Tuesday 16 June 2020

కవిరాజవిరాజిత వృత్త గర్భ సీసము

కవిరాజవిరాజిత వృత్త గర్భ సీసము

అనయము ముంగిట యార్తిగ నిల్చెద యాపద బాపర యాలము నను
దొనరగ మ్రొక్కగ దుర్గతు లెల్లను దూరము జేయర తోసము నను
మననము జేసెడి మౌనుల వీడక మాన్యము లిమ్ముర మాలిమి నను
ఘనముగ జేరిన కన్నడి సేయక కాలహరా శివ కావు మిలను

బిల్వ పత్రముల్ దెచ్చితి ప్రీతి తోడ
పుష్పతతులను దెచ్చితి పూజసేయ
ముక్తి మార్గము జూపర భక్తతతికి
కరము నందించు మోహన కరుణ జూపి!

కవిరాజవిరాజిత వృత్త  ( నజజ జజజజలగ యతి 1-8-14-20)

అనయము ముంగిట యార్తిగ నిల్చెద యాపద బాపర యాలము నన్
దొనరగ మ్రొక్కగ దుర్గతు లెల్లను దూరము జేయర తోసమునన్
మననము జేసెడి మౌనుల వీడక మాన్యము లిమ్ముర మాలిమినన్
ఘనముగ జేరిన కన్నడి సేయక కాలహరా శివ కావు మిలన్

No comments:

Post a Comment