Tuesday 16 June 2020

పాలాశదళ వృత్త గర్భ సీసము

పాలాశదళ వృత్త గర్భ సీసము

పరమ పురుష నిను ధరవరులు స్తుతియించేను మోహరహిత చిత్త వేగ
వరము లిడు ఘనుడు కరి వరదుడితడే శ్రీవత్స లక్ష్మణ సేవితుండు
కరుడని , భువిని తికమకలు దునుము దేవాది దేవుడనుచు ప్రణతులిడిరి
సురవర నుత నరవర శుభద యిటురారా భక్త మందార రమ్య దేహ

పేరుగల ప్రభువులలోన పేరు గొన్న
దొరవని నిను నమ్మితి స్వామి దురిత హరణ
శరణు జొచ్చితి గ్రక్కున వెరపు మాన్పు
నాగభూషణార్చిత వేగ నన్ను గావు!

పాలాశదళ వృత్తము (ననననన గగ యతి 11)

పరమ పురుష నిను ధరవరులు స్తుతియించే
వరము లిడు ఘనుడు కరి వరదుడితడే శ్రీ
కరుడని, భువిని తికమకలు దునుము దేవా!
సురవర నుత నరవర శుభద యిటురారా !

No comments:

Post a Comment