Tuesday 16 June 2020

గూఢ చతుర్థ పాదము

"లక్ష్మీ సహస్ర కావ్యము " లోని గూఢ చతుర్థ పాదము చూచి నా ప్రయత్నం
నాల్గవ పాదం మిగిలిన మూడు పాదాలలోని అక్షరములలో గూఢమై యుండును.

అక్షరముల ప్రక్కన సంఖ్య నాల్గవ పాదంలో ఆ అక్షర సంఖ్యను తెలియ జేస్తుంది.
ఆటవెలది :=
నీ7తి లేని1 వారు నెర8తన5మున్ వేయు
జా9ల4మున్ అజయ్య 6 క్ష10మిత గల్గి
భద్ర2 గిరికి జేరు భక్తులన్ విడచియే 3
నిద్రయేల నయ్య నీరజాక్ష!

నీతి లేని వారు నెరతనమున్ వేయు
జాలమున్ అజయ్య  క్షమిత గల్గి
భద్ర గిరికి జేరు భక్తులన్ విడచియే 
నిద్రయేల నయ్య నీరజాక్ష!

నెరతనము = నేర్పు, జాలము = వల , అజయ్యము = నశింపనిది , క్షమిత = ఓర్పు

No comments:

Post a Comment