Tuesday 16 June 2020

మానినీ గర్భ సీసము

మానినీ గర్భ సీసము

పాప హరా! శివ !పావన రూపివి పావని సన్నుత పట్టువడను !
తాపస మౌనుల తన్విని దీర్చుచు  తాండవ మాడిన దక్ష హరుడ!
శాపము బాసిన చంద్రుని గాచిన శార్కర శూలివి ! సంకటమున !
కోపము జూపక కోరిన పత్రము కూర్మిని దెచ్చెద గోరమునను!

2. సన్నిధి జేరిన శాశ్వత కీర్తిని, సౌఖ్యము లిచ్చిన సామి వలెను!
సన్నుతి జేసిన సాదువులింట పసాదము కోరిన సాధువు గను!
పన్నగ భూషణ !పాహి యనంగనె పాపుల గావుము వాటము గను !
కన్నడి సేయక కానల యందున కావుము మమ్ముల కాలహరుడ!

3. కాలహరా! శివ! కార్తిక మందున కల్మష నాశక! కావు మిలను !
శూలకరా !శివ! శోభిత లింగమ! సోలెను కన్నులు సోయగమును !
పాలను పూలను పత్రము పండ్లను భక్తితొ దెచ్చితి పట్టు వడను !
ఆలయమందున నార్తిగ నిల్చితి యాపద బాపర! ఆరడమును !

4. తన్మయ మొందిన తాపసులెల్లరు తత్వము దెల్పిరి దత్పరతను  !
చిన్మయ రూపుడ! చింతలు దీర్చగ జేసెద పూజలు శ్రీకరినయి
సన్మతి నీయర శ్రావణ మందున సన్నిథి జేరగ శాంతము నను !
మన్మథ యత్నము మాడ్చిన దేవర మమ్ముల గాచుట మాన కిలను !

5. మక్కువ తోడను మౌనుల మానస మందిర మందున మాన్యుడవయి
చక్కగ చిక్కగ శార్కర రూపికి చక్కని పూవుల చందమునను
మ్రొక్కగ మిక్కిలి ముక్కలు జేసెడి రుక్కులు దీర్చర మోదము నను !
ప్రక్కన జేరితి పాదము జూపర !పాప వినాశక ! పాహి యనను !

🙏🙏

No comments:

Post a Comment