బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు పుస్తకము లోని పాట
మోహనరాగం= ఆదితాళం
============*=================
============*=================
ప|| అ|| దొడ్డరాచ బిడ్డడవై నందుకు | దొరికితి వౌనయ్యారామయ్యా
౧. దండి రాచకుల మండలిలో ఘన |కొండవనుచు నీయండచేరితిని| మొండిబండ ఉద్యోగంబాయెను | తిండిలేని చాకిరి మెండాయెను ||దొ||
౨. దిట్టమైన ప్రాపకమని నినునే |గట్టిగాను నెరనమ్మినదాసుడ |పొట్టకూటికే గతిలేదాయెను | వట్టిపోతురాజుల కొలువాయెను ||దొ||
౩.
పేరుకీర్తిగల ప్రభువులలో ఘన | పేరుగొన్న దొరవనినిను నమ్మితి | పొరుగూరు బిచ్చమీపూరనుదిని|నాపేరుజెప్పుకొని బ్రతుకుమటంటవి ||దొ||
౪.దాచచోటు లేకను నీదగ్గర |దాచుకొన్న బిక్షాటన ద్రవ్యము |
జూచిదోసమనిమదిలొనెంచక |దోచుకొందమని యోచనజేస్తివి || దొ||
౫.
విర్రవీగుచును వడివడిగా యా |వెర్రిగోపికల వరగృహములలో |
బొర్రనిండ కర్రావుల పెరుగును |
జుర్రమరగి దాసునిగనవైతివి ||దొ||
౬.
వాశిమీరగను పాములపాటి | నివాసులైన శ్రీదేవరవారిని | నమ్మియున్న నరహరిదాసుని | దరిజేర్చుమన్న పరదేశిని జేస్తివి ||దొ||
No comments:
Post a Comment