Tuesday 16 June 2020

విద్రుమలత గర్భ సీసము

విద్రుమలత గర్భ సీసము

కరుణను బ్రోవర! ఖరకర నుత! నాకరము నందుకో నిరుపమ గుణ నిధి !
కరదను దీర్చర !గరుడ గమన వాసుదేవ !వడివడిగా దీన రక్ష
నర వర సేవిత !నవకము నిడు సామగర్భుడ! వైరానుగత హృదయుడ!
దరమున గొల్వగ దరిసెన మిడు రామభద్ర! దీనావన భక్త పాల!

దినదినము తిరిగి తిరిగి దిక్కు లేక ,
శరణు జొచ్చితి గ్రక్కున సాధు శీల ,
కడు బడలి యున్న నను నీవు గాక యెవరు
ఆదుకొందురు రఘవర యార్త రక్ష!

విద్రుమలత వృత్తము ( నజననవ యతి 8)

కరుణను బ్రోవర!ఖరకర నుత నా
కరదను దీర్చర గరుడ గమన వా
నర వర సేవిత నవకము నిడు సా 
దరమున గొల్వగ దరిసెనమిడు రా !

No comments:

Post a Comment