ప|| తెరతీయఁగరాదా నాలోని తిరుపతి వేంకటరమణ మత్సరమను ||తె||
ప|| తెరతీయఁగరాదా నాలోని తిరుపతి వేంకటరమణ మత్సరమను ||తె||
అ|| పరమపురుష ధర్మార్థమోక్షముల బాఱదోలుచున్నదినాలోని ||తె||
చ||౧.మచ్చము ఆకలిగొని గాలముచే మగ్నమైనరీతినున్నది |అచ్చమైనదీప సన్నిధిని మఱుగడ్డిపడి చెఱచినట్టులున్నది ||తె||
౨. ఇరవొందగ భుజియించు సమయమున నీగదగులురీతినున్నది | హరిధ్యానము చేయువేళ జిత్త ము , అంత్యజువాడకుఁబోయి నట్లున్నాది ||
తె||
౩.
వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది | వేగమెనీమతము ననుసరించిన త్యాగరాజనుత మదమత్సరమను ||తె||
సీ| శృంగారమేపార | శీతాంగ నామణి | మునునిజ| వామాంకమున వశింప
తనపాదుకలు శిరంబున|
మోసి మందర | హనుమంతుడతి భక్తి|
ననుసరింప
ధవళాత పత్రమాతత | ధనుర్భాణముల్ | దాల్చిలక్ష్మణుడు | కైదండనలర
సరి యిరుగడల | వింజామరంబులు బూని
| భరత శత్రుఘ్నులు | బరిడవింప
గీ| అనుప మోజ్వల రత్న | సింహాసనమున | కొలువు గూర్చుండి | కోటిసూర్య ప్రకాశుడై
వశిష్ఠాది ముని | సమూహముల తోడ | చెలగి రాముండు | పట్టాభషిక్తుడయ్యె
No comments:
Post a Comment